cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

SCHOOL AND EDUCATION

Show more
Advertising posts
564
Subscribers
-124 hours
+17 days
+1030 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
440Loading...
02
*📡సందేహాలు - సమాధానాలు✍️* 1. సందేహం: *"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?* సమాధానం: *1933 APLR రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్స్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.* 2. సందేహం: *నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను. సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?* సమాధానం: *వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.* 3. సందేహం: *నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను. ఇంటర్, డిగ్రీ, హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు. ఎందుకని?* సమాధానం: *మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.* 4. సందేహం: *నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను. నాకు పెన్షన్ ఎంత వస్తుంది?* సమాధానం: *చివరి మూలవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.*
1110Loading...
03
💥💥 *తెలంగాణ రాష్ట్ర గీతం* 💥💥 (2.30 నిమిషాల నిడివి) 1. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ.... 2. జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నాగానం అమ్మనీవే మా ప్రాణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ... 3. గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ....
1200Loading...
04
*_పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?_* _(వివక్షతను మించిన విషం ఉంటుందా!!?)_ *=================* _|మనసును కదిలించే కథ... చదవండి! 🙏|_ *కరీంనగర్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా, పక్కనే ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా school కే పంపడం. ఇంకా ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్లంటేనే పడదు. అలాంటిది మళ్లీ ఈ ఊరమాస్ పిల్లలకు చదువు చెప్పాలి. "దేవుడా ! ఏంటీ పరీక్ష" అని రోజూ చిరాకుతో కూడిన చిర్రబుర్రులతోనే బడికి వెళ్లేదాన్ని.* *అందులో ఒక్కణ్ణి చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాణ్ని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు మూడో తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకొనేవాడు. ఆరాతీస్తే, వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పని చేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని, పంపిస్తూన్నా రనిపించింది.* *నా దృష్టిలో అయితే వాడు చాలా poor student. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్ప చెప్పమన్నా కూడా వాడికి 5 కి మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అస్సలు వాడి వైపు చూడ్డం కానీ, మాట్లాడటం కానీ అస్సలు చేసేదాన్ని కాదు.* *అలాంటోడు కొన్ని రోజులుగా school ki రావడమే మానేశాడు. ఇలాంటి places లో school ki రావడం, మానేయడం వీళ్ళకు మామూలే కదా! అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు...* *ఒకరోజు హెడ్మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఆయనకెదురుగా ముప్పై ఏళ్ళున్న ఒక labour ఆవిడ చేతులు కట్టుకుని నిల్చుని ఉంది.* *ఆవిణ్ణి నాకు పరిచయం చేస్తూ.. _"ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు పదిరోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడంట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది madam ఒక్కసారి మాట్లాడండీ"_ అన్నారు హెడ్మాస్టర్.* *వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్లెంబడి నీళ్లతో కుప్పకూలి, మేడమ్..! వాడు పోయే ముందు ఎప్పుడూ... _"నళిని మేడమ్ తో ఒక్కసారన్నా good అనిపించుకోవాలి అమ్మా"_ అని నాతో రోజూ చెప్పేవాడు.* *వాడు చనిపోయే ముందురోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా...! వాడు తనకు తానే _" సాంబడు good"_ అని పుస్తకంలో రాసుకొని మీ లాగే సంతకం చేసుకున్నాడు," అని తాను తెచ్చుకున్న సంచిలోనుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళ మ్మ... నాకళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటిబొట్లతో వాడు పెట్టిన నా.. నా.. సంతకం తడిసి, పేజీ ముద్దగా అవుతోంది. నాకు దుఃఖం ఆగడంలేదు.* *వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాణ్ని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూళ్ళేదు వాణ్ని.* *పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో! _"తండ్రీ ఎక్కడున్నా నన్ను క్షమించు... జాతి, వర్ణ, ఆర్ధిక బేధాలతో.. వివక్షలతో చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్దమనుషులను కూడా క్షమించరా"😌_ అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ...* *_“సాంబడు is Very Good” నాలాంటి ఎందరో కళ్లు తెరిపించావు తండ్రీ!_ అని అదే బుక్ లో రాసి ఆ గదిలోనే ఉన్న bench మీద కూర్చుని హెడ్మాస్టర్ గారి వెనుక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి _"తప్పు చేశాను సార్! 🙏ఇక మీదట ఇలా జరగదు"_ అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను.* 😌 *_దయచేసి పిల్లలని ప్రేమించండి.🙏_* _మీ...._ _—నళిని టీచర్_ — *Written by ✍️ Challa SridharReddy, software engineer, Telangana*— *:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:* *_{ఇదిసేకరణే.... ఈ కథను తెలంగాణకు చెందిన 'చల్లా శ్రీధర్ రెడ్డి' అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాశారు. నాకు పర్సనల్ గా పంపించారు. చదువుతూంటే నా మనసు కదిలింది.. కళ్ళు చెమ్మగిల్లాయి. అందరూ చదవాల్సింది.. ముఖ్యంగా టీచర్లు. అందుకే.. మీతో పంచుకుంటున్నాను.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
970Loading...
05
తెలంగాణ కొత్త గీతం
790Loading...
06
*🔊రేపే జూన్1....అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే* *🍥జూన్ 1వ తేదీ నుంచి పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి* *💠ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌* *❇️ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. కేంద్రం ప్రభుత్వం కొన్ని నెలల కిందట ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు జూన్ 14తో ముగియనున్నది. ఈ గడువు తేదీ ముగిసిన తర్వాత ప్రతీ అప్డేట్‌ చేసుకోవాలనుకుంటే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు గడువులోగా ఆధార్ అప్ డేట్ చేసుకుంటే ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు* *🥏డ్రైవింగ్‌ లైసెన్స్‌* *✡️సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కి అర్హత సాధించవచ్చు. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కేంద్రాలకు వెళ్లకుండానే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీవోల ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త రూల్ ప్రవేశపెట్టింది* *🔹ట్రాఫిక్స్‌ రూల్స్* *🌀మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆ వెహికిల్ రిజిస్ట్రేషన్‌ని రద్దుచేస్తారు. ఆ మైనర్‌కు పాతికేళ్లు వచ్చేంత వరకూ డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. ఓవర్ స్పీడ్‌కి రూ.వెయ్యి నుంచి 2 వేల వరకూ జరిమానా విధించనున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు* *♦️గ్యాస్‌ ధరలు* *💥నిత్యావసరమైన గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ సారి సిలిండర్ ధరలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. లేదంటే నిలకడగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో రేపు ఉదయం తెలుస్తుంది. అందువల్ల సిలిండర్ ధరలు ఎలా అయినా కదలొచ్చు. పెరిగితే మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంది*
800Loading...
07
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
810Loading...
08
*📡సందేహాలు - సమాధానాలు ✍️* ◼◼◼◼◼◼◼◼◼◼ *❓ప్రశ్న:* వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు?? *✅జవాబు:* వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు. ••••••••• * ❓ప్రశ్న:* సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు?? *✅జవాబు:* ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు. ••••••••• *❓ప్రశ్న:* బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి?? *✅జవాబు:* ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.
1050Loading...
09
*బడి బాటలో ప్రధానోపాధ్యాయుల పాత్ర..*
900Loading...
10
అవినీతి జరుగుతుందని తెలిసినా.. లేదా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి లంచం అడిగినా.. ACB డిపార్టుమెంట్ నెంబర్లను సంప్రదించగలరు. #తెలంగాణ_రాష్ట్ర_ఏసీబీ_కాంటాక్ట్_నెంబర్స్: ACB WhatsApp: 9440446106 Toll free Number: 1064 Head Quarters: 04023251501. 1. Hyderabad City Range-I: 040-24617291 9440446109. 2. Hyderabad City Range-II: 040-24617408 9440446134. 3. Ranga Reddy Range: 040-24610142 9440446140. 4. Mahabub Nagar Range: 08542-242733 9491305609. 5. Nalgonda Range: 08682-225681 7382625525. 6. Warangal Range: 0870-2577510 9440446146. 7. Karimnagar Range: 0878-2243693 9440446166. 8. Nizamabad Range: 08462-237450 9440446149. 9. Medak Range: 08455-276522 9440446149. 10. Adilabad Range: 08732-226307 9440446166. 11. Khammam Range: 08742-228663 9440446146. 🇮🇳🫱🏾‍🫲🏼🇮🇳 అవినీతి అంతం వైపు అడుగులు వేయండి తెలంగాణ వినియోగదారుల ఫోరం. 🙏🙏🙏
941Loading...
11
*📡బడి బాటా అమలు ప్రణాళిక✍️* *💥బడి బాట కార్యక్రమం 2024-25 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 03.06.2024 నుండి 19.06.2024 వరకు పాఠశాల వయస్సు పిల్లల నమోదు కోసం నిర్వహించబడుతుంది* *▶️కార్యక్రమం యొక్క లక్ష్యాలు:* 1. ఆవాసాలలో పాఠశాల వయస్సు పిల్లలందరినీ గుర్తించడం మరియు వారిని సమీప పాఠశాలల్లో చేర్పించడం. 2. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును పెంచడం మరియు నాణ్యమైన విద్యను అందించడం. 3. విద్యార్థులకు మరియు పాఠశాలకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలపై అవగాహన పెంచడం. 4. SHGలు మరియు AAPCల క్రియాశీల భాగస్వామ్యంతో కమ్యూనిటీ పార్టిసిపేషన్ (కమ్యూనిటీ సపోర్ట్) మద్దతుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం. 5. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల నుండి పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం. 6. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ (VER) అప్‌డేట్ చేయడం / అడ్మిషన్ రిజిస్టర్‌ను PEN నంబర్‌తో అప్‌డేట్ చేయడం మరియు పాఠశాల విద్యా విభాగానికి సంబంధించిన ఇతర ఆన్‌లైన్ సేవలను నవీకరించడం. 7. 5వ తరగతి పూర్తిచేసిన పిల్లలను అప్పర్ ప్రైమరీ స్కూల్/హైస్కూల్‌లో చేర్పించడం మరియు 7టీ/8వ తరగతి పూర్తిచేసిన పిల్లలను హైస్కూల్‌లో చేర్పించడం మరియు 100% పిల్లలు మారేలా చేయడం. 8. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించడం మరియు తల్లిదండ్రులు మరియు సమాజ ప్రమేయంతో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయడం. 9. AAPC సహాయంతో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సును బట్టి సంబంధిత తరగతిలో చేర్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. 10. బాలికల విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పే ప్రణాళికను సిద్ధం చేయడం, తద్వారా బాలికలందరినీ పాఠశాలలో చేర్పించడం మరియు వారి విద్యను కొనసాగించడం. 11. తల్లిదండ్రులు, పిల్లలు మరియు సంఘం సభ్యులలో RTE (విద్యా హక్కు) గురించి అవగాహన కల్పించడం. 12. సమర్థవంతమైన పాఠశాల విద్య ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్రను మరియు PTMలలో వారి హాజరు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం. 13. ద్విభాషా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, CWSN నిబంధనలు (ఎస్కార్ట్, రవాణా & రీడర్ అలవెన్స్, బాలికలకు స్టైఫండ్, సహాయాలు మరియు ఉపకరణాలు) వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం.
1020Loading...
12
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
940Loading...
13
*📡సందేహాలు - సమాధానాలు✍️* *♦️ప్రశ్న* : ఒక ఉపాధ్యాయుడు 5-4-1986 నాడు సర్వీసులో చేరి డిసెంబరు 2022 నాటికి కూడా సెకండరీ గ్రేడ్ టీచరుగా ఒకే క్యాడర్లో కొనసాగుతున్నాడు. 24 సంల స్కేలు కూడా తీసుకున్నాడు. 30 సంల స్కేలుకు అర్హుడా కాదా తెలియజేయండి. ఎప్పటినుండి 30 సం||ల స్కేలు వర్తిస్తుందో తెలపండి. *✅జవాబు :* ఆయన పదోన్నతి రిక్వింకష్ చేసి ఉండకపోతే 1-7- 2018 నుండి 30 సం॥ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది. *♦️ప్రశ్న :* పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుని కమ్యూటేషన్ బిల్లు ఆ ఉపాధ్యాయుడు మొదటి నెల పెన్షన్ చెల్లింపు తరువాత అనుమతించాలా? లేక వెంటనే చెల్లించవచ్చా? *✅జవాబు :* ఫైనాన్షియల్ కోడ్ వాల్యూం -1లోని ఆర్టికల్ 72 ప్రకారం రిటైర్మెంట్ గ్రాట్యూటీ మరియు కమ్యూటేషన్ ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే చెల్లించవచ్చు. పెన్షన్ మాత్రం తదుపరి నెల ఒకటవ తేదీన చెల్లించాలి. *♦️ప్రశ్న :* ఒక ఉపాధ్యాయుడు 1 సం॥ 6 నెలలు వ్యక్తిగత కారణ ములపై జీత నష్టపు సెలవు పెట్టినారు. ఆయన తిరిగి ఉద్యోగంలో చేరుటకు దరఖాస్తు చేసినారు. ఆయనకు అదే పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వవలెనా లేదా వేరే పాఠశాలలో అయినా పోస్టింగ్ ఇవ్వవచ్చా? *✅జవాబు :* సెలవు అనంతరం అదే పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వవలసి ఉంటుంది. *♦️ప్రశ్న :* భర్త చనిపోయిన ఒక మహిళా ఉద్యోగి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఆమెకు కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇచ్చారు. ఆమె తిరిగి వివాహం చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్ వస్తుందా? *✅జవాబు :* సదరు మహిళా ఉద్యోగికి మొదటి భర్త ద్వారా పిల్లలు ఉన్నారో లేదో మీరు తెలియజేయలేదు. పిల్లలు లేకపోతే ఆమెకు మరల వివాహం చేసుకున్నా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. కానీ ఆమె కనీస పెన్షన్ కు సరిపడే ఆదాయం స్వంతంగా సంపాదించుకుంటే పెన్షన్ నిలిపివేస్తారు. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆమె పునర్వివాహం చేసుకున్న తదుపరి ఫ్యామిలీ పెన్షన్ నిలిపివేస్తారు. పిల్లలకు ఆ పెన్షన్ కొన్ని షరతులతో ఇస్తారు. *♦️ప్రశ్న:* పదోన్నతి ఉత్తర్వులలో కొందరికి ప్రమోషన్ అని, కొందరికి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఇవ్వటం గమనించాను. రెండింటికి తేడా తెలియజేయగలరు. *✅జవాబు :* ఒకే సర్వీస్ రూల్స్ పరిధిలో క్రింది పోస్ట్ నుండి పై పోస్టుకు పదోన్నతి పొందితే ప్రమోషన్ అని పేర్కొంటారు. ఒక సర్వీస్ రూల్స్ పరిధిలోని క్రింది పోస్టు నుండి మరొక సర్వీస్ రూల్స్లోని పై పోస్టుకు పదోన్నతి పొందితే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఇస్తారు. *ఉదా||* సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయుని నుండి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి లభిస్తే (రెండు కూడా ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్) ప్రమోషన్ అని ఇస్తారు. స్కూల్ అసిస్టెంట్ నుండి(ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి (ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్) పొందితే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఇస్తారు.
1271Loading...
14
మనం గుడ్ ఇండియన్స్ కాదు. ఎందుకంటే..!? 1) మాతృదేవోభవ , పితృదేవోభవ అని చెప్పిన దేశం భారత దేశం. కానీ దానిని ఆచరించేది ఆస్ట్రేలియా. ( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది) 2) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం..కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.) 3) యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం) 4) పెద్దలను , వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్. (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.) 5) సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.) 6) కష్టేఫలి , కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా. ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే) 7) ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.) 8) భగవద్గీత బోధించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది జపాన్ .( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో మొదటి స్థానం జపాన్ దే) 9) ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే) 10) విద్య ను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం. కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే) పై విషయాలలో స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీ లో ఉన్న దేశాలు ఇవి.. నార్వే, ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, జపాన్, యూకే, చైనా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ , దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, యూఏఈ, ఆస్ట్రేలియా . చెప్పడం కాదు. చేసి చూపిస్తేనే విలువుంటుంది. లేకపోతె చెప్పేవి శ్రీరంగనీతులు అవుతాయి. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది. చెప్పేటందుకే నీతులు ఉన్నాయ్ అనే విధానం లో భారతదేశం మొదటి స్థానం లో ఉంది.. చెప్పటం మాని ఆచరించే రోజు వస్తుందని ఆశిద్దాం...
1191Loading...
15
*💥కమ్యూటేషన్ అంటే ఎమిటి ?* *ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.* *ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.* *1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.* (G.O.Ms.No.158 F&P తేది:1-4-1999) *శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు*. (Rule 3(3) of Commutation Rules 1994) *కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.* (G.O.Ms.No.356 F&P తేది:28-11-1989) *పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.* (G.O.Ms.No.44 F&P తేది:19-02-1991) *15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.* (G.O.Ms.No.324 F&P తేది:20-08-1977) *కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.* (G.O.Ms.No.392 F&P తేది:02-12-1993) *కమ్యూటేషన్ మొత్తానికి,గ్రాట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు.ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.*
1140Loading...
16
సమ్‌థింగ్... సమ్‌థింగ్.... ఏదో కావాలి... నిరంతరం ఏదో కావాలి.... ఎడతెరిపిలేని సంఘర్షణ... అసంతృప్తితో రగిలే హృదయం... ఎక్కడో ఎప్పుడో ఎవరిలోనో దేనిలోనో.... సంతృప్తిని వెదుక్కునే వ్యర్థప్రయత్నం.... ఎక్కడా, ఎప్పుడూ, ఎవరూ, ఏదీ అనుకూలించనప్పుడు మూలలకు ఇరుక్కుపోయి ఒంటరితనంలో సానుభూతినీ, సంతృప్తినీ కూడగట్టుకునే విఫలయత్నం... ------------------------------------------------ ఒకటొకటిగా ముళ్లకంపలు అల్లుకుపోతూనే ఉన్నాయి..... తెగాలి.... తెంచుకోవాలి... విదిలించుకోవాలి.... వదిలించుకోవాలి... మనకంటూ సోషల్ స్టేటస్‌ని కోల్పోతే ఏం కాదు.... మనకంటూ మందీమార్భాలం లేకపోతే ఏం కాదు... వస్తువులూ... విలాసాలూ... అర్థరాత్రి డిన్నర్లు... సెకండ్ షో సినిమాలూ, పబ్‌లూ, పేకాట క్లబ్లులూ, బంగారం, చీరెలూ, డ్రెస్‌లూ... వెలుగు జిలుగుల్లో బుసలు కొట్టే అనారోగ్యకరమైన కోరికలూ.... మాయలన్నీ మాయమైపోవాలి.... మరుగునపడడంలోనూ సంతృప్తిని చూడాలి... ఒంటరితనంలోనూ దర్జాగా మిగలాలి... అహం చావాలి.... ఆత్మ మిగలాలి.... నిరంతరం ఆత్మపరిశీలన మకిలిపడుతున్న ఆత్మని ప్రక్షాళన చేస్తుండాలి... ఇదంతా మన ఆలోచనల్లో ఉందన్నది ప్రపంచానికి తెలియాల్సిన పనిలేదు.. మనకు మనం ప్రతీ క్షణం ప్రపంచంతో డిటాచ్ చేసుకుంటూ పోతే మనస్సు నెమ్మదిస్తుంది.... ఏ మలినాలూ మనస్సుని కల్మషం చేయలేవు...
1410Loading...
17
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
1370Loading...
18
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
1481Loading...
19
4DA లు 3.64*4=14.56%
1570Loading...
20
*🔊ITR Filing: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.* *🍥ఐటీఆర్ ఫైలింగ్‌లో ఫాల్స్ క్లెయిమ్స్ చేసినట్లయితే ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. ఆపైన భారీగా పెనాల్టీలు విధిస్తుంది. తప్పుడు క్లెయిమ్స్ గుర్తించినప్పుడు ఎలాంటి పెనాల్టీలు కట్టాల్సి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.* *🌀ITR Filing: ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా పన్ను మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ ప్రాసెసింగ్ చేసే సమయంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం మీరు క్లెయిమ్ చేసిన డిడక్షన్లు, ట్యాక్స్ మినహాయింపులకు సంబంధించిన ప్రూఫ్స్ అడిగే అవకాశం ఉంటుంది. అది ఈ సంవత్సరానిదైనా, లేదా పాత ఏడాదికి సంబంధించినదైనా ధ్రువీకరణ పత్రాలు కోరే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటాది పలువురు ట్యాక్స్ పేయర్లు తప్పుడు రిఫండ్ క్లెయిమ్స్ చేసిన వాటిని బహిర్గతం చేస్తూనే ఉంటోంది ఐటీ శాఖ. అందులో కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులూ ఉంటున్నారు. ఇలా తప్పుడు రిఫండ్ క్లెయిమ్స్ చేసిన వారికి ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది.* *🌀ఇలా తక్కువ ఆదాయం లేదా నష్టాలు చూపడం ద్వారా తప్పుడు రిటర్నులు దాఖలు చేసినప్పుడు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. తప్పుడు ఆదాయాన్ని నివేదిచడం అనేది చట్టరీత్యా నేరం. వాటిపై భారీగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 270 ప్రకారం ఇలా తప్పుడు క్లెయిమ్స్ చేసినప్పుడు భారీగా పెనాల్టీలు విధించేలా సవరణలు చేసింది కేంద్రం. అసెస్సింగ్ ఆఫీసర్, కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్ స్థాయిలో ఎక్కడైనా ఇలా తప్పుడు క్లెయిమ్స్ చేసినట్లు గుర్తిస్తే సెక్షన్ 270 ప్రకారం భారీగా పెనాల్టీలు విధిస్తారు. ఇవి 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉండొచ్చు. ఈ పెనాల్టీల పెంపును 2016-17 కేంద్ర బడ్జెట్‌లో తీసుకొచ్చింది కేంద్రం.* *💥సెక్షన్ 270ఏ ప్రకారం పెనాల్టీలు ఎలా ఉంటాయి?*        *✳️ఐటీ రిటర్నుల్లో తక్కువ ఆదాయం చూపినట్లు అసెసింగ్ ఆఫీసర్ గుర్తించి నట్లయితే సెక్షన్ 270ఏ ప్రకారం పెనాల్టీలు విధిస్తుంది ఐటీ శాఖ. తక్కువ ఆదాయం చూపినప్పుడు చెల్లించాల్సిన ట్యాక్స్ బకాయిల్లో 50 శాతం వరకు పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది.*           *❇️తప్పుడు ఆదాయం చూపించినప్పుడు చెల్లించాల్సిన పన్నుపై 200 శాతం పెనాల్టీలు కట్టాలి.*           *🥏తక్కువ చూపిన ఆదాయం లేదా తప్పుడు ఆదాయం పై చెల్లించాల్సిన పన్ను బకాయిలకు అదనంగా ఈ పెనాల్టీలు కట్టాల్సి ఉంటుందని ట్యాక్స్ పేయర్లు గుర్తుంచుకోవాలి. అసెస్సీ తప్పు, తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినప్పుడు ఏకంగా 200 శాతం మేర పెనాల్టీ పడుతుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులైతే ఫారమ్ 16 అందుబాటులోకి వచ్చేకా రిటర్నులు దాఖలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.*
1390Loading...
21
*💥రికార్డు షీట్* *💫రికార్డు షీట్ వ్రాయుటలో నియమ నిబంధనలు.* *🔶ఉపాధ్యాయ వేదిక ద్వారా విలువైన సమాచారం.* *♦️1) రికార్డ్ షీట్ పై వరుస నెంబర్ రాయడం తప్పని సరి. ఒక వేళ పాఠశాలలో ఇదివరకు సరైన వరుస క్రమం లేనట్లయితే వరుస నెంబర్/సంవత్సరం పద్దతి లో వ్రాయవచ్చు.ఉదా: 27/2024* *♦️2) రికార్డ్ షీట్ మీద వైట్ నర్ వాడకూడదు. తప్పు పోయినట్లు అయితే దానిని కొట్టి వేసి HM సంతకం చేస్తే సరిపోతుంది.* *♦️3) విద్యార్థి పేరు ను పూర్తి గా రాయాలి. ఇంగ్లీష్ లో వ్రాసేవారు పెద్ద అక్షరాలలో రాయాలి.* *♦️4) విద్యార్థి రికార్డ్ షీట్ ఎపుడు తీసుకుంటాడు అదే రోజు నాటి తేదీ నీ ఇష్యూ డేట్ గా రాయాలి. కానీ పాఠశాల వదిలి వెళ్ళిన తేదీ మాత్రం అకడమిక్ సంవత్సరం చివరి రోజుది వేయాలి. ఇది విద్యార్థి తరగతి పూర్తి చేసినపుడు వర్తిస్తుంది. మధ్యలో వెళ్లినట్లైతే వెళ్ళిన తేదీ రాయాలి* *♦️5) విద్యార్థి కులం రాసే సమయంలో మతం, కులం, ఉప కులం ను రాయాలి మరియు వారి వరుస నెంబర్ రాయాలి.* *ఉదా:మతం:హిందూ , కులం:యాదవ, BC-D(33)* *♦️6) పుట్టిన తేదీని ఖచ్చితంగా పదాలలో రాయాలి.* *♦️7) విద్యార్థి తల్లిదండ్రుల తో కాకుండా వేరే వారితో నివాసం ఉంటూ చదివినట్లు అయితే (ఉా:అమ్మమ్మ దగ్గర) వారి పేరు వ్రాయ వలసి ఉంటుంది* *♦️8) రికార్డ్ షీట్ లు రెండు రాయాలి. ఒకటి ఆఫీస్ కాపీ, ఇంకొకటి విద్యార్థికి ఇవ్వాలి. ఒక వేళ విద్యార్థి ఈ రికార్డ్ షీట్ పోగొట్టుకున్న యెడల మరొకటి రాసి ఇవ్వచ్చు. కానీ వరుస నెంబర్ (రికార్డ్ షీట్ నెంబర్) మారకూడదు. ఆఫీస్ కాపీ ని చూసి వ్రాయాలి.* *♦️9) ఒక వేళ ప్రభుత్వ పాఠశాల అయితే విద్యార్థులను దగ్గర లోని ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు గారే చేర్పించాలి. ఒక వేళ విద్యార్థి తల్లిదండ్రులు వేరే దగ్గర చేర్పిస్తాము అన్నట్లైతే సంబంధిత సర్టిఫికెట్ లు వారికి ఇచ్చి ఆ పాఠశాల పేరును ఆఫీస్ కాపీ పై వ్రాయాలి.* *♦️10) విద్యార్థికి రికార్డ్ షీట్ ఇచ్చే సమయంలో విద్యార్థి తల్లిదండ్రుల సమక్షం లో ఇవ్వడం మంచిది. మరియు విధిగా వారు అడగక పోయినా వారికి స్టడి సర్టిఫికెట్ ఇవ్వాలి* *♦️11) ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చిన్న పిల్లలు కావున, వారికి రికార్డు షీట్, స్టడీ సర్టిఫికెట్ ముట్టినట్లు గా విద్యార్థి నుండి మరియు విద్యార్థి తల్లిదండ్రులు నుండి సంతకం తీసుకోవాలి* *♦️12) రికార్డ్ షీట్ మరియు స్టడీ సర్టిఫికెట్ లను కొన్ని వివరాలు మనకు వీలైనపుడు ముందే వ్రాసి పెట్టుకుంటే ఇచ్చే సమయంలో గాభరా పడాల్సి రాదు*. *♦️13) రికార్డ్ షీట్ ఇచ్చే సమయంలో అడ్మిషన్ రిజిష్టర్ లో వివరాలు నమోదు చేసి అందులో సంతకం చేసిన తర్వాత మాత్రమే రికార్డ్ షీట్ ఇష్యూ చేయాలి. పని ఒత్తిడి లో గాని, గాభరా లో గాని అడ్మిషన్ రిజిష్టర్ లో రాయడం మరచి పోవడం పరిపాటి, కానీ ఇదే విద్యార్థికి మరియు అప్పటి HM కు తీవ్ర నష్టం కలుగుతుంది*. *♦️14) పుట్టు మచ్చలు రెండు రాయాలి, ఒక వేళ రెండు దొరకక పోతే కనీసం ఒకటి రాయడం తప్పనిసరి.* *♦️15) పుట్టు మచ్చలు ఖచ్చితంగా బయటకు కనిపించేవి మాత్రమే రాయాలి. ఉదా: ముఖం, మెడ, మోచేతి వరకు చేతి పైన, కాలి మడమల వరకు.*
1180Loading...
22
*మీ నాలుక తో వ్యాయామం చేయడం వలన ఎన్నో లాభాలు!* మీ నాలుకను చాచి 10 సార్లు కుడి వైపుకు ఆపై ఎడమ వైపుకు, రోజూ చేయండి. మీకే తెలుస్తుంది. 50 ఏళ్ల తర్వాత మనం అనేక రకాల వ్యాధులకు లోను కావచ్చు. కానీ నేను ఎక్కువగా చింతిస్తున్నది అల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు పెరగడం గురించి. నన్ను నేను చూసుకోలేకపోవడమే కాదు, కాని ఇది కుటుంబ సభ్యులకు చాలా అసౌకర్యం కలిగిస్తుంది. ఒక రోజు, నా కొడుకు ఇంటికి ఓ డాక్టర్ వచ్చి చెప్పింది. ఆమె అతనికి నాలుకతో వ్యాయామం నేర్పింది. అల్జీమర్స్ సంభవనీయతను తగ్గించడంలో నాలుక వ్యాయామం ప్రభావవంతంగా ఉంటుంది మరియు దానిని తగ్గించడంలో / మెరుగు పరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందని. 1. శరీర బరువు 2. అధిక రక్తపోటు 3 మెదడులో రక్తం గడ్డకట్టడం 4. ఆస్తమా 5. సుదూర వీక్షణ 6. కాదు ఓ (వ) లి 7. గొంతు ఇన్ఫెక్షన్ 8. భుజం / మెడ ఇన్ఫెక్షన్ 9. నిద్రలేమి చాలా సులభం మరియు నేర్చుకోవడం సులభం. ప్రతి ఉదయం, మీ ముఖం కడుక్కోవడానికి, అద్దం ముందు క్రింది వ్యాయామం చేయండి: మీ నాలుకను చాచి 10 సార్లు కుడివైపుకు,ఆపై ఎడమవైపుకు తరలించండి. నేను ప్రతిరోజూ నా నాలుకకు వ్యాయామం చేయడం ప్రారంభించినప్పటి నుండి, నా మెదడు నిలుపుదల మెరుగుపడింది. నా మనస్సు స్పష్టంగా మరియు తాజాగా ఉంది మరియు ఇతర మెరుగుదలలు ఉన్నాయి. 1 విజన్ తక్కువ 2 అర్ధంలేని మాటలు లేవు 3. మెరుగైన ఆరోగ్యం 4. మెరుగైన జీర్ణక్రియ 5. తక్కువ జ్వరం / జలుబు నేను బలంగా మరియు చురుకుగా ఉన్నాను. గమనికలు: నాలుక వ్యాయామం అల్జీమర్స్‌ను నియంత్రించడంలో మరియు నిరోధించడంలో సహాయపడుతుంది. నాలుక పెద్ద మెదడుతో సంబంధం కలిగి ఉందని వైద్య పరిశోధనలో తేలింది. మన శరీరం వృద్ధాప్యం మరియు బలహీనంగా మారినప్పుడు, కనిపించే మొదటి సంకేతం మన నాలుక గట్టిపడటం మరియు తరచుగా మనల్ని మనం కొరుకుకోవడం. మీ నాలుకతో తరచుగా వ్యాయామం చేయండి. అది మెదడును ఉత్తేజపరుస్తుంది, మన ఆలోచనల సంకోచాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. తద్వారా మనం ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లూ, దయచేసి దీన్ని అందరికీ పంపండి: "ఈ సందేశాన్ని అందుకున్న ప్రతి వ్యక్తి దానిని మరో పది మందికి పంపమని నేను ప్రోత్సహిస్తున్నాను. కనీసం ఒకరి ఆరోగ్యం అయినా కుదుటబడుతుంది. నేను నా వంతు కృషి చేసాను మీ వంతుగా, మీరు కృషి చేయగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు!✍️💐
1491Loading...
23
*సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసినందుకు ఇరాన్ అధ్యక్షుడు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించినప్పుడు ఇది ఎంత భయానక దృశ్యం. ఆ వ్యక్తిని క్రేన్‌కు వేలాడదీస్తున్నప్పుడు, అతని 5 సంవత్సరాల కుమార్తె తన తండ్రిని ఎలా చూస్తుందో చూడండి, మరియు అతని కుమార్తె బాధను చూసి, ఆమె తండ్రి తన చివరి క్షణాలలో కూడా నవ్వుతూ ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.* *ఊహించండి, అతను చనిపోతాడని తండ్రికి తెలుసు, అయినప్పటికీ అతను తన కుమార్తెను నవ్వించాలని మరియు ఆమె ముఖం నుండి విచారాన్ని తొలగించాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ మృగం హెలికాప్టర్ ప్రమాదంలో క్రూరంగా చనిపోయింది.....* _(ఇది_ _కర్మ_సిద్ధాంతం_అని_అర్థం_ _చేసుకొనవచ్చు_..) *మనవల్ల వేరొక సంసారం వారి పిల్లల పరిస్థితి బాధపడితే, తిరిగి మనం బాధపడే రోజులు చాలా దగ్గర్లో ఉంటుంది. ఇది అంతకన్నా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అని చెప్పేందుకే ఈ చిన్న ఉదాహరణ*😌 🌼 *____యతో ధర్మ తథో గతిః____*🌼
1331Loading...
24
*🔊దేశంలో బెస్ట్ IITకోర్సులు, టాప్ IIT కాలేజీలు ఇవే....* *🍥దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కోర్సులకు ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. ఈ క్యాంపస్‌లలో చదివేందుకు యువత ఉర్రూతలూగుతుంటారు* *🌀అందుకే ఇంటర్‌లోనే ఎంతో కఠినమైన JEE అడ్వాన్స్‌డ్‌ క్రాక్‌ చేసేందుకు అహర్నిశలు కష్టపడి చదువుతారు. జేఈఈ మెయిన్‌ అర్హత సాధించిన వారికి మాత్రమే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో జేఈఈలో మెరిసేందుకు చాలా మంది కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ కూడా తీసుకుంతారు. మంచి కట్-ఆఫ్ స్కోర్‌తో JEE అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేసిన విద్యార్థులు నచ్చిన IIT కోర్సులో ప్రవేశం పొందే అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం.. దేశంలోని 23 IITలలో ఉన్న ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్‌కు సంబంధించి 130 కోర్సులు అందిస్తున్నాయి. ఈ 130 కోర్సులలో 64 బీటెక్ కోర్సులు, 14 బీఎస్ కోర్సులు, 1 బీఆర్క్ కోర్సులు, 42 బీటెక్ + ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు, ఒక బీటెక్ అండ్‌ ఎంబీఎ డ్యూయల్ డిగ్రీ కోర్సులు, 5 ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు, 5 బీఎస్ అండ్‌ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. IITలు అందించే ఈ 130 కోర్సుల్లో విద్యార్థులు ఏ కోర్సును ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకే IITలలో డిమాండ్‌ ఉన్న BTech కోర్సుల జాబితాతోపాటు బెస్ట్‌ కాలేజీల వివరాలను కూడా ఇక్కడ మీకోసం అందిస్తున్నాం* *💥IITలు అందించే డిమాండ్‌ ఉన్న BTech కోర్సులు ఇవే..* *❇️JEE అడ్వాన్స్‌డ్‌లో మంచి కట్-ఆఫ్ స్కోర్‌తో క్లియర్ చేసిన విద్యార్ధులు JoSAA కౌన్సెలింగ్‌లో ఈ కింద పేర్కొన్న కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు* *♦️కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్* *♦️ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్* *♦️సివిల్ ఇంజనీరింగ్* *♦️మెకానికల్ ఇంజనీరింగ్* *♦️ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ డేటా సైన్స్* *♦️ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్* *♦️ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌* *♦️ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్* *♦️మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్* *♦️ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్* *ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్* *♦️కెమికల్ ఇంజనీరింగ్* *♦️ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ డేటా ఇంజనీరింగ్* *🔶అధిక జీతం అందుకోవాలంటే ఈ కింది బెస్ట్‌ ఇంజనీరింగ్ కోర్సులు ఎంచుకోవాలి.* *💥అవేంటంటే.* *♦️రోబోటిక్స్ ఇంజనీరింగ్* *♦️ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌* *♦️నానోటెక్నాలజీ* *♦️డేటా సైన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్* *♦️ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్* *♦️ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్* *♦️బయోమెడికల్ ఇంజనీరింగ్* *♦️ఏరోస్పేస్ ఇంజనీరింగ్* *♦️నావల్ అండ్‌ ఓషన్ ఇంజనీరింగ్* *♦️కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్* *🌀12వ తరగతి తర్వాత తీసుకోదగిన బెస్ట్‌ ఐఐటీ కోర్సులు ఇవే..* *✡️ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న వారు, 12వ తరగతి (ఇంటర్‌)లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఉత్తీర్ణులైన విద్యార్థులు IITలలో ఈ కింది కోర్సులను ఎంచుకోవచ్చు* *♦️ఏరోస్పేస్ ఇంజనీరింగ్* *♦️ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్* *♦️ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌* *ఇంజనీరింగ్ ఫిజిక్స్* *బయోసైన్సెస్ అండ్‌ బయో ఇంజనీరింగ్* *♦️మెకానికల్ ఇంజనీరింగ్* *♦️బయోటెక్నాలజీ అండ్‌ బయోకెమికల్ ఇంజనీరింగ్* *♦️ఓషన్ ఇంజనీరింగ్ అండ్‌ నావల్ ఆర్కిటెక్చర్* *♦️కెమికల్ ఇంజనీరింగ్* *♦️ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ* *♦️సివిల్ ఇంజనీరింగ్* *♦️ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (పవర్ అండ్‌ ఆటోమేషన్)* *♦️కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్* *♦️ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్* *♦️డేటా సైన్స్ అండ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్* *♦️అగ్రికల్చర్ అండ్‌ ఫుడ్ ఇంజనీరింగ్* *డేటా సైన్స్ అండ్‌ ఇంజనీరింగ్* *♦️బయో ఇంజనీరింగ్* *♦️ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్* *♦️సిరామిక్ ఇంజనీరింగ్* *🌀పైన పేర్కొన్న కోర్సులే కాకుండా అనేక ఇతర కోర్సులను IIT అందిస్తోంది. 12వ తరగతి తర్వాత విద్యార్థులు ఎంచుకోదగిన 5 అకడమిక్ ప్రోగ్రామ్‌లు ఏవంటే.. B.Arch, B.Tech, BS, B.Tech-M.Techలో డ్యూయల్ డిగ్రీ, BS-MSలో డ్యూయల్ డిగ్రీ* *💥ర్యాంక్‌ వైజ్‌ టాప్ IIT కాలేజీలు ఇవే..?* *♦️ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్* *♦️ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ* *♦️ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి* *♦️ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్* *♦️ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ* *♦️ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్* *♦️ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి* *♦️ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్* *♦️ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్* *♦️ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారణాసి*
1781Loading...
25
ఫ్లాష్..ఫ్లాష్...💫💫 *పోలింగ్ సిబ్బంది 14 వ తేదీ కూడా డ్యూటీ చేసినట్లే!* CEO ముకేశ్ కుమార్ గారి ఉత్తర్వులు విడుదల.ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని *డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు.*
1560Loading...
26
*కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...* *అందుకు గల కారణాలు:* 1. *అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.* 2. *చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.* 3. *పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .* 4. *ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు)* 5. *చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.* 6. *ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.* 7. *ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం* 8. *భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...* 9. *మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.* 10. *మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.* 11. *కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.* 12. *మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.* 13. *social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.* 14. *ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.* 15. *ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.* *ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో...* 🤔😊🤔 😊🤔😊 🤔😊🤔 *✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు. 🚩*
1543Loading...
27
*🎯Alert &చెక్* మనం రకరకాల పనుల నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ ఎవరో తెలియని వ్యక్తి వచ్చి.. తన ఫోన్ పాడయ్యిందని లేదా బ్యాలెన్స్ లేదని.. తన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు కాల్ చేయాలని మన ఫోన్ అడిగితే.. అయ్యో అని వెంటనే ఇచ్చేస్తాం. కానీ.. అవతలి వ్యక్తి కంత్రీగాడు అయితే మాత్రం చాలా ప్రమాదంలో పడ్డట్లే. మనకు తెలియకుండానే క్షణాల్లో ఆ ఫోన్ కాల్ ఫార్వార్డింగ్‌, మెసేజ్‌ ఫార్వార్డింగ్‌ ఆప్షన్‌ను వారు మార్చేస్తారు. *🎯జస్ట్.. ఫోన్​ కీ ప్యాడ్​ మీద * 401 * అని టైప్‌ చేసి వాళ్ల ఫోన్ నెంబర్‌ ఎంటర్‌ చేసి డయల్ చేస్తారు. అంతే.. ఇలా చేస్తే మనకు తెలియకుండానే మన కాల్స్‌, మెసేజెస్ అన్నీ కూడా ఆ నంబర్‌కు ఫార్వర్డ్‌ అవుతుంటాయి.* దీనివల్ల మన నార్మల్ మెసేజెస్ మాత్రమే కాకుండా.. మన UPI, బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన అన్ని ఓటీపీలు కూడా ఆ నెంబర్‌కు ఫార్వర్డ్‌ అవుతాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. *🎯ఒకవేళ మీ ఫోన్‌లో కాల్స్‌, మెసేజెస్‌ ఇప్పటికే వేరే నంబర్‌కు ఫార్వర్డ్‌ అవుతుంటే వెంటనే స్టాప్ చేయాలంటే. ముందుగా మీ ఫోన్​ కీప్యాడ్​లో *#21# అని టైప్‌ చేసి, డయల్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోన్‌లో కాల్స్‌, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ అవుతున్నాయా? లేదా అనేది స్క్రీన్​ మీద చూపిస్తగుంది* *🎯మీ ఫోన్‌ కాల్స్‌, మెసేజెస్‌ ఫార్వర్డ్‌ అవుతుంటే.. ఆప్షన్​ ఎనేబుల్‌ అయినట్లు చూపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ ఆప్షన్​ డిసేబుల్‌ చేసుకోవాలి. దీనికోసం.. మీ కీప్యాడ్​లో ##002# అని టైప్‌ చేసి, డయల్ చేయాలి. ఆపై వెంటనే.. ఫార్వర్డ్‌ ఆప్షన్‌ వెంటనే డిసేబుల్‌ అయిపోతుంది.*
1532Loading...
28
Conceptual Physics, Global Edition by Paul G.Hewitt.pdf
1542Loading...
29
*ప్రభుత్వ ఉద్యోగులందరు ఉన్నోళ్ళు అయితరా?*… *ప్రభుత్వము పరిశీలించాలి..* *ప్రజలందరు ఆలోచించాలి..* ఐదు గుంటల భూమి లేని ఉద్యోగి ఉన్నోడు ఎట్లయితడు?… కార్లో వచ్చి ఉచిత బియ్యం తీసుకుపోయే వాడు పేదోడే అయితే, ఆర్టీసీ బస్ లో అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగి ఉన్నోడు ఎట్లయితడు?… ```లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగి పేదోడే అయితే, వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నోడు ఎట్లయితడు?… ```రెండు అంతస్తుల భవంతి లో నివాసం ఉన్నవాడు పేదోడే అయితే, కిరాయి ఇంట్లో ఉండే ఉద్యోగి ఉన్నోడెట్లయితడు?… ఎకరం అమ్మితే 40 లక్షలు? అదే ఉద్యోగి జీవితాంతం ఉద్యోగం చేసిన 40 లక్షలు సంపాదిస్తాడా?… *ప్రజలు గుర్తెరగాలి ఉద్యోగులు అందరు ఉన్నోళ్ళు కాదు..ఐరన్ బట్టలు వేసుకున్నంత మాత్రానా ధనవంతులు కారు*… *నేటికీ 80 శాతం మంది ఉద్యోగులు జీతాల మీద సొంత ఇల్లు కట్టి పిల్లల చదువులు పూర్తి చేస్తే గొప్ప*… `నేటి ఉద్యోగులకు మీరు ఊహించినట్టు ... 🩺🎓ఉచిత విద్య ,ఫీజు రీయింబర్స్మెంట్ లేదు… తెల్ల రేషన్ కార్డ్ ఉండదు. ప్రభుత్వ పథకాలు ఏ ఉద్యోగికి ఏవి ఉండవు… *ఆ ఉద్యోగం రాగానే వచ్చే జీతంతో ప్రతి పైసా ఖర్చుకు పదిసార్లు ఆలోచిస్తూ, పద్ధతిగా ఖర్చు చేస్తూ ప్రణాళికాబద్ధంగా బ్రతుకుతున్నారు అంతే తప్ప వాళ్ళంతా బలిసినోళ్ళు కాదు.భాగ్యవంతులు కారు...*
1750Loading...
30
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
1580Loading...
31
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
1550Loading...
32
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
1582Loading...
33
*ముఖ్య గమనిక* DRDA ద్వారా 2024 స.. రానికి *ఇంటర్ కార్పొరేట్ ఉచిత విద్య* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కార్పొరేట్ కాలేజీలో బాగంగా ఇప్పుడు మాన ఇబ్రహీంపట్నంలో DRDA లో సెలెక్ట్ అయిన కాలేజీ *వాసవి జూనియర్ కాలేజి ఇబ్రహీంపట్నం* *ఎవ్వరూ అర్హులు* ...... కేవలం *ప్రభుత్వ పాఠశాలలో* కానీ... *ప్రభుత్వ హాస్టల్స్* లో కానీ అనగా *గురుకుల హాస్టల్స్* *కేజీపీవీ హాస్టల్స్* లో చదివిన వారు మాత్రమే అర్హులు *SSCలో ఎన్ని G.PA ఉంటె అవకాశం* *2024 సంవత్సరానికి* సంబందించిన *GPA 7.0 పైన* గ్రేడ్ సాధించిన వారు మాత్రమే అర్హులు *ఇంటర్ లో ఏ గ్రూపులో చేరుటకు అవకాశం* కేవలం *ఎంపీసీ మరియు బైపీసి* లో మాత్రమే ప్రవేశం కొరకు అవకాశం *ఎలా అప్లై చెయ్యాలి* . *www.Epass.cgg.gov.in* వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.. Sc bc St మైనారిటీ వారు అప్లై చేయడానికి అర్హులు...... *పిజులు ఏమైనా ఉంటాయా* ఒకవేళ మీరు DRDA లో బాగంగా సెలెక్ట్ అయితే మీరు ఎలాంటి fees చెల్లించవలసిన అవుసరం..లేదు కాలేజీ మరియు హాస్టల్ వోసతి కూడా ప్రి.... ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చెయ్యాలి.. 1 కులం ఆదాయం 2 ఆదర్ కార్డ్ 3 బొనపైడ్ 4 నుండి 10 తరగతి వొరకు 4 ssc memo ( inter net) 5 photos 6 ఒకవేళ మి అమ్మగారు మహిళ సంఘంలో మెంబెర్స్ ఉంటే వాటి డీటెయిల్స్ అనగా పొదుపు సంఘం పేరు మరియు వాటి వివరాలు.. ఎక్కడా అప్లై చేయాలి.. మీరు కాలేజీకి వొచ్చి మీరు అడ్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే అవకాశం... సంప్రదించండి Ramesh madharam correspondent Vasavi College ibrahimpatnam 8333911999 మా కాలేజీలో ఉన్నా గ్రూప్స్ MPC(ఎంసెట్). BiPC(నీట్).CEC.(బ్యాంకు కోచింగ్ అండ్ కానిస్టేబుల్ కోచింగ్)HEC మరియు వొకేషనల్ MPHW (F) CSE MLT ET ఫిజియోథెరపీ ఫార్మా టెక్నాలజీ LM&DT
1690Loading...
34
*జీవితంలో ఏది సాధించాలన్నా ధర్మ బద్ధంగా కష్టపడి ప్రయత్నించాలి* – రామాయణ, భారత, భాగవత, భగవద్గీత తదితర పురాణేతిహాసాలన్నీ  నిర్ద్వందంగా చెప్పే విషయం ఇది. రాముడంతటి వాడే కష్టపడి యుద్ధం చేసి రావణ సంహారం చేసాడు. కృష్ణుడు మహావీరుడైన అర్జునుడికి గీతాబోధ చేసి మరీ 18 రోజులు యుద్ధం చేయించాడు. కానీ ప్రస్తుత సమాజంలో అందరూ రాత్రికి రాత్రే వారి కోరికలన్నీ తీరిపోయి, సిరి సంపదలు వచ్చే దారుల కోసం వెతుకుతూ జీవితమంతా వృధా చేసుకొంటున్నారు. ఎవరైనా మంత్రాలు, యంత్రాలు, తాయెత్తులు ఇస్తామంటే అప్పు చేసి మరీ వేలకు వేలు సమర్పించుకొని కొత్త కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. పురాణాలన్నీ కాలక్షేపానికి చదువుతారు. అర్ధం చేసుకొనే ప్రయత్నం శూన్యం, ఆచరణ ప్రశ్నే లేదు. మాకూ పురాణాలు తెలుసనే విజ్ఞాన ప్రదర్శనలో, అహంకారంతో అర్దం లేని వాదనలు చేయడంలో ముందుంటారు. రాముడికీ, కృష్ణుడికీ తెలియని కిటుకులు, రహస్యాలు, విజయానికి దగ్గరి దారులు మనకు తెలిసిపోతాయనుకోవడం అమాయకత్వమా, మూర్ఖత్వమా? లేక మంత్రాలు, యంత్రాలు అమ్ముకొనే వారంతా విశ్వామిత్రుడు, వశిష్ఠుల వంటి మహర్షుల కన్నా గొప్ప గురువులని నమ్మకమా? రాముడు, కృష్ణుడు అంత కష్టపడినా, వారికి విజయం చేకూరింది వారు దైవస్వరూపులనే  కారణంతో కాదు. వారి యుద్ధం, వారి ప్రయత్నం ధర్మబద్ధమైనది కనుక విజయం వారిని వరించింది. వారి విజయం దైవికం ఐతే యుద్ధం అవసరమే ఉండదు కదా?! అప్పుడు రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఏవీ ఉండేవి కావు. వేదాలు, పురాణేతిహాసాల వంటి అఖండ జ్ఞాన నిధిని మహర్షులు మానవాళికి అందించింది వాటి ద్వారా మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నేర్చుకోవాలని. కానీ ఈ విషయం గుర్తించలేని నేటి మానవుడు, అసలైన ఆధ్యాత్మిక బాటను వదిలి, అజ్ఞానాంధకారాలతో తప్పుల మీద తప్పులు చేస్తూ - ఈర్ష్యాసూయలనే ముళ్ళు, తుప్పలు, నిండిన స్వార్థపు దారిలో అగాధం వైపే అడుగులు వేస్తూ పతనం అంచుకు చేరుతున్నాడు. పతనం చెందకుండా కాపాడుకోవాలంటే ఉన్న మహత్తర అవకాశం, తక్షణ కర్తవ్యం - ఆధ్యాత్మిక బాటను చేరుకోవడం, ధర్మాచరణ చేయడం. అధర్మమైన, స్వార్ధపు కోరికలతో - దేవుడికి వింత మొక్కుబడులు, ఆర్భాటపు కానుకలు సమర్పిస్తూ దేవుడిని అపవిత్రం చేసి మరింత పాపం మూటగట్టుకొని, వంశంలో తరువాతి తరాలకు తగిలే శాపాలకు బాధ్యులు కాకుండా - వంశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం! సర్వేజనాః సుఖినోభవంతు.
1430Loading...
35
*📡Summer ELs Caliculation if vacation 49days✍️* FORMULA: *(365x1)/11-(27xNo.of dys availed/T.No.of dys vacatn)-6* No.of days working-Eligbl ELs >1,2-1 >3,4-2 >5,6-3 >7-4 >8,9-5 >10,11-6 >12,13-7 >14,15-8 >16-9 >17,18-10 >19,20-11 >21,22-12 >23,24-13 >25-14 >26,27-15 >28,29-16 >30,32-17 >32,33-18 >34,35-19 >36-20 >37,38-21 >39,40-22 >41,42-23 43,44,45,46,47,48,49 - 24 ELs
1311Loading...
36
*📍E- Filing Info📍* (ఈ మెసేజ్ ఆంధ్ర ప్రదేశ్ గ్రూప్ లలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్) *💥E-filing చేసేటప్పుడు గుర్తించు* *కోవలసిన కొన్ని ముఖ్య విషయాలు....* *1. ప్రొఫైల్ లొ ఎమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే, చేసుకోవాలి, like, address, phone number mail ID,* *2. మీరు కొత్త PASPORT తీసుకొని ఉంటే, ఆ డిటైల్స్ కూడా ఎంటర్ చేయాలి.* *3. Salary income gross amount correct గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేయాలి, ఒక వేళ NPS employee అయితే, gross amount కు employer contribution కూడా add చేయాలి. కొన్ని income tax software లతో, income from other sources కింద చూపించారు. ఇది కరెక్ట్ కాదు, ఒకే employer, salary DA, HRA, NPS ఇస్తున్నాడు కావున, 17(1),17(2) ప్రకారం NPS AMOUNT add చేయాలి. 80CCD (2) కింద deduct చేయాలి.* *4.)ఎవరైతే పర్సన్ విత్ dissability ఉన్నారో & 80DD, 80U కింద మినహాయింపు కోరుతున్నారో, వారు తప్పనిసరిగా 10-IA form, నీ ఫైల్ income tax forms నందు అప్లోడ్ చేయాలి.* *5) మీకు ఏమైనా refund amount ఎమైనా వచ్చేది ఉంటే, july-31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత, చేస్తే, ఫైన్ తర్వాత ఇంకా ఎమైనా మిగిలి ఉంటే, ఆ refund రాదు. 89(1) కింద 10E file చేసి refund పొందగోరే వాళ్లు కూడా july-31 లోపలే చేసుకోవాలి. Dead line పొడిగించబడదు.* *6. TDS amount 26AS లొ reflect అయ్యకనే E-filing కి వెళ్ళాలి., అవసరం అయితే, 26AS, AIS,print/pdf తీసుకోవాలి. బ్యాంక్ SB/FD interest ఎమైనా ఉంటే, వాళ్ళ రూల్ ప్రకారం 10%tds కట్ చేస్తారు. మనం ఎమైనా అదనంగా ఉంటే , e-filing అప్పుడే చాలన్ పే చేసి, e-filing complete చేయాలి.* *7.ఇతరుల మాటలు గుడ్డి గా నమ్మి, హెల్త్ /ట్రీట్మెంట్ /హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DDకింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్ లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికీ వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేక పోతే సెక్షన్ 133(6) కింద మి assessing officer ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే, అవి సెక్షన్ కిందికి రాదు అంటే, పెనాల్టీ+tax రెండు పే చేయాలి.* *8.) నా దృష్టికి వచ్చిన కొంత మంది నోటీస్ లలో, HRA proof కూడా అడిగారు, అంటే రెంట్ అగ్రిమెంట్, form-12BA, సైన్ విత్ DDO, and original form -16 ( traces). And all deduction proof. For three years, notice one years ki వస్తె, ప్రూఫ్ 3 yeras కి అడుగుతున్నారు.* *9.ఎవరి ఇయర్ మన tax మి bar graph ద్వారా అనలైజ్ చేస్తున్నారు, మి ప్రిఫైల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కింది భాగాన obser చేయవచ్చు.* *10. TDS July-31 వరకు కూడా కాకపోతే, nil tax return file చేయండి, 234F కింద ఫైన్ పడదు, TDS తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే, సరిపోతుంది.* *11. మీరు తీసుకున్న హోం LOAN INTEREST ను, కరెక్ట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి, 2L వరకు, 24B, ఆ తర్వాత, 80EE, 80EEA, మి లౌన్ సాంక్షన్ డేట్ నీ బట్టి ఎంటర్ చేయండి.* *12. ఇంకా ఏమైనా పాత నోటీస్ లు ఉన్నాయేమో చెక్ చేయండి,* *13. 80G కింద ఎమైనా అమౌంట్ contribute చేసి ఉంటే, మి దోనర్ దగ్గర ఆన్లైన్ receipt దగ్గర పెట్టుకోండి.* *14. నాకు ఉన్న అవగాహన ప్రకారం మనం EHS కింద contribute చేసే amount 80G kinda చూపాలి, ఎందుకంటే, 80D అనేది హెల్త్ ఇన్స్యూరెన్స్, అది IRDAI, నిర్దేశించిన హెల్త్ insurence company లకే వర్తిస్తుంది.మనం చేసేది, ఎంప్లాయీస్ హెల్త్ scheme(EHS) not health insurance..* *15. ఏ emoloyee కానీ,సెక్షన్ 80DD & సెక్షన్80U రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు. ఒకటి మాత్రమే.* *16. Process అయ్యాక 143(1) నోటీస్ వచ్చింది అంటే, మనం సేఫ్ సైడ్ అదే మనకు 143(2) వస్తె, మనం రిస్క్ లొ ఉన్నట్లే, మన చేసిన e-filing, assessing officer మరింత సమాచారం కావాలి, మీరు గతం లొ తీసుకోని మినహాయింపులు తీసుకున్నారు అని, హెచ్చరిక ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి.* *17. Income tax లొని section లు, కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కానీ అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి, high value, transactions జరిగిన, ఇట్టే AIR లొ తెలిసిపోతుంది,* *18. E-filing complete అయ్యాక మళ్ళీ Declaration బాగా చదవండి, పూర్తిగా నేనే బాధ్యుని( ఆధార్ OTP) sender. అని అర్థం.* *19. 120 డేస్ లోపల మీకు రావలసిన రెఫండ్ రాలేదు అంటే, 18004190025 కి సంప్రదించి హిందీ/ఇంగ్లీష్ లో కంప్లైట్ రైస్ చేయాలి*
1301Loading...
37
*S A A* 👉 *🏵️మార్పు రావాలి🏵️* *🌼ప్రశ్న:ఎన్నికల నిర్వహణలో మనం ప్రతిసారి ఇబ్బంది పడుతున్నది ఎక్కడ?* *✅జవాబు: రిసెప్షన్ సెంటర్‌లో.* *🌼వివరణ: 36 గంటల శారీరక, మానసిక పరిశ్రమతో మనం రిసెప్షన్ సెంటర్‌కి‌ వెళ్ళేసరికి అక్కడ ఎదురవుతున్న‌ పరిస్థితులేమి *👉 కవర్లు, ఫారాలు బుక్‌లెట్ రూపంలో నీట్‌గా ఇచ్చారు. కానీ అటించనవసరం లేని వాటికి కూడా గమ్ ఇచ్చి పొరపాటు చేసారు. అంటించినవన్నీ విప్పి‌ చూపించవలసి వచ్చింది.* *🔷అసలు ఒక మనిషి ఆహారం లేకుండా, విశ్రాంతి లేకుండా ఎన్ని గంటలు పని చేయగలడు? 5.30 కి మాక్‌పోల్ మొదలు పెట్టాలి. 7.00 గంటలకు Actual Poll మొదలు‌ పెట్టాలి? మరి టిఫిన్స్ ఎప్పడు చేసేది?* *👉పోలింగ్ నిరంతరాయంగా‌ సాగాలి బ్రేక్ ఇవ్వకూడదు. మరి భోజనం చేసేది ఎప్పుడు?* *👉పోలింగ్ పూర్తవగానే బస్సు వచ్చే లోగా కవర్లు రెడీ చేసుకోవాలి. మరి డిన్నర్ చేసేది ఎప్పుడు?* *🏵️పై అన్ని విషయాలలోను సంస్కరణలు తీసుకురాకపోతే ముందు ముందు ఎలక్షన్ డ్యూటీ‌చెయ్యడానికి ఎవరూ సముఖత చూపించరు. పైన చెప్పిన‌ అంశాలలో తగిన‌ మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది*
1310Loading...
38
*🔊భోజనానికి ముందు, తర్వాత..టీ, కాఫీలు తాగొద్దు*       *🔶ఐసీఎంఆర్ సైంటిస్టుల హెచ్చరిక*      *🔷దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తయ్*      *🔶ఫుడ్​లోని ఐరన్ శాతాన్ని కాఫీలోని టానిన్లు తగ్గిస్తయ్* *🍥న్యూఢిల్లీ:  టీ, కాఫీలను మితంగానే తాగాలని, అదేపనిగా తాగడం అనారోగ్యానికి కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సైంటిస్టులు హెచ్చరించారు. దేశమంతటా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)తో కలిసి ఐసీఎంఆర్ ఇటీవల కొత్త డైట్ గైడ్​లైన్స్​ను విడుదల చేసింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు.. హెల్తీ లైఫ్ స్టైల్​కు ఎంతో కీలకమని చెప్పింది. తామిచ్చిన డైట్ గైడ్​లైన్స్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది.* *🌀ఇందులో టీ, కాఫీల వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి వివరించింది. ‘‘టీ, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మన కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఈ పానీయాలు తాగిన తర్వాత రిఫ్రెష్  అయిన ఫీలింగ్​వస్తుంది. ఇది కొంత వరకు నిజమే అయినా.. అదేపనిగా టీ, కాఫీలు తాగితే వాటి ద్వారా శరీరంలోకి చేరే కెఫిన్ మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తది.* *💠150 మిల్లీ లీటర్ల కాఫీలో 80 నుంచి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. ఇన్​స్టంట్ కాఫీలో 50 నుంచి 60 మిల్లీ గ్రాములు, టీలో 30 నుంచి 65 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. రోజుకు కేవలం 300 మిల్లీ గ్రాముల కెఫిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మోతాదు దాటితే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి’’ అని ఐసీఎంఆర్ హెచ్చరించింది.* *💥గుండె జబ్బుల ముప్పు కూడా..* *✳️అన్నం తినే గంట ముందు, తిన్నంక గంట దాకా టీ, కాఫీలు తాగొద్దని ఐసీఎంఆర్ సూచించింది. ఇండియాలో చాలామంది టీ లేదా కాఫీలను భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకుంటారని తెలిపింది. ఇలా చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ‘కాఫీ, టీలో టానిన్లు ఉంటాయి. ఇవి ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. జీర్ణాశయంలోకి చేరిన ఆహారంలోని ఐరన్ తో టానిన్ చర్య జరిపి, రక్తంలోకి చేరకుండా అడ్డుపడుతుంది. దీంతో బాడీలో ఐరన్ సమతుల్యత దెబ్బతింటది. బాడీలో ఐరన్ శాతం సరైన మోతాదులో ఉండాలి. ఐరన్ తక్కువైతే రక్తహీనత సహా పలు సమస్యలు చుట్టుముడతాయి’’ అని ఐసీఎంఆర్ వివరించింది.* *💥హిమోగ్లోబిన్ తయారీపై ప్రభావం* *❇️శరీరమంతా ఆక్సిజన్​ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్​ను తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. బాడీలో ఐరన్ లోపిస్తే.. తరుచూ అలసిపోవడం లేదా శక్తి లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యేకించి బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవడం, గోర్లు పెలుసుగా మారిపోవడం లేదంటే జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. అయితే, పాలు లేకుండా టీ తాగడంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్, స్టమక్  క్యాన్సర్ రిస్క్​లు తగ్గుతాయని ఐసీఎంఆర్ తన గైడ్​లైన్స్​లో పేర్కొంది.*
1320Loading...
39
*📡OPO పేరుతో రెమ్యూనరేషన్ లో తేడాలు తగదు✍️* ఎన్నికల విధులలో ప్రధాన పాత్ర PO, APO లతో పాటు OPO లది కూడా..... *పోలింగ్ సామాగ్రి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి సామాగ్రిని సిబ్బందికి అప్పజెప్పేంతవరకు ఓపిఓ ఉండవలసిందే*. 👉పిఓ తో సమానంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఓపిఓలకు రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో తేడాలు ఎందుకు. 👉 పీవో చెక్ లిస్ట్ చదివితే సామాగ్రిని చెక్ చేసేది ఓపిఓ. 👉మిషన్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించేది ఓపిఓ. 👉పోలింగ్ కేంద్రం వద్దకు సామాన్లు రవాణా చేయడంలో సహకరించేది ఓపిఓ. 👉పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత 17 ఏ రిజిస్టర్ మెయింటైన్ చేయడంలో మరియు పోల్ స్లిప్స్ లు రాసి అందించడంలో ప్రధాన పాత్ర వహించేది ఓపిఓ. 👉అన్నింటికంటే ముఖ్యమైనటువంటి కంట్రోల్ యూనిట్ ను కంట్రోల్ చేసేది opo. 👉 మార్కుడ్ లిస్టుకు, 17A కు మరియు కంట్రోల్ యూనిట్ లో ఓట్లు ఎలాంటి తేడాలు రాకుండా చూసుకునేది ఓపిఓలు. 👉 *మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక పోలింగ్ స్టేషన్ కు గుండెకాయ మరియు మెదడు లాగా పని చేసేది ఓపివోలు* 👉మాకు పోల్ ప్రారంభానికి ముందు అన్ని మిషన్లను కనెక్ట్ చేసి సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయడంలో మరియు మాక్ పోల్ సమయంలో ప్రధాన సహకారం అందించేది ఓపిఓ. 👉అన్ని యూనిట్స్ మరియు అన్ని కవర్స్ ను సీల్ చేసేది ఓపిఓ. 👉తిరిగి పోలింగ్ కేంద్రం వద్దకు సామాగ్రి మొత్తం చేర్చే విషయంలో ఓపిఓ లది ప్రధాన భూమిక. 👉ఆ తర్వాత పూర్తి సామాగ్రిని అక్కడి సిబ్బందికి అప్పజెప్పేంతవరకు ఓపిఓ ఉండవలసిందే.. 👉 ఒక పోలింగ్ బూత్ లో 100% సక్సెస్ రేట్ సాధించాలంటే ఓవరాల్ పోలింగ్ ఆఫీసర్ గా పని చేసేది ఆ బూతులో ఉన్నటువంటి ఓపిఓలు. 👉ఎలక్షన్ విధులలో ఇంతటి ప్రధాన భూమికను పోషిస్తున్న ఓపిఓలకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. 👉అందరికీ సమానమైన పనులే అయినప్పుడు రెమ్యూనరేషన్ తక్కువగా ఇవ్వడం ఏమిటి ? 👉 *పోలింగ్ నిర్వహణలో పాల్గొన్న ప్రతి పోలింగ్ ఆఫీసర్ కు ఒకే విధమైన రెమ్యూనరేషన్ చెల్లించాలి*. 👉 ఒక్క మాట OPO అంటేనే *overall polling officer*
1170Loading...
40
*🏵️ అహా...ఓహో..🏵️* *🌼అంతా ఉత్తిదే.* *🔷ఎన్నికల విధులలో ఉపాధ్యాయుల కష్టాలు.* *🌼మారని తీరు* *🌼కేవలం ప్రకటన,పెపర్ల లో మాత్రమే.* *🌼ఏమి లేదు.అదే తీరు,అవే కష్టాలు.* *👉 డిస్టుబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు నిల్.* *👉కూలర్లు పెట్టారు నీళ్ళు పోయాక వేడి గాలి.* *👉అన్నం,కూర ఇవి కావు అనే నిజం.దొడ్డు బియ్యం,నీళ్ళ కూరలు,పిట్ట గుడ్డు కంటే పెద్ద గుడ్డు.నీళ్ళు లేవు.* *🌼తింటే తినుర్రి లేకపోతే పొంర్రి అంతే ఇగ.* *🌼ఇగ పెట్టెలు ఎత్తుకొని బస్సు తిరిగి,తిరిగి,ఆగి,ఆగి చేరుకొని మొత్తం పని చేసుకొని బువ్వ తిందామంటే ముక్కి పోయి వాసన వచ్చే అన్నం,పావుకిలో పప్పు లో బిందెడు నీళ్ళు.* *🏵️ఎన్నికల కమీషన్,జిల్లా అధికాలు ఆలోచించాలి.* *👉ఎంతసేపు ట్రైనింగ్,గైహాజరు,క్రిమినల్ కేసు,సస్పెండ్,మేమో* *👉ముందు అధికారులకు శిక్షణ ఇవ్వాలి.* *👉టీచర్లు అంటే కూలీలు కాదు* *👉బువ్వ లేక మీ దగ్గరకు రాలే.* *🔷సరైన వసతులు, తిండి,నిద్ర లేకుండా ఎలా పనిచేస్తారు అని ఆలోచన లేదు.* *🌼ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికల ప్రక్రియ,జనాభా లెక్కలు అనేవి అసాధ్యం.ఈ రెండే దేశం లో కీలకం.* *🔶ఇక నైనా అహా... ఓహో..వద్దు.చేసి చూపండి.* *🔶ఉపాధ్యాయ వేదిక*
1200Loading...
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
Show all...
New Doc 06-05-2024 15.07.pdf6.62 KB
*📡సందేహాలు - సమాధానాలు✍️* 1. సందేహం: *"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?* సమాధానం: *1933 APLR రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్స్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.* 2. సందేహం: *నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను. సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?* సమాధానం: *వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.* 3. సందేహం: *నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను. ఇంటర్, డిగ్రీ, హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు. ఎందుకని?* సమాధానం: *మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.* 4. సందేహం: *నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను. నాకు పెన్షన్ ఎంత వస్తుంది?* సమాధానం: *చివరి మూలవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.*
Show all...
💥💥 *తెలంగాణ రాష్ట్ర గీతం* 💥💥 (2.30 నిమిషాల నిడివి) 1. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ.... 2. జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నాగానం అమ్మనీవే మా ప్రాణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ... 3. గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ....
Show all...
*_పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?_* _(వివక్షతను మించిన విషం ఉంటుందా!!?)_ *=================* _|మనసును కదిలించే కథ... చదవండి! 🙏|_ *కరీంనగర్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా, పక్కనే ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా school కే పంపడం. ఇంకా ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్లంటేనే పడదు. అలాంటిది మళ్లీ ఈ ఊరమాస్ పిల్లలకు చదువు చెప్పాలి. "దేవుడా ! ఏంటీ పరీక్ష" అని రోజూ చిరాకుతో కూడిన చిర్రబుర్రులతోనే బడికి వెళ్లేదాన్ని.* *అందులో ఒక్కణ్ణి చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాణ్ని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు మూడో తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకొనేవాడు. ఆరాతీస్తే, వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పని చేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని, పంపిస్తూన్నా రనిపించింది.* *నా దృష్టిలో అయితే వాడు చాలా poor student. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్ప చెప్పమన్నా కూడా వాడికి 5 కి మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అస్సలు వాడి వైపు చూడ్డం కానీ, మాట్లాడటం కానీ అస్సలు చేసేదాన్ని కాదు.* *అలాంటోడు కొన్ని రోజులుగా school ki రావడమే మానేశాడు. ఇలాంటి places లో school ki రావడం, మానేయడం వీళ్ళకు మామూలే కదా! అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు...* *ఒకరోజు హెడ్మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఆయనకెదురుగా ముప్పై ఏళ్ళున్న ఒక labour ఆవిడ చేతులు కట్టుకుని నిల్చుని ఉంది.* *ఆవిణ్ణి నాకు పరిచయం చేస్తూ.. _"ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు పదిరోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడంట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది madam ఒక్కసారి మాట్లాడండీ"_ అన్నారు హెడ్మాస్టర్.* *వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్లెంబడి నీళ్లతో కుప్పకూలి, మేడమ్..! వాడు పోయే ముందు ఎప్పుడూ... _"నళిని మేడమ్ తో ఒక్కసారన్నా good అనిపించుకోవాలి అమ్మా"_ అని నాతో రోజూ చెప్పేవాడు.* *వాడు చనిపోయే ముందురోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా...! వాడు తనకు తానే _" సాంబడు good"_ అని పుస్తకంలో రాసుకొని మీ లాగే సంతకం చేసుకున్నాడు," అని తాను తెచ్చుకున్న సంచిలోనుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళ మ్మ... నాకళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటిబొట్లతో వాడు పెట్టిన నా.. నా.. సంతకం తడిసి, పేజీ ముద్దగా అవుతోంది. నాకు దుఃఖం ఆగడంలేదు.* *వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాణ్ని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూళ్ళేదు వాణ్ని.* *పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో! _"తండ్రీ ఎక్కడున్నా నన్ను క్షమించు... జాతి, వర్ణ, ఆర్ధిక బేధాలతో.. వివక్షలతో చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్దమనుషులను కూడా క్షమించరా"😌_ అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ...* *_“సాంబడు is Very Good” నాలాంటి ఎందరో కళ్లు తెరిపించావు తండ్రీ!_ అని అదే బుక్ లో రాసి ఆ గదిలోనే ఉన్న bench మీద కూర్చుని హెడ్మాస్టర్ గారి వెనుక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి _"తప్పు చేశాను సార్! 🙏ఇక మీదట ఇలా జరగదు"_ అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను.* 😌 *_దయచేసి పిల్లలని ప్రేమించండి.🙏_* _మీ...._ _—నళిని టీచర్_ — *Written by ✍️ Challa SridharReddy, software engineer, Telangana*— *:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:* *_{ఇదిసేకరణే.... ఈ కథను తెలంగాణకు చెందిన 'చల్లా శ్రీధర్ రెడ్డి' అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాశారు. నాకు పర్సనల్ గా పంపించారు. చదువుతూంటే నా మనసు కదిలింది.. కళ్ళు చెమ్మగిల్లాయి. అందరూ చదవాల్సింది.. ముఖ్యంగా టీచర్లు. అందుకే.. మీతో పంచుకుంటున్నాను.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
Show all...
Photo unavailableShow in Telegram
తెలంగాణ కొత్త గీతం
Show all...
*🔊రేపే జూన్1....అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే* *🍥జూన్ 1వ తేదీ నుంచి పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి* *💠ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌* *❇️ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. కేంద్రం ప్రభుత్వం కొన్ని నెలల కిందట ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు జూన్ 14తో ముగియనున్నది. ఈ గడువు తేదీ ముగిసిన తర్వాత ప్రతీ అప్డేట్‌ చేసుకోవాలనుకుంటే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు గడువులోగా ఆధార్ అప్ డేట్ చేసుకుంటే ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు* *🥏డ్రైవింగ్‌ లైసెన్స్‌* *✡️సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కి అర్హత సాధించవచ్చు. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కేంద్రాలకు వెళ్లకుండానే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీవోల ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త రూల్ ప్రవేశపెట్టింది* *🔹ట్రాఫిక్స్‌ రూల్స్* *🌀మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆ వెహికిల్ రిజిస్ట్రేషన్‌ని రద్దుచేస్తారు. ఆ మైనర్‌కు పాతికేళ్లు వచ్చేంత వరకూ డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. ఓవర్ స్పీడ్‌కి రూ.వెయ్యి నుంచి 2 వేల వరకూ జరిమానా విధించనున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు* *♦️గ్యాస్‌ ధరలు* *💥నిత్యావసరమైన గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ సారి సిలిండర్ ధరలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. లేదంటే నిలకడగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో రేపు ఉదయం తెలుస్తుంది. అందువల్ల సిలిండర్ ధరలు ఎలా అయినా కదలొచ్చు. పెరిగితే మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంది*
Show all...
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
Show all...
132-Genl-2024.pdf2.66 MB
*📡సందేహాలు - సమాధానాలు ✍️* ◼◼◼◼◼◼◼◼◼◼ *❓ప్రశ్న:* వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు?? *✅జవాబు:* వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు. ••••••••• * ❓ప్రశ్న:* సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు?? *✅జవాబు:* ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు. ••••••••• *❓ప్రశ్న:* బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి?? *✅జవాబు:* ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.
Show all...
Photo unavailableShow in Telegram
*బడి బాటలో ప్రధానోపాధ్యాయుల పాత్ర..*
Show all...
అవినీతి జరుగుతుందని తెలిసినా.. లేదా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి లంచం అడిగినా.. ACB డిపార్టుమెంట్ నెంబర్లను సంప్రదించగలరు. #తెలంగాణ_రాష్ట్ర_ఏసీబీ_కాంటాక్ట్_నెంబర్స్: ACB WhatsApp: 9440446106 Toll free Number: 1064 Head Quarters: 04023251501. 1. Hyderabad City Range-I: 040-24617291 9440446109. 2. Hyderabad City Range-II: 040-24617408 9440446134. 3. Ranga Reddy Range: 040-24610142 9440446140. 4. Mahabub Nagar Range: 08542-242733 9491305609. 5. Nalgonda Range: 08682-225681 7382625525. 6. Warangal Range: 0870-2577510 9440446146. 7. Karimnagar Range: 0878-2243693 9440446166. 8. Nizamabad Range: 08462-237450 9440446149. 9. Medak Range: 08455-276522 9440446149. 10. Adilabad Range: 08732-226307 9440446166. 11. Khammam Range: 08742-228663 9440446146. 🇮🇳🫱🏾‍🫲🏼🇮🇳 అవినీతి అంతం వైపు అడుగులు వేయండి తెలంగాణ వినియోగదారుల ఫోరం. 🙏🙏🙏
Show all...