cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

SCHOOL AND EDUCATION

Advertising posts
559
Subscribers
+224 hours
+77 days
+1230 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

*📡Summer ELs Caliculation if vacation 49days✍️* FORMULA: *(365x1)/11-(27xNo.of dys availed/T.No.of dys vacatn)-6* No.of days working-Eligbl ELs >1,2-1 >3,4-2 >5,6-3 >7-4 >8,9-5 >10,11-6 >12,13-7 >14,15-8 >16-9 >17,18-10 >19,20-11 >21,22-12 >23,24-13 >25-14 >26,27-15 >28,29-16 >30,32-17 >32,33-18 >34,35-19 >36-20 >37,38-21 >39,40-22 >41,42-23 43,44,45,46,47,48,49 - 24 ELs
Show all...
*📍E- Filing Info📍* (ఈ మెసేజ్ ఆంధ్ర ప్రదేశ్ గ్రూప్ లలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్) *💥E-filing చేసేటప్పుడు గుర్తించు* *కోవలసిన కొన్ని ముఖ్య విషయాలు....* *1. ప్రొఫైల్ లొ ఎమైనా మార్పులు చేర్పులు చేయవలసి ఉంటే, చేసుకోవాలి, like, address, phone number mail ID,* *2. మీరు కొత్త PASPORT తీసుకొని ఉంటే, ఆ డిటైల్స్ కూడా ఎంటర్ చేయాలి.* *3. Salary income gross amount correct గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేయాలి, ఒక వేళ NPS employee అయితే, gross amount కు employer contribution కూడా add చేయాలి. కొన్ని income tax software లతో, income from other sources కింద చూపించారు. ఇది కరెక్ట్ కాదు, ఒకే employer, salary DA, HRA, NPS ఇస్తున్నాడు కావున, 17(1),17(2) ప్రకారం NPS AMOUNT add చేయాలి. 80CCD (2) కింద deduct చేయాలి.* *4.)ఎవరైతే పర్సన్ విత్ dissability ఉన్నారో & 80DD, 80U కింద మినహాయింపు కోరుతున్నారో, వారు తప్పనిసరిగా 10-IA form, నీ ఫైల్ income tax forms నందు అప్లోడ్ చేయాలి.* *5) మీకు ఏమైనా refund amount ఎమైనా వచ్చేది ఉంటే, july-31 లోపలే ఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత, చేస్తే, ఫైన్ తర్వాత ఇంకా ఎమైనా మిగిలి ఉంటే, ఆ refund రాదు. 89(1) కింద 10E file చేసి refund పొందగోరే వాళ్లు కూడా july-31 లోపలే చేసుకోవాలి. Dead line పొడిగించబడదు.* *6. TDS amount 26AS లొ reflect అయ్యకనే E-filing కి వెళ్ళాలి., అవసరం అయితే, 26AS, AIS,print/pdf తీసుకోవాలి. బ్యాంక్ SB/FD interest ఎమైనా ఉంటే, వాళ్ళ రూల్ ప్రకారం 10%tds కట్ చేస్తారు. మనం ఎమైనా అదనంగా ఉంటే , e-filing అప్పుడే చాలన్ పే చేసి, e-filing complete చేయాలి.* *7.ఇతరుల మాటలు గుడ్డి గా నమ్మి, హెల్త్ /ట్రీట్మెంట్ /హాస్పిటల్ బిల్స్ అని చెప్పి 80DDకింద మినహాయింపులు తీసుకోరాదు. గూగుల్ లో ఒకసారి ఆ సెక్షన్ గురించి ఎవరికీ వారే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. లేక పోతే సెక్షన్ 133(6) కింద మి assessing officer ట్రీట్మెంట్ డాక్యుమెంట్స్ అడిగితే, అవి సెక్షన్ కిందికి రాదు అంటే, పెనాల్టీ+tax రెండు పే చేయాలి.* *8.) నా దృష్టికి వచ్చిన కొంత మంది నోటీస్ లలో, HRA proof కూడా అడిగారు, అంటే రెంట్ అగ్రిమెంట్, form-12BA, సైన్ విత్ DDO, and original form -16 ( traces). And all deduction proof. For three years, notice one years ki వస్తె, ప్రూఫ్ 3 yeras కి అడుగుతున్నారు.* *9.ఎవరి ఇయర్ మన tax మి bar graph ద్వారా అనలైజ్ చేస్తున్నారు, మి ప్రిఫైల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కింది భాగాన obser చేయవచ్చు.* *10. TDS July-31 వరకు కూడా కాకపోతే, nil tax return file చేయండి, 234F కింద ఫైన్ పడదు, TDS తర్వాత రివైజ్ రిటర్న్ ఫైల్ చేస్తే, సరిపోతుంది.* *11. మీరు తీసుకున్న హోం LOAN INTEREST ను, కరెక్ట్ సెక్షన్ లో ఎంటర్ చేయండి, 2L వరకు, 24B, ఆ తర్వాత, 80EE, 80EEA, మి లౌన్ సాంక్షన్ డేట్ నీ బట్టి ఎంటర్ చేయండి.* *12. ఇంకా ఏమైనా పాత నోటీస్ లు ఉన్నాయేమో చెక్ చేయండి,* *13. 80G కింద ఎమైనా అమౌంట్ contribute చేసి ఉంటే, మి దోనర్ దగ్గర ఆన్లైన్ receipt దగ్గర పెట్టుకోండి.* *14. నాకు ఉన్న అవగాహన ప్రకారం మనం EHS కింద contribute చేసే amount 80G kinda చూపాలి, ఎందుకంటే, 80D అనేది హెల్త్ ఇన్స్యూరెన్స్, అది IRDAI, నిర్దేశించిన హెల్త్ insurence company లకే వర్తిస్తుంది.మనం చేసేది, ఎంప్లాయీస్ హెల్త్ scheme(EHS) not health insurance..* *15. ఏ emoloyee కానీ,సెక్షన్ 80DD & సెక్షన్80U రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్ చేయకూడదు. ఒకటి మాత్రమే.* *16. Process అయ్యాక 143(1) నోటీస్ వచ్చింది అంటే, మనం సేఫ్ సైడ్ అదే మనకు 143(2) వస్తె, మనం రిస్క్ లొ ఉన్నట్లే, మన చేసిన e-filing, assessing officer మరింత సమాచారం కావాలి, మీరు గతం లొ తీసుకోని మినహాయింపులు తీసుకున్నారు అని, హెచ్చరిక ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి.* *17. Income tax లొని section లు, కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కానీ అర్థం చేసుకొని తెలివిగా సమాధానం ఇవ్వాలి, high value, transactions జరిగిన, ఇట్టే AIR లొ తెలిసిపోతుంది,* *18. E-filing complete అయ్యాక మళ్ళీ Declaration బాగా చదవండి, పూర్తిగా నేనే బాధ్యుని( ఆధార్ OTP) sender. అని అర్థం.* *19. 120 డేస్ లోపల మీకు రావలసిన రెఫండ్ రాలేదు అంటే, 18004190025 కి సంప్రదించి హిందీ/ఇంగ్లీష్ లో కంప్లైట్ రైస్ చేయాలి*
Show all...
*S A A* 👉 *🏵️మార్పు రావాలి🏵️* *🌼ప్రశ్న:ఎన్నికల నిర్వహణలో మనం ప్రతిసారి ఇబ్బంది పడుతున్నది ఎక్కడ?* *✅జవాబు: రిసెప్షన్ సెంటర్‌లో.* *🌼వివరణ: 36 గంటల శారీరక, మానసిక పరిశ్రమతో మనం రిసెప్షన్ సెంటర్‌కి‌ వెళ్ళేసరికి అక్కడ ఎదురవుతున్న‌ పరిస్థితులేమి *👉 కవర్లు, ఫారాలు బుక్‌లెట్ రూపంలో నీట్‌గా ఇచ్చారు. కానీ అటించనవసరం లేని వాటికి కూడా గమ్ ఇచ్చి పొరపాటు చేసారు. అంటించినవన్నీ విప్పి‌ చూపించవలసి వచ్చింది.* *🔷అసలు ఒక మనిషి ఆహారం లేకుండా, విశ్రాంతి లేకుండా ఎన్ని గంటలు పని చేయగలడు? 5.30 కి మాక్‌పోల్ మొదలు పెట్టాలి. 7.00 గంటలకు Actual Poll మొదలు‌ పెట్టాలి? మరి టిఫిన్స్ ఎప్పడు చేసేది?* *👉పోలింగ్ నిరంతరాయంగా‌ సాగాలి బ్రేక్ ఇవ్వకూడదు. మరి భోజనం చేసేది ఎప్పుడు?* *👉పోలింగ్ పూర్తవగానే బస్సు వచ్చే లోగా కవర్లు రెడీ చేసుకోవాలి. మరి డిన్నర్ చేసేది ఎప్పుడు?* *🏵️పై అన్ని విషయాలలోను సంస్కరణలు తీసుకురాకపోతే ముందు ముందు ఎలక్షన్ డ్యూటీ‌చెయ్యడానికి ఎవరూ సముఖత చూపించరు. పైన చెప్పిన‌ అంశాలలో తగిన‌ మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది*
Show all...
*🔊భోజనానికి ముందు, తర్వాత..టీ, కాఫీలు తాగొద్దు*       *🔶ఐసీఎంఆర్ సైంటిస్టుల హెచ్చరిక*      *🔷దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తయ్*      *🔶ఫుడ్​లోని ఐరన్ శాతాన్ని కాఫీలోని టానిన్లు తగ్గిస్తయ్* *🍥న్యూఢిల్లీ:  టీ, కాఫీలను మితంగానే తాగాలని, అదేపనిగా తాగడం అనారోగ్యానికి కారణమవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సైంటిస్టులు హెచ్చరించారు. దేశమంతటా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)తో కలిసి ఐసీఎంఆర్ ఇటీవల కొత్త డైట్ గైడ్​లైన్స్​ను విడుదల చేసింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు.. హెల్తీ లైఫ్ స్టైల్​కు ఎంతో కీలకమని చెప్పింది. తామిచ్చిన డైట్ గైడ్​లైన్స్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది.* *🌀ఇందులో టీ, కాఫీల వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి వివరించింది. ‘‘టీ, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మన కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఈ పానీయాలు తాగిన తర్వాత రిఫ్రెష్  అయిన ఫీలింగ్​వస్తుంది. ఇది కొంత వరకు నిజమే అయినా.. అదేపనిగా టీ, కాఫీలు తాగితే వాటి ద్వారా శరీరంలోకి చేరే కెఫిన్ మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తది.* *💠150 మిల్లీ లీటర్ల కాఫీలో 80 నుంచి 120 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. ఇన్​స్టంట్ కాఫీలో 50 నుంచి 60 మిల్లీ గ్రాములు, టీలో 30 నుంచి 65 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. రోజుకు కేవలం 300 మిల్లీ గ్రాముల కెఫిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మోతాదు దాటితే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి’’ అని ఐసీఎంఆర్ హెచ్చరించింది.* *💥గుండె జబ్బుల ముప్పు కూడా..* *✳️అన్నం తినే గంట ముందు, తిన్నంక గంట దాకా టీ, కాఫీలు తాగొద్దని ఐసీఎంఆర్ సూచించింది. ఇండియాలో చాలామంది టీ లేదా కాఫీలను భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకుంటారని తెలిపింది. ఇలా చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ‘కాఫీ, టీలో టానిన్లు ఉంటాయి. ఇవి ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. జీర్ణాశయంలోకి చేరిన ఆహారంలోని ఐరన్ తో టానిన్ చర్య జరిపి, రక్తంలోకి చేరకుండా అడ్డుపడుతుంది. దీంతో బాడీలో ఐరన్ సమతుల్యత దెబ్బతింటది. బాడీలో ఐరన్ శాతం సరైన మోతాదులో ఉండాలి. ఐరన్ తక్కువైతే రక్తహీనత సహా పలు సమస్యలు చుట్టుముడతాయి’’ అని ఐసీఎంఆర్ వివరించింది.* *💥హిమోగ్లోబిన్ తయారీపై ప్రభావం* *❇️శరీరమంతా ఆక్సిజన్​ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్​ను తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. బాడీలో ఐరన్ లోపిస్తే.. తరుచూ అలసిపోవడం లేదా శక్తి లేకపోవడం, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యేకించి బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవడం, గోర్లు పెలుసుగా మారిపోవడం లేదంటే జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. అయితే, పాలు లేకుండా టీ తాగడంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్, స్టమక్  క్యాన్సర్ రిస్క్​లు తగ్గుతాయని ఐసీఎంఆర్ తన గైడ్​లైన్స్​లో పేర్కొంది.*
Show all...
*📡OPO పేరుతో రెమ్యూనరేషన్ లో తేడాలు తగదు✍️* ఎన్నికల విధులలో ప్రధాన పాత్ర PO, APO లతో పాటు OPO లది కూడా..... *పోలింగ్ సామాగ్రి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి సామాగ్రిని సిబ్బందికి అప్పజెప్పేంతవరకు ఓపిఓ ఉండవలసిందే*. 👉పిఓ తో సమానంగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఓపిఓలకు రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో తేడాలు ఎందుకు. 👉 పీవో చెక్ లిస్ట్ చదివితే సామాగ్రిని చెక్ చేసేది ఓపిఓ. 👉మిషన్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించేది ఓపిఓ. 👉పోలింగ్ కేంద్రం వద్దకు సామాన్లు రవాణా చేయడంలో సహకరించేది ఓపిఓ. 👉పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత 17 ఏ రిజిస్టర్ మెయింటైన్ చేయడంలో మరియు పోల్ స్లిప్స్ లు రాసి అందించడంలో ప్రధాన పాత్ర వహించేది ఓపిఓ. 👉అన్నింటికంటే ముఖ్యమైనటువంటి కంట్రోల్ యూనిట్ ను కంట్రోల్ చేసేది opo. 👉 మార్కుడ్ లిస్టుకు, 17A కు మరియు కంట్రోల్ యూనిట్ లో ఓట్లు ఎలాంటి తేడాలు రాకుండా చూసుకునేది ఓపిఓలు. 👉 *మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక పోలింగ్ స్టేషన్ కు గుండెకాయ మరియు మెదడు లాగా పని చేసేది ఓపివోలు* 👉మాకు పోల్ ప్రారంభానికి ముందు అన్ని మిషన్లను కనెక్ట్ చేసి సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయడంలో మరియు మాక్ పోల్ సమయంలో ప్రధాన సహకారం అందించేది ఓపిఓ. 👉అన్ని యూనిట్స్ మరియు అన్ని కవర్స్ ను సీల్ చేసేది ఓపిఓ. 👉తిరిగి పోలింగ్ కేంద్రం వద్దకు సామాగ్రి మొత్తం చేర్చే విషయంలో ఓపిఓ లది ప్రధాన భూమిక. 👉ఆ తర్వాత పూర్తి సామాగ్రిని అక్కడి సిబ్బందికి అప్పజెప్పేంతవరకు ఓపిఓ ఉండవలసిందే.. 👉 ఒక పోలింగ్ బూత్ లో 100% సక్సెస్ రేట్ సాధించాలంటే ఓవరాల్ పోలింగ్ ఆఫీసర్ గా పని చేసేది ఆ బూతులో ఉన్నటువంటి ఓపిఓలు. 👉ఎలక్షన్ విధులలో ఇంతటి ప్రధాన భూమికను పోషిస్తున్న ఓపిఓలకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. 👉అందరికీ సమానమైన పనులే అయినప్పుడు రెమ్యూనరేషన్ తక్కువగా ఇవ్వడం ఏమిటి ? 👉 *పోలింగ్ నిర్వహణలో పాల్గొన్న ప్రతి పోలింగ్ ఆఫీసర్ కు ఒకే విధమైన రెమ్యూనరేషన్ చెల్లించాలి*. 👉 ఒక్క మాట OPO అంటేనే *overall polling officer*
Show all...
*🏵️ అహా...ఓహో..🏵️* *🌼అంతా ఉత్తిదే.* *🔷ఎన్నికల విధులలో ఉపాధ్యాయుల కష్టాలు.* *🌼మారని తీరు* *🌼కేవలం ప్రకటన,పెపర్ల లో మాత్రమే.* *🌼ఏమి లేదు.అదే తీరు,అవే కష్టాలు.* *👉 డిస్టుబ్యూషన్ సెంటర్ లో ఏర్పాట్లు నిల్.* *👉కూలర్లు పెట్టారు నీళ్ళు పోయాక వేడి గాలి.* *👉అన్నం,కూర ఇవి కావు అనే నిజం.దొడ్డు బియ్యం,నీళ్ళ కూరలు,పిట్ట గుడ్డు కంటే పెద్ద గుడ్డు.నీళ్ళు లేవు.* *🌼తింటే తినుర్రి లేకపోతే పొంర్రి అంతే ఇగ.* *🌼ఇగ పెట్టెలు ఎత్తుకొని బస్సు తిరిగి,తిరిగి,ఆగి,ఆగి చేరుకొని మొత్తం పని చేసుకొని బువ్వ తిందామంటే ముక్కి పోయి వాసన వచ్చే అన్నం,పావుకిలో పప్పు లో బిందెడు నీళ్ళు.* *🏵️ఎన్నికల కమీషన్,జిల్లా అధికాలు ఆలోచించాలి.* *👉ఎంతసేపు ట్రైనింగ్,గైహాజరు,క్రిమినల్ కేసు,సస్పెండ్,మేమో* *👉ముందు అధికారులకు శిక్షణ ఇవ్వాలి.* *👉టీచర్లు అంటే కూలీలు కాదు* *👉బువ్వ లేక మీ దగ్గరకు రాలే.* *🔷సరైన వసతులు, తిండి,నిద్ర లేకుండా ఎలా పనిచేస్తారు అని ఆలోచన లేదు.* *🌼ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికల ప్రక్రియ,జనాభా లెక్కలు అనేవి అసాధ్యం.ఈ రెండే దేశం లో కీలకం.* *🔶ఇక నైనా అహా... ఓహో..వద్దు.చేసి చూపండి.* *🔶ఉపాధ్యాయ వేదిక*
Show all...
*🔊వాకింగా.. రన్నింగా.. ఏది బెస్ట్‌?* *🍥గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాయామాల ప్రస్తావన వస్తే… ఎక్కువమంది ఎంపిక రన్నింగ్‌ లేదా వాకింగ్‌ అయ్యుంటుంది. అంతగా ప్రాచుర్యం పొందిన సులువైన వ్యాయామాలు ఇవి. ఈ రెండూ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఏది మంచిదంటే మాత్రం మన అవసరాలకు తగినట్టుగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ముందుగా దేనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలి.* *💥వాకింగ్‌* *🌀రోజువారీగా సులువుగా చేసే వ్యాయామాల్లో నడక ఒకటి. వేగంగా నడిచే బ్రిస్క్‌ వాక్‌ అయినా, పార్కుల్లో విశ్రాంతిగా నడిచినా దేని ప్రయోజనాలు దానికి ప్రత్యేకం.* *💠కీళ్లకు మంచిది: రన్నింగ్‌లా కాకుండా వాకింగ్‌ కీళ్ల మీద తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్‌ సమస్యలు ఉన్నవాళ్లకు నడక మంచి ఎంపిక.* *🥏ఎవరైనా సరే: వయసు, ఫిట్‌నెస్‌ స్థాయులతో సంబంధం లేకుండా అందరూ నడవగలరు. కాబట్టి, వ్యాయామం కొత్తగా మొదలుపెట్టేవాళ్లు వాకింగ్‌తో ప్రారంభించడం మంచిది. ఇంకా గాయాల నుంచి కోలుకుంటున్న వారికైనా వాకింగ్‌ ఉత్తమ వ్యాయామంగా నిలుస్తుంది.* *✳️గుండెకు అండ: రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులు సమతూకంలో ఉంటాయి.* *💫మానసిక ఆరోగ్యం: వాకింగ్‌ వల్ల ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు మొదలైనవి తగ్గుతాయి. మూడ్‌, మెదడు పనితీరు మెరుగుపడతాయి.* *❇️బరువు నిర్వహణ: రన్నింగ్‌ అంత కాకపోయినప్పటికీ శరీరంలో అధికంగా పేరుకున్న క్యాలరీలను కరిగించడంలో వాకింగ్‌ ఎంతోకొంత సాయపడతుంది. నడకకు ఆరోగ్యకరమైన ఆహారం తోడైతే శరీర బరువు తగ్గించుకోవచ్చు.* *💥రన్నింగ్‌* *🔶వాకింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌ కొంచెం తీవ్రమైన వ్యాయామం కిందికి వస్తుంది. దీని ప్రయోజనాలు దీనికి ఉన్నాయి.* *🔷క్యాలరీలు కరుగుతాయి: వాకింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. అలా అధిక బరువు వదిలించుకుని, ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకోవడానికి రన్నింగ్‌ ఉత్తమమైన మార్గం.* *🔆గుండె ఆరోగ్యానికి: ఓ మోస్తరు నుంచి కొంచెం తీవ్రమైన రన్నింగ్‌ వల్ల గుండె, ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. అలా శ్వాస వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది.* *🔅ఎముకల దారుఢ్యానికి: రన్నింగ్‌ ఎముకల పెరుగుదల, వాటి సాంద్రతను ప్రేరేపిస్తుంది. ఎముకల దారుఢ్యాన్ని పెంచి ఆస్టియో పొరోసిస్‌ ముప్పును తగ్గిస్తుంది.* *⚡ఒత్తిడి నిర్వహణలో: నడకలోలాగే రన్నింగ్‌ కూడా శరీరంలో ఎండార్ఫిన్ల విడుదలకు కారణమవుతుంది. ఇవి ఒత్తిడిని తరిమేస్తాయి. మూడ్‌ను మెరుగుపర్చి ఉపశమనాన్ని ఇస్తాయి.* *🌼సమయం కలిసొస్తుంది: వాకింగ్‌తో పోలిస్తే అవే ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రన్నింగ్‌తో తక్కువ సమయం పడుతుంది. అలా బిజీగా ఉండేవాళ్లకు రన్నింగ్‌ ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది.* *💥ఏది మంచిది?* *🏵️ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వ్యక్తిగత అభిరుచులు, ఫిట్‌నెస్‌ లక్ష్యాలు, శారీరక సామర్థ్యాన్ని బట్టి వాకింగ్‌ చేయాలా, రన్నింగ్‌ చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే మొదలుపెట్టేవాళ్లు, కీళ్లనొప్పులు ఉన్నవాళ్లకు నడక మంచి ఎంపిక. ఇక క్యాలరీలు ఎక్కువగా కరిగించుకోవాలని అనుకుంటే మాత్రం రన్నింగ్‌ను ఎంచుకోవచ్చు. అయితే, రన్నింగ్‌ను నెమ్మదిగా ఆరంభించాలి. శరీరానికి గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్‌నెస్‌ నిపుణుడిని సంప్రదించిన తర్వాతే ఏ వ్యాయామాన్ని అయినా మొదలుపెట్టడం మంచిది. ఎక్కువ కాలంపాటు చేయగలిగే వ్యాయామాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం సొంతం చేసుకోవచ్చు.*
Show all...
Photo unavailableShow in Telegram
*Ours photos covered in today's Sakshi*
Show all...
Photo unavailableShow in Telegram
*Election remuneration --Orders issued👆🏼*
Show all...
Photo unavailableShow in Telegram
*🔰Total Election process at a glance..*
Show all...