cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

Ko'proq ko'rsatish
Reklama postlari
17 637
Obunachilar
-824 soatlar
-197 kunlar
-10530 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

జయ జయ శంకర !! హర హర శంకర !! పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో, కాశీ విశ్వనాథుని కృపవల్ల మనందరి భాగ్యవశాన అవిముక్త వారణాసి క్షేత్రంలో, పరమ పావని అయిన గంగమ్మ ఒడ్డున, బద్రినారాయణ్ ఘాట్ లో శిథిలావస్థలో ఉన్న శ్రీ కాశీఖండోక్త నాగేశ్వర్/నరనారాయణేశ్వర్ మహాదేవుని ఆలయం పునర్నిర్మాణం చేయించి సరిగ్గా నేటికీ (చైత్ర కృష్ణ ఏకాదశి) సంవత్సరం అయ్యింది. కాశీలో పాత శివాలయ పునర్నిర్మాణం అన్నది అంత తేలికగా లభించే అవకాశం కాదు. కానీ కేవలం కరుణాసముద్రులైన పరమాచార్య స్వామివారి కృపవల్ల మనకు ఆ భాగ్యం లభించింది. అపర శంకరులైన మహాస్వామి వారి అనుగ్రహం వల్ల నూతన ఆలయం నిర్మాణం పూర్తయ్యి, పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారి దంపతులచే తొలి పూజ జరగడం మనందరి అదృష్టం. ఆలయ ప్రథమ వార్షికోత్సవ సందర్బంగా మహాదేవునికి ఇత్తడి కవచం చేయించడానికి మీరందరూ ఎంతగానో సహకరించారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆదిగురువుల, జగద్గురువుల ఆశీస్సులు. ఈ సందర్బంగా నాగేశ్వర్ మహాదేవునికి ఇత్తడి కవచ సమర్పణ, వార్షికోత్సవ పూజ, అన్నదానం చాలా గొప్పగా జరిగాయి. వీటన్నిటికీ మూలకారణమైన కాశీ యోగిని గా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న మాతాజీ గారికి సాష్టాంగ వందనాలు సమర్పించుకుంటున్నాము. దాతలు, సభ్యులు మరియు కార్యనిర్వాహకులు కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్
Hammasini ko'rsatish...
బాదంపప్పు - భిక్ష మేము తంజావూరులో ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు నా కలలో కనపడ్డారు. వారు నన్ను “నాకు బాదంపప్పు తేగలవా?” అని అడిగారు. వెంటనే మేము బాదంపప్పు కొని కాంచీపురం దగ్గర్లోని ఒరిక్కై అనే పల్లెటూరికి వెళ్ళాము. అప్పుడే పరమాచార్య స్వామివారు అన్నభిక్ష మాని కేవలం పేలాలు మాత్రమే తినడం మొదలుపెట్టారు. మేము తెచ్చిన బాదంపప్పు మహాస్వామి వారి భిక్షకు ఉపయోగించాలంటే ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు. ఒకావిడ మమ్మల్ని ఉగ్రాణం గోపాలయ్యర్ గారి వద్దకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు అతను ఆత్రుతతో ఏదో వెతుకుతూ కనిపించాడు. మమ్మల్ని చూడగానే “ఇప్పుడు నన్ను మాట్లాడించకండి. పెరియవ భిక్షకు సమయం అయ్యింది” అని చెప్పాడు. మేము అతనితో, “ఏమిటి మీరు వెతుకుతున్నారు? మేమైనా కొనితేగలమా?” అని అడిగాము. అతను బాధతో, “ఇప్పుడు బాదంపప్పు ఎక్కడ దొరుకుతుంది. ఒక్కరాత్రిలో మొత్తం ఉన్నదంతా చీమలు తిన్నాయి. ఈ విషయం మేనేజరుకు తెలిస్తే నామీద కోప్పడతారు. మీరు కాంచీపురం వెళ్తేనే అవి దొరుకుతాయి. కాని అప్పటికి స్వామివారి భిక్ష పూర్తి అయ్యుంటుంది” అని చెప్పారు. మా ఆనందానికి అవధులు లేవు. మేము కొని తెచ్చిన బాదంపప్పు అతనికి ఇచ్చాము. వాటిని చూడగానే గోపాలయ్యర్ ఊపిరి పీల్చుకున్నాడు. పరమాచార్య స్వామివారికి సంబంధించిన విషయాలు ఎవరి ప్రమేయము లేకుండా సాఫీగా సాగిపోతాయి. మావల్లే అవి జరిగితున్నాయి అనుకోవడం మన అతిశయం మాత్రమే. వారు ఆడించే ఆటలో మనం కేవలం పావులం మాత్రమే. --- జయలక్ష్మి అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4 #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Hammasini ko'rsatish...
రేపు జరగబోయే మందిర పునర్నిర్మాణ వార్షికోత్సవ పూజకు నూతన ఇత్తడి కవచంలో స్వర్ణకాంతులీనుతున్న మహాదేవుడు
Hammasini ko'rsatish...
ఎంతటి గొప్ప ఆశీస్సులు పొందారు వారిరువురు! --- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Hammasini ko'rsatish...
నువ్వు ఎక్కడున్నా నీవెంటే గుజరాత్ లో నివసించే ఒక కుటుంబం, వారిని పరమాచార్య స్వామివారు కాని, స్వామివారి వైభవం కాని ఏమీ తెలియవు. ఒకరోజు ఉదయం ఆ ఇంటావిడ తన భర్తని ఒక గుజరాతీ పత్రికను తెమ్మని చెప్పింది. భర్తకు ఏమి అర్థం కావడంలేదు. రోజూ దినపత్రిక చదివే అలవాటు ఆమెకు లేదు. ఆమెకే కాదు ఇంట్లో ఎవరికీ కూడా దినపత్రికలు కొనడం, చదవడం అలవాటు లేదు. దాంతో, అతనికి కొంత అయోమయంగా తోచి, ఆమె విజ్ఞాపనని పట్టించుకోలేదు. “నువ్వు రోజూ దినపత్రిక చదువుతావా? ముందు ఒక కప్పు టీ ఇవ్వు!” అని ఆమె మాటలను అతను పట్టించుకోలేదు. “ముందు వెళ్లి నాకు ఆ దినపత్రికని తెచ్చిపెట్టండి; తరువాతనే నేను టీ తయారుచేస్తాను” అని కొద్దిగా అభ్యర్థించింది. తన భార్య ఎందుకు ఇలా చెబుతోందో అర్థం కాక, బయటకు వెళ్లి ఆమే చెప్పిన పత్రికను కొనుక్కుని ఇంటికి తిరిగొచ్చాడు. ఇంకా ఇంటిలోకి అడుగుపెడుతుండగానే, ఆమె వచ్చి అతని చేతిలోని పత్రికను లాక్కొని, గబగబా పేజీలు తిప్పుతోంది. చివరి పేజిలో రామేశ్వరంలోని అగ్నితీర్థం దగ్గర నిర్మించిన శ్రీ ఆదిశంకర మంటప కుంబాభిషేకానికి సంబంధించిన పూర్తీ పేజీ ప్రకటన అది. అందులో దండంతో సహా నిలబడిన పరమాచార్య స్వామివారి నిలువెత్తు చిత్రాన్ని కూడా ముద్రించారు. మహాస్వామి వారి చిత్రం చూడగానే, ఆ గుజరాతీ వనిత ఆనదంతో “అవును! ఈయనే! అది ఈయనే!” అని సంతోషంతో అరవసాగింది. ఆవిడ భర్తకి ఏమి అర్థం కాకపోగా, ఆందోళన ఎక్కువ అయ్యింది. కొద్దిగా చికాకు పడుతూ, “ఏం మాట్లాడుతున్నావు? ఈ పత్రికను తీసుకురమ్మని చెప్పావు. తెచ్చి ఇచ్చిన తరువాత ‘ఈయనే! అది ఈయనే!’ అని అరుసున్నావు. అసలు ఏమయ్యింది నీకు?” అని అడిగాడు. “నా కలలో వచ్చిన మహాత్ముడు ఈయనే” అని ఆమె చెప్పడంతో, అయితే తనకు ఎదో కల వచ్చి ఉంటుంది అని అనుకున్నాడు. “సరే! నేకు ఎదో కల వచ్చింది. ఈయనే ఆ కలలో వచ్చిన వ్యక్తి అని నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు భర్త. తన కలను వివరంగా భర్తకు చెప్పింది. “నాకు ఒక కల వచ్చింది. నేను మన ఇంటి ముందర ఉదయాన్నే ముగ్గు వేస్తున్నాను. అప్పుడు న ముందు ఒక సన్యాసి ప్రత్యక్షమయ్యారు. నాకు ఆయన సాధారణ ‘సన్యాసి’లా అనిపించలేదు. ఆయన దివ్య తేజస్సును చూసి నా శరీరం మొత్తం పులకించిపోయింది. వారిని లోపలకు రమ్మని ఆహ్వానించాలని అనుకున్నాను. ‘మీరు లోపలకు రారా?’ అని అడిగాను. ఆ మహాత్ముడు లోపలకు వచ్చి కూర్చున్నారు. వారిని నేను నమస్కారం చేశాను. వారు నాతో, ‘నీవు నన్ను చూడడానికి రాకపోయినా, నేను నిన్ను చూడడానికి వచ్చాను’ అని అన్నారు. నాకు ఏమి అర్థం కాలేదు. నేను వారితో, ‘స్వామి! మేరు ఎవరో నాకు తెలియదు. ఎక్కడుంటారో కూడా తెలియదు. మరి నేను మీవద్దకు వచ్చి, మిమ్మల్ని ఎలా దర్శించుకోగలను?’ అని అడిగాను. అప్పుడే స్వామివారు ఈ దినపత్రికను చూడమని చెప్పారు. అక్కడితో కల ఆగిపోవడంతో నేను నిద్ర నుండి మేల్కొన్నాను. అందుకే ఈ పత్రికను తీసుకునిరమ్మని నేను మిమ్మల్ని అడిగాను. ఇదిగో ఈ పత్రికలో ఇక్కడ ఉన్న మాహాత్ములే, నాకు కలలో కనబడిన స్వామివారు. వారు ఎక్కడున్నా సరే మనం వెళ్లి వారిని దర్శించుకోవాలి” భార్య చెప్పిన విషయాలు విని అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇది బహుశా దేవుని ఆజ్ఞయే అని అనుకున్నాడు. ఈ మహాత్ములు ఎక్కడుంటారో కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ‘కంచి కామకోటి పీఠం’ అని అక్కడ వ్రాసి ఉండడంతో ఇద్దరూ కాంచీపురం బయలుదేరారు. వారు కాంచీపురం చేరుకొని విచారించగా, పరమాచార్య స్వామివారు ఇక్కడలేరని ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నారని తెలుసుకున్నారు. వారు వదలకు అక్కడకు కూడా పయనమయ్యారు. వారు అక్కడకు చేరుకొని, వారు రావడానికి గల కారణాన్ని వివరంగా అక్కడున్న శిష్యులకు తెలిపారు. వారు అంతదూరం నుండి రావడం వల్ల బాగా అలసిపోయి ఉండడం వల్ల, శిష్యులు వారిని చూసి జాలిపడి, ముందుగా స్నానం చేసి, కాస్త ఏదైనా ఫలహారం తిని, తరువాత స్వామివారి దర్శనానికి రమ్మని చెప్పారు. కాని వారు దానికి ఒప్పుకోలేదు. ముందు స్వామివారి దర్శనం తరువాతే ఏమైనా అని తెలపడంతో శిష్యులు లోపలకు వెళ్లి విషయం స్వామివారికి చెప్పారు. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. ఆమె స్వామివారిని చూసి “మీరే న దైవం; నేను ఎప్పటికి మీవద్దనే ఉంటాను” విపరీతంగా ఏడుస్తోంది. ఆమె కొంచం స్థిమితపడిన తరువాత స్వామివారు ఆమె ఎవరని, ఎక్కడ నుండి వచ్చారని, తన గురించి వాళ్లకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు అక్కడున్న వారికి స్వప్న దర్శన రహస్యం తెలియరాదని. “నా కలలో మిమ్మల్ని దర్శించాను” అని బదులిచ్చి మొత్తం జరిగిన విషయాన్ని స్వామివారికి చెప్పింది. స్వామివారు చిన్నగా నవ్వారు. “ఆ కల నీకు ఎప్పుడు వచ్చింది?” “వారం పది రోజుల ముందు” “ఆరోజు పౌర్ణమియే కదా?”, స్వామివారే స్వయంగా వెళ్లి ఆరోజు దర్శనం ఇచ్చిన విషయం అక్కడున్నవారికి అర్థమవ్వాలని అలా అడుగుతున్నారు. దేవుణ్ణి చూసిన ఆనందంతో, కళ్ళల్లో ఆనందభాష్పలు రాలుతుండగా, ఆమె స్వామివారికి పంచాంగ నమస్కారం చేసింది. “దిగులు పడకు. నువ్వు ఎక్కడున్నా నేను నీవెంటే ఉంటా” అని స్వామివారు ఆ గుజరాతీ దంపతులను ఆశీర్వదించి పంపారు.
Hammasini ko'rsatish...
అందరికీ నమస్కారం బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన అద్వైత గోశాలలో మే 24న పరమాచార్య స్వామివారి జయంతి నిర్వహిస్తున్నాము. ఎవరెవరు రాగలరు?Anonymous voting
  • తప్పక వస్తాము
  • రాలేము
  • చెప్పలేము
0 votes