cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

Більше
Рекламні дописи
17 637
Підписники
-824 години
-197 днів
-10530 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

బాదంపప్పు - భిక్ష మేము తంజావూరులో ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు నా కలలో కనపడ్డారు. వారు నన్ను “నాకు బాదంపప్పు తేగలవా?” అని అడిగారు. వెంటనే మేము బాదంపప్పు కొని కాంచీపురం దగ్గర్లోని ఒరిక్కై అనే పల్లెటూరికి వెళ్ళాము. అప్పుడే పరమాచార్య స్వామివారు అన్నభిక్ష మాని కేవలం పేలాలు మాత్రమే తినడం మొదలుపెట్టారు. మేము తెచ్చిన బాదంపప్పు మహాస్వామి వారి భిక్షకు ఉపయోగించాలంటే ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు. ఒకావిడ మమ్మల్ని ఉగ్రాణం గోపాలయ్యర్ గారి వద్దకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు అతను ఆత్రుతతో ఏదో వెతుకుతూ కనిపించాడు. మమ్మల్ని చూడగానే “ఇప్పుడు నన్ను మాట్లాడించకండి. పెరియవ భిక్షకు సమయం అయ్యింది” అని చెప్పాడు. మేము అతనితో, “ఏమిటి మీరు వెతుకుతున్నారు? మేమైనా కొనితేగలమా?” అని అడిగాము. అతను బాధతో, “ఇప్పుడు బాదంపప్పు ఎక్కడ దొరుకుతుంది. ఒక్కరాత్రిలో మొత్తం ఉన్నదంతా చీమలు తిన్నాయి. ఈ విషయం మేనేజరుకు తెలిస్తే నామీద కోప్పడతారు. మీరు కాంచీపురం వెళ్తేనే అవి దొరుకుతాయి. కాని అప్పటికి స్వామివారి భిక్ష పూర్తి అయ్యుంటుంది” అని చెప్పారు. మా ఆనందానికి అవధులు లేవు. మేము కొని తెచ్చిన బాదంపప్పు అతనికి ఇచ్చాము. వాటిని చూడగానే గోపాలయ్యర్ ఊపిరి పీల్చుకున్నాడు. పరమాచార్య స్వామివారికి సంబంధించిన విషయాలు ఎవరి ప్రమేయము లేకుండా సాఫీగా సాగిపోతాయి. మావల్లే అవి జరిగితున్నాయి అనుకోవడం మన అతిశయం మాత్రమే. వారు ఆడించే ఆటలో మనం కేవలం పావులం మాత్రమే. --- జయలక్ష్మి అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4 #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Показати все...
రేపు జరగబోయే మందిర పునర్నిర్మాణ వార్షికోత్సవ పూజకు నూతన ఇత్తడి కవచంలో స్వర్ణకాంతులీనుతున్న మహాదేవుడు
Показати все...
ఎంతటి గొప్ప ఆశీస్సులు పొందారు వారిరువురు! --- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Показати все...
నువ్వు ఎక్కడున్నా నీవెంటే గుజరాత్ లో నివసించే ఒక కుటుంబం, వారిని పరమాచార్య స్వామివారు కాని, స్వామివారి వైభవం కాని ఏమీ తెలియవు. ఒకరోజు ఉదయం ఆ ఇంటావిడ తన భర్తని ఒక గుజరాతీ పత్రికను తెమ్మని చెప్పింది. భర్తకు ఏమి అర్థం కావడంలేదు. రోజూ దినపత్రిక చదివే అలవాటు ఆమెకు లేదు. ఆమెకే కాదు ఇంట్లో ఎవరికీ కూడా దినపత్రికలు కొనడం, చదవడం అలవాటు లేదు. దాంతో, అతనికి కొంత అయోమయంగా తోచి, ఆమె విజ్ఞాపనని పట్టించుకోలేదు. “నువ్వు రోజూ దినపత్రిక చదువుతావా? ముందు ఒక కప్పు టీ ఇవ్వు!” అని ఆమె మాటలను అతను పట్టించుకోలేదు. “ముందు వెళ్లి నాకు ఆ దినపత్రికని తెచ్చిపెట్టండి; తరువాతనే నేను టీ తయారుచేస్తాను” అని కొద్దిగా అభ్యర్థించింది. తన భార్య ఎందుకు ఇలా చెబుతోందో అర్థం కాక, బయటకు వెళ్లి ఆమే చెప్పిన పత్రికను కొనుక్కుని ఇంటికి తిరిగొచ్చాడు. ఇంకా ఇంటిలోకి అడుగుపెడుతుండగానే, ఆమె వచ్చి అతని చేతిలోని పత్రికను లాక్కొని, గబగబా పేజీలు తిప్పుతోంది. చివరి పేజిలో రామేశ్వరంలోని అగ్నితీర్థం దగ్గర నిర్మించిన శ్రీ ఆదిశంకర మంటప కుంబాభిషేకానికి సంబంధించిన పూర్తీ పేజీ ప్రకటన అది. అందులో దండంతో సహా నిలబడిన పరమాచార్య స్వామివారి నిలువెత్తు చిత్రాన్ని కూడా ముద్రించారు. మహాస్వామి వారి చిత్రం చూడగానే, ఆ గుజరాతీ వనిత ఆనదంతో “అవును! ఈయనే! అది ఈయనే!” అని సంతోషంతో అరవసాగింది. ఆవిడ భర్తకి ఏమి అర్థం కాకపోగా, ఆందోళన ఎక్కువ అయ్యింది. కొద్దిగా చికాకు పడుతూ, “ఏం మాట్లాడుతున్నావు? ఈ పత్రికను తీసుకురమ్మని చెప్పావు. తెచ్చి ఇచ్చిన తరువాత ‘ఈయనే! అది ఈయనే!’ అని అరుసున్నావు. అసలు ఏమయ్యింది నీకు?” అని అడిగాడు. “నా కలలో వచ్చిన మహాత్ముడు ఈయనే” అని ఆమె చెప్పడంతో, అయితే తనకు ఎదో కల వచ్చి ఉంటుంది అని అనుకున్నాడు. “సరే! నేకు ఎదో కల వచ్చింది. ఈయనే ఆ కలలో వచ్చిన వ్యక్తి అని నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు భర్త. తన కలను వివరంగా భర్తకు చెప్పింది. “నాకు ఒక కల వచ్చింది. నేను మన ఇంటి ముందర ఉదయాన్నే ముగ్గు వేస్తున్నాను. అప్పుడు న ముందు ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యారు. నాకు ఆయన సాధారణ ‘సన్యాసి’లా అనిపించలేదు. ఆయన దివ్య తేజస్సును చూసి నా శరీరం మొత్తం పులకించిపోయింది. వారిని లోపలకు రమ్మని ఆహ్వానించాలని అనుకున్నాను. ‘మీరు లోపలకు రారా?’ అని అడిగాను. ఆ మహాత్ముడు లోపలకు వచ్చి కూర్చున్నారు. వారిని నేను నమస్కారం చేశాను. వారు నాతో, ‘నీవు నన్ను చూడడానికి రాకపోయినా, నేను నిన్ను చూడడానికి వచ్చాను’ అని అన్నారు. నాకు ఏమి అర్థం కాలేదు. నేను వారితో, ‘స్వామి! మేరు ఎవరో నాకు తెలియదు. ఎక్కడుంటారో కూడా తెలియదు. మరి నేను మీవద్దకు వచ్చి, మిమ్మల్ని ఎలా దర్శించుకోగలను?’ అని అడిగాను. అప్పుడే స్వామివారు ఈ దినపత్రికను చూడమని చెప్పారు. అక్కడితో కల ఆగిపోవడంతో నేను నిద్ర నుండి మేల్కొన్నాను. అందుకే ఈ పత్రికను తీసుకునిరమ్మని నేను మిమ్మల్ని అడిగాను. ఇదిగో ఈ పత్రికలో ఇక్కడ ఉన్న మాహాత్ములే, నాకు కలలో కనబడిన స్వామివారు. వారు ఎక్కడున్నా సరే మనం వెళ్లి వారిని దర్శించుకోవాలి” భార్య చెప్పిన విషయాలు విని అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇది బహుశా దేవుని ఆజ్ఞయే అని అనుకున్నాడు. ఈ మహాత్ములు ఎక్కడుంటారో కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ‘కంచి కామకోటి పీఠం’ అని అక్కడ వ్రాసి ఉండడంతో ఇద్దరూ కాంచీపురం బయలుదేరారు. వారు కాంచీపురం చేరుకొని విచారించగా, పరమాచార్య స్వామివారు ఇక్కడలేరని ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నారని తెలుసుకున్నారు. వారు వదలకు అక్కడకు కూడా పయనమయ్యారు. వారు అక్కడకు చేరుకొని, వారు రావడానికి గల కారణాన్ని వివరంగా అక్కడున్న శిష్యులకు తెలిపారు. వారు అంతదూరం నుండి రావడం వల్ల బాగా అలసిపోయి ఉండడం వల్ల, శిష్యులు వారిని చూసి జాలిపడి, ముందుగా స్నానం చేసి, కాస్త ఏదైనా ఫలహారం తిని, తరువాత స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పారు. కాని వారు దానికి ఒప్పుకోలేదు. ముందు స్వామివారి దర్శనం తరువాతే ఏమైనా అని తెలపడంతో శిష్యులు లోపలకు వెళ్లి విషయం స్వామివారికి చెప్పారు. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. ఆమె స్వామివారిని చూసి “మీరే న దైవం; నేను ఎప్పటికి మీవద్దనే ఉంటాను” విపరీతంగా ఏడుస్తోంది. ఆమె కొంచం స్థిమితపడిన తరువాత స్వామివారు ఆమె ఎవరని, ఎక్కడ నుండి వచ్చారని, తన గురించి వాళ్లకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు అక్కడున్న వారికి స్వప్న దర్శన రహస్యం తెలియరాదని. “నా కలలో మిమ్మల్ని దర్శించాను” అని బదులిచ్చి మొత్తం జరిగిన విషయాన్ని స్వామివారికి చెప్పింది. స్వామివారు చిన్నగా నవ్వారు. “ఆ కల నీకు ఎప్పుడు వచ్చింది?” “వారం పది రోజుల ముందు” “ఆరోజు పౌర్ణమియే కదా?”, స్వామివారే స్వయంగా వెళ్లి ఆరోజు దర్శనం ఇచ్చిన విషయం అక్కడున్నవారికి అర్థమవ్వాలని అలా అడుగుతున్నారు. దేవుణ్ణి చూసిన ఆనందంతో, కళ్ళల్లో ఆనందభాష్పలు రాలుతుండగా, ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది. “దిగులు పడకు. నువ్వు ఎక్కడున్నా నేను నీవెంటే ఉంటా” అని స్వామివారు ఆ గుజరాతీ దంపతులను ఆశీర్వదించి పంపారు.
Показати все...
అందరికీ నమస్కారం బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన అద్వైత గోశాలలో మే 24న పరమాచార్య స్వామివారి జయంతి నిర్వహిస్తున్నాము. ఎవరెవరు రాగలరు?Anonymous voting
  • తప్పక వస్తాము
  • రాలేము
  • చెప్పలేము
0 votes
గంగాభిషేకం పుదుక్కొట్టై సంస్థానం రాజగురువు మహాభాష్యం అనంత గోపాలకృష్ణ శాస్త్రి గారి వంశంలో నేను జన్మించడం నా పూర్వజన్మ పుణ్యఫలితం. సదాశివ బ్రహ్మేంద్రులు మరియు గోపాలకృష్ణ శాస్త్రి గారు ఒకే వేద పాఠశాలలో చదువుకున్న సహ విద్యార్థులు. ఇద్దరూ ఒకే గురువు వద్దనే విద్యను అభ్యసించారు. సదాశివ బ్రహ్మేంద్రుల సూచన మేరకే మా పూర్వీకులైన గోపాలకృష్ణ శాస్త్రి గారిని రాజగురువుగా నియమించుకున్నారు పుదుక్కొట్టై రాజవంశస్థులు. పరమాచార్య స్వామివారు చాలాసార్లు మా పూర్వీకులు నివసించిన నమనసముద్రానికి విజయం చేశారు. 1965 అక్టోబరులో నేను స్వామివారిని దర్శించుకుని, నా కాశీయాత్రకు అనుగ్రహం వేడాను. మహాస్వామివారు కేవలం ఆశీస్సులు అందించడమే కాకుండా కాశీలో చెయ్యాల్సిన కొన్ని పనుల గురించి కూడా విపులంగా తెలిపారు. ముఖ్యంగా పండితులతో ఒక విద్వత్ సదస్సు నిర్వహించమని, అలాగే కాశీలో ఉన్న సన్యాసులందరికి ఒకరోజు భిక్ష ఇవ్వమని. “ముసలి దంపతులు - భార్య, భర్త కాశీయాత్ర చేయాలని చాలా కోరికతో ఉన్నారు. కాని వారివద్ద తగినంత ధనం లేదు. వారిని నీతోపాటు తీసుకెళ్లగలవా?” అని అడిగారు స్వామివారు. అది గొప్ప అదృష్టంగా భావించి నేను అంగీకరించాను. మహాస్వామివారి కోసం ప్రయాగలో ఒక పాత్రలో శుద్ధ గంగాజలాన్ని తీసుకున్నాను. స్వామివారు కాళహస్తిలో ఉన్నప్పుడు, 27-11-1963న ఆ పవిత్ర జలపాత్రని స్వామివారికి సమర్పించాను. తరువాత స్వామివారు చెన్నై దగ్గర్లోని చోళవరంలో ఉన్నప్పుడు నేను స్వామివారిని దర్శించుకుని అక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు ఉదయం పదకొండుగంటలప్పుడు మాధ్యాహ్నిక స్నానం కోసం పరమాచార్య స్వామివారు దగ్గర్లోని కోలనుకు బయలుదేరి వెళ్ళారు. “అయ్యా మీరు గంగాజలం ఉన్న పాత్రతో స్వామివారి వెనుకే వెళ్ళండి. ఈరోజు పరమాచార్య స్వామివారు మీరు తెచ్చిన గంగాజలంతోనే స్నానం చెయ్యబోతున్నారు” అని స్వామివారి సేవకులొకరు తెలిపారు. నేను, నా భార్య కొలను వద్దకు పరిగెత్తాము. మహాస్వామి వారు కొలను మధ్యలో నిలుచుని ఉన్నారు. నా భార్య నా పక్కన నిలబడి ఉండగా, పరమాచార్య స్వామివారికి న చేతులతో గంగాభిషేకం చేశాను. మా పూర్వీకులు మహాభాష్యం అనంత గోపాలకృష్ణ శాస్త్రి గారు చేసిన పుణ్య ఫలితంగా నాకు ఈ అరుదైన అవకాశం లభించింది. --- శ్రీ సచ్చిదానంద స్వామి, తిరుకుర్రాళం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 7 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/kpdstrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Показати все...
కావేరి నుండి నేరుగా వచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం, నేను మ బావగారు శ్రీ ఆత్మనాథన్ తో కలిసి ఒరిరిక్కై వెళ్లాను. అక్కడ కడుతున్న పరమాచార్య మణిమండపం విశేషాలను చూడాలన్న కోరిక నాకు. పల్లవుల కాలం నాటి శిల్ప లోకంలో ఉలి చేసే సంగీతాన్ని వినాలని వెళ్ళిన నాకు నిరాశే ఎదురయ్యింది. అక్కడ ఏమీ లేదు. ఆదివారం మధ్యాహ్నం కావడం వల్లనేమో అక్కడ కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారు కూడా భోజన విరామానికి వెళ్ళారు. అంత పెద్ద స్థలం అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న కొట్టాలు మాత్రమే ఉన్నాయి. ఇంత పెద్ద స్థలంలో, అత్యంత అద్భుతంగా ఉన్న శిల్ప సౌందర్యం, సుశిక్షితులైన శిల్పాచార్యుల శిల్ప విన్యాసం, ఈ కార్యానికి సహకరిస్తున్న అతి సామాన్య జనం గురించి ఒకసారి తలచుకోగానే, పరమాచార్య స్వామివారి విశ్వరూపం నా కళ్ళ ఎదుట మెదిలింది. మొదటి సారి నేను స్వామివారిని దర్శించుకున్న సంఘటన జ్ఞాపకం వచ్చి ఆ అనుభావాన్ని మరలా అనుభూతి చెందాను. అది 1940వ సంవత్సరం. నా పెద్ద అన్నయ్య తిరువలుళుందూర్ లో ఉండేవారు. అక్కడ ఉన్న రిషభ కట్టంలో మహాస్వామివారు స్నానమాచరిస్తున్నారని తెలుసుకుని నా స్నేహితురాలు భవాని మామితో కలిసి అక్కడకు వెళ్లాను. మేము హడావిడిగా మాయవరం కావేరీ నది ఒడ్డుకు చేరుకోగానే, స్వామివారు అటువైపున ఉన్న ఒడ్డుపై కనబడ్డారు. అక్కడ ఎక్కువమంది భక్తులు ఉన్నారు. అంత రద్దీలో మామి నా చేయి పట్టుకుని నది దాటించారు. స్వామివారి చుట్టూ ఉన్న ఆ భక్తుల గుంపును మేము చేరుకున్నాము - అంతే!! ఒక్క క్షణం స్వామివారు మొత్తం గుంపును కలియచూసి, మేనా ఎక్కి వెళ్ళిపోయారు. మేము బాధతో, దిగులుగా ఇంటికి చేరుకున్నాము. మా నాన్నగారు ఆ మామితో నన్ను స్వామివారు ఉంటున్న గ్రామానికి పంపించారు. మేము ఆ గ్రామం చేరుకొని, స్వామివారు ఉంటున్న ఇంటి మధ్యలో ఉన్న విశాల ప్రాంగణంలోకి ప్రవేశించాము. అప్పటికే పూజ అయిపొయింది. స్వామివారు ఆ ఆవరణం పక్కగా ఉంది కొందరితో మాట్లాడుతున్నారు. మేము స్వామివారికి పంచాంగ నమస్కారం చేసి నిలబడగానే, స్వామివారి శిష్యులొకరు, “మీరు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగారు. మేము సమాధానం చెప్పడానికి నోరు తెరవబోయేంతలో “మాయవరం నుండి, కావేరి నుండి నేరుగా వచ్చారు” అని స్వామివారే చెప్పారు. నా ఆశ్చర్యానికి మాటలులేవు. దాదాపు వంద మంది స్వామివారి చుట్టూ ఉండగా అప్పుడే అక్కడకు వచ్చి గుంపు బయటే ఉండిపోయిన ఇద్దరు ఆడవాళ్ళని ఎలా గుర్తుపట్టగలిగారు? అప్పటికే మేనా ఎక్కారు. ఇది ఎలా సాధ్యం? ఆ పారవశ్యానికి కలిగిన ప్రకంపనలతో కనీసం మాట్లాడడానికి కూడా కావడం లేదు. నేను అలా నిశ్చేష్టురాలై చూస్తూ ఉంటే, మామి మా విషయాలు స్వామివారికి తెలిపింది. మా ఆయన, మా మామగారి గురించి అడిగి, ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపారు. ఈనాటికి అప్పటి ప్రకంపనలు అలాగే ఉన్నాయి. స్వామివారి ప్రథమ దర్శనం తరువాత పద్దెనిమిదేళ్ళకు ఇలాంటిదే మరొక సంఘటన జరిగింది. అప్పుడు మేము వేలూరులో ఉండేవాళ్ళం. ఒకసారి నా భర్తతో, “కళ్ళనిండుగా, ప్రశాంతంగా పరమాచార్య స్వామివారిని దర్శించుకోవాలని కోరికగా ఉందని” నా భర్తకు తెలిపాను. అందుకు వారు, “సరే నువ్వు ఇవ్వాళే వెళ్లి నాలుగు రోజులపాటు అక్కడే ఉండి మనస్సు నిండుగా స్వామివారిని దర్శించుకో. నాలుగు రోజుల తరువాత నేను కార్యాలయం పనిపై చెన్నై రావాల్సిఉంది. తిరుగుప్రయాణంలో నేతోపాటు చెన్నై వస్తాను” అని తెలిపారు. ఆనందంతో నేను బయలుదేరాను. అప్పుడు మహాస్వామివారు చెన్నై సంస్కృత కళాశాల ఆవరణంలో మకాం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయమే వెళ్లి, పూజ చూసి, తీర్థం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసేదాన్ని. మరలా సాయంత్రం వెళ్లి, పూజ చూసి, స్వామివారు చెప్పే ఉపన్యాసాన్ని విని తిరిగొచ్చేదాన్ని. భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండడంతో, నేను స్వామివారి దగ్గరకు వెళ్లి, నమస్కరించి ఆశీస్సులు పొందలేకపోయేదాన్ని. నేను వేలూరుకు వెళ్ళిపోవాల్సిన రోజు కూడా వచ్చింది. సాయంత్రం పూజ సమయానికి వచ్చే మావారికి నన్ను కనుక్కోవడం ఇబ్బందిగా ఉంటుందని, అక్కడ ఉన్న పెద్ద పందిరి కింద అందరికీ చివర్లో నిలుచుని ఉన్నాను. నిస్పృహతో, కొద్ది ఆశతో వేదికవైపు చూస్తున్నాను. నా భర్త వచ్చి, “కళ్ళనిండుగా స్వామివారిని దర్శించుకున్నవా?” అని నన్ను అడిగారు. నేను కొంచం నిరాశగా, “అవును. కళ్ళ నిండా దర్శనం, చెవుల నిండా మాటలు అయ్యాయి కాని ఒక్కసారి కూడా స్వామివారి దగ్గరకు వెళ్లి నమస్కారం చేయలేకపోయాను” అని చెప్పాను. “ఒకవారం రోజులపాటు పరమాచార్య స్వామివారు దృష్టి దీక్షణీయంలో ఉన్నావు. స్వామివారి కరుణలో తడిసిపోయావు. ఇంకా నీకు కొరతగా ఉందా? స్వామివారే నిన్ను చూసి, తమని తాము పరిచయం చేసుకుని ‘ఎలా ఉన్నావు?’ అని అడగాలనుకుంటున్నావా? నువ్వేమైనా అంత ప్రముఖ వ్యక్తివా? నీది కేవలం ఆశ కాదు, అత్యాశ” అని అన్నారు నా భర్త. “వెళ్దాం పద, మనం ఈ రాత్రికే వేలూరు చేరుకోవాలి” అని తొందరపెట్టసాగారు నా భర్త. ఎవరో మా వారిని భుజం తట్టి “మీరు పద్మనాభన్ కదూ? పరమాచార్య స్వామివారు మిమ్మల్ని, అనుత్తమ గారిని ముందుకు రమ్మన్నారు” అని తెలిపారు.
Показати все...
అక్కడున్న అందరూ దారి వదలడంతో ఆశ్చర్యంతో ముందుకు వెళ్ళాము. మేము స్వామివారికి నమస్కరించి లేచి నిలబడగానే, నన్ను చూసి నవ్వి మొదలుపెట్టారు, “మాయవరంలో మీ నాన్నగారు . . .” వెంటనే నేను నా అతితెలివితో స్వామివారి మాటలకూ అడ్డుపడుతూ, “ఇప్పుడు మా నాన్నగారు శరీరంతో లేరు” అన్నాను. దాంతో స్వామివారు, “కాదు, కాదు, ఇప్పుడు కాదు, అప్పట్లో జరిగిన విషయం. అప్పుడు మీరందరూ మీ అన్నగారి ఇంట్లో సీమంతం అన్న వార్తతో నా వద్దకు వచ్చారు” అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. శరీరం మొత్తం పరవశంలో మునిగిపోయింది. తరువాత స్వామివారు మా ఆయన్ని, “ఏమిటోయ్! మీ ఇంట్లో భిక్ష చేశాను గుర్తుందా?” అని అడిగారు. “స్వామివారు ఇలా అడిగితే, నేను ఏమని సమాధానం చెప్పగలను” అన్నారు నా భర్త. వెంటనే స్వామివారు పెద్దగా నవ్వి శిష్యునితో ప్రసాదం పళ్ళెం తెమ్మన్నారు. విభూతి, కుంకుమ, మంత్రాక్షతలు ఉన్న వెదురు తట్టను తెచ్చారు. ఒక పండును తెమ్మని సైగచేశారు స్వామివారు. ఒక బత్తాయి పండు తెచ్చారు. దాన్ని స్వామివారు అటు ఇటు తిప్పి చూసి, ఒకసారి గుండెలపై ఉంచుకుని పళ్ళెంలో ఉంచారు. “ఇద్దరూ కలసి దీన్ని స్వీకరించండి” అని ఆజ్ఞాపించారు. మేము ఇద్దరమూ స్వామివారికి నమస్కరించి లేవగానే, “అనుత్తమ, తృప్తిగా ఉందా?” అని అడిగారు. నా కళ్ళు వర్షించాయి. నాలుక పైదవడకు అతుక్కుపోయింది. స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నాము. వేలమంది దాసానుదాసులు ఉన్న ఒక మహాత్ముడు, భువిపై నడయాడే దేవుడు, కనీసం శ్రీవారి సన్నిధిలో నిలబడడానికి కూడా అర్హత ఉందొ లేదో తెలియని ఒక సాధారణ మహిళకు సంబంధించిన ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటనను గుర్తుచేసుకున్నారు. మరి ఆ మహిళ హృదయాన్ని ఎలా ఆవిష్కరించగలం? ఆ పరవశం, అనుభూతి ఇప్పటికి మదిలో తాజాగా ఉంది. [‘అనుత్తమ’ అన్న కలంపేరుతో శ్రీమతి రాజేశ్వరి పద్మనాభన్ గారు 1960 - 90లలో ఎన్నో తమిళ కాల్పనిక రచనలు చేసిన రచయిత్రి] --- అనుత్తమ, ‘జ్ఞాన ఆలయం’ పత్రిక నుండి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/kpdstrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Показати все...
కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/kpdstrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Показати все...
కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202