cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

SCHOOL AND EDUCATION

Mostrar más
Publicaciones publicitarias
564
Suscriptores
-124 horas
+17 días
+1030 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
Mostrar todo...
New Doc 06-05-2024 15.07.pdf6.62 KB
*📡సందేహాలు - సమాధానాలు✍️* 1. సందేహం: *"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు?* సమాధానం: *1933 APLR రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్స్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.* 2. సందేహం: *నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను. సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?* సమాధానం: *వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.* 3. సందేహం: *నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను. ఇంటర్, డిగ్రీ, హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు. ఎందుకని?* సమాధానం: *మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.* 4. సందేహం: *నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను. ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను. నాకు పెన్షన్ ఎంత వస్తుంది?* సమాధానం: *చివరి మూలవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.*
Mostrar todo...
💥💥 *తెలంగాణ రాష్ట్ర గీతం* 💥💥 (2.30 నిమిషాల నిడివి) 1. జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లీ నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ.... 2. జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నాగానం అమ్మనీవే మా ప్రాణం జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ... 3. గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జైజై తెలంగాణ జై తెలంగాణ జైజై తెలంగాణ....
Mostrar todo...
*_పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?_* _(వివక్షతను మించిన విషం ఉంటుందా!!?)_ *=================* _|మనసును కదిలించే కథ... చదవండి! 🙏|_ *కరీంనగర్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా, పక్కనే ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా school కే పంపడం. ఇంకా ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్లంటేనే పడదు. అలాంటిది మళ్లీ ఈ ఊరమాస్ పిల్లలకు చదువు చెప్పాలి. "దేవుడా ! ఏంటీ పరీక్ష" అని రోజూ చిరాకుతో కూడిన చిర్రబుర్రులతోనే బడికి వెళ్లేదాన్ని.* *అందులో ఒక్కణ్ణి చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాణ్ని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు మూడో తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకొనేవాడు. ఆరాతీస్తే, వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పని చేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని, పంపిస్తూన్నా రనిపించింది.* *నా దృష్టిలో అయితే వాడు చాలా poor student. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్ప చెప్పమన్నా కూడా వాడికి 5 కి మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అస్సలు వాడి వైపు చూడ్డం కానీ, మాట్లాడటం కానీ అస్సలు చేసేదాన్ని కాదు.* *అలాంటోడు కొన్ని రోజులుగా school ki రావడమే మానేశాడు. ఇలాంటి places లో school ki రావడం, మానేయడం వీళ్ళకు మామూలే కదా! అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు...* *ఒకరోజు హెడ్మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఆయనకెదురుగా ముప్పై ఏళ్ళున్న ఒక labour ఆవిడ చేతులు కట్టుకుని నిల్చుని ఉంది.* *ఆవిణ్ణి నాకు పరిచయం చేస్తూ.. _"ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు పదిరోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడంట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది madam ఒక్కసారి మాట్లాడండీ"_ అన్నారు హెడ్మాస్టర్.* *వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్లెంబడి నీళ్లతో కుప్పకూలి, మేడమ్..! వాడు పోయే ముందు ఎప్పుడూ... _"నళిని మేడమ్ తో ఒక్కసారన్నా good అనిపించుకోవాలి అమ్మా"_ అని నాతో రోజూ చెప్పేవాడు.* *వాడు చనిపోయే ముందురోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా...! వాడు తనకు తానే _" సాంబడు good"_ అని పుస్తకంలో రాసుకొని మీ లాగే సంతకం చేసుకున్నాడు," అని తాను తెచ్చుకున్న సంచిలోనుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళ మ్మ... నాకళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటిబొట్లతో వాడు పెట్టిన నా.. నా.. సంతకం తడిసి, పేజీ ముద్దగా అవుతోంది. నాకు దుఃఖం ఆగడంలేదు.* *వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాణ్ని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూళ్ళేదు వాణ్ని.* *పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో! _"తండ్రీ ఎక్కడున్నా నన్ను క్షమించు... జాతి, వర్ణ, ఆర్ధిక బేధాలతో.. వివక్షలతో చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్దమనుషులను కూడా క్షమించరా"😌_ అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ...* *_“సాంబడు is Very Good” నాలాంటి ఎందరో కళ్లు తెరిపించావు తండ్రీ!_ అని అదే బుక్ లో రాసి ఆ గదిలోనే ఉన్న bench మీద కూర్చుని హెడ్మాస్టర్ గారి వెనుక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి _"తప్పు చేశాను సార్! 🙏ఇక మీదట ఇలా జరగదు"_ అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను.* 😌 *_దయచేసి పిల్లలని ప్రేమించండి.🙏_* _మీ...._ _—నళిని టీచర్_ — *Written by ✍️ Challa SridharReddy, software engineer, Telangana*— *:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:* *_{ఇదిసేకరణే.... ఈ కథను తెలంగాణకు చెందిన 'చల్లా శ్రీధర్ రెడ్డి' అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాశారు. నాకు పర్సనల్ గా పంపించారు. చదువుతూంటే నా మనసు కదిలింది.. కళ్ళు చెమ్మగిల్లాయి. అందరూ చదవాల్సింది.. ముఖ్యంగా టీచర్లు. అందుకే.. మీతో పంచుకుంటున్నాను.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
Mostrar todo...
Photo unavailableShow in Telegram
తెలంగాణ కొత్త గీతం
Mostrar todo...
*🔊రేపే జూన్1....అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే* *🍥జూన్ 1వ తేదీ నుంచి పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి* *💠ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌* *❇️ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. కేంద్రం ప్రభుత్వం కొన్ని నెలల కిందట ఆధార్‌ కార్డ్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు జూన్ 14తో ముగియనున్నది. ఈ గడువు తేదీ ముగిసిన తర్వాత ప్రతీ అప్డేట్‌ చేసుకోవాలనుకుంటే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు గడువులోగా ఆధార్ అప్ డేట్ చేసుకుంటే ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు* *🥏డ్రైవింగ్‌ లైసెన్స్‌* *✡️సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కి అర్హత సాధించవచ్చు. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కేంద్రాలకు వెళ్లకుండానే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీవోల ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త రూల్ ప్రవేశపెట్టింది* *🔹ట్రాఫిక్స్‌ రూల్స్* *🌀మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆ వెహికిల్ రిజిస్ట్రేషన్‌ని రద్దుచేస్తారు. ఆ మైనర్‌కు పాతికేళ్లు వచ్చేంత వరకూ డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. ఓవర్ స్పీడ్‌కి రూ.వెయ్యి నుంచి 2 వేల వరకూ జరిమానా విధించనున్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు* *♦️గ్యాస్‌ ధరలు* *💥నిత్యావసరమైన గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ సారి సిలిండర్ ధరలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. లేదంటే నిలకడగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో రేపు ఉదయం తెలుస్తుంది. అందువల్ల సిలిండర్ ధరలు ఎలా అయినా కదలొచ్చు. పెరిగితే మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంది*
Mostrar todo...
Document from 🍃 𝐕𝖊𝖓k𝖆𝖙𝖊𝖘𝖍
Mostrar todo...
132-Genl-2024.pdf2.66 MB
*📡సందేహాలు - సమాధానాలు ✍️* ◼◼◼◼◼◼◼◼◼◼ *❓ప్రశ్న:* వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు?? *✅జవాబు:* వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు. ••••••••• * ❓ప్రశ్న:* సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు?? *✅జవాబు:* ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు. ••••••••• *❓ప్రశ్న:* బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి?? *✅జవాబు:* ఒక బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
*బడి బాటలో ప్రధానోపాధ్యాయుల పాత్ర..*
Mostrar todo...
అవినీతి జరుగుతుందని తెలిసినా.. లేదా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి లంచం అడిగినా.. ACB డిపార్టుమెంట్ నెంబర్లను సంప్రదించగలరు. #తెలంగాణ_రాష్ట్ర_ఏసీబీ_కాంటాక్ట్_నెంబర్స్: ACB WhatsApp: 9440446106 Toll free Number: 1064 Head Quarters: 04023251501. 1. Hyderabad City Range-I: 040-24617291 9440446109. 2. Hyderabad City Range-II: 040-24617408 9440446134. 3. Ranga Reddy Range: 040-24610142 9440446140. 4. Mahabub Nagar Range: 08542-242733 9491305609. 5. Nalgonda Range: 08682-225681 7382625525. 6. Warangal Range: 0870-2577510 9440446146. 7. Karimnagar Range: 0878-2243693 9440446166. 8. Nizamabad Range: 08462-237450 9440446149. 9. Medak Range: 08455-276522 9440446149. 10. Adilabad Range: 08732-226307 9440446166. 11. Khammam Range: 08742-228663 9440446146. 🇮🇳🫱🏾‍🫲🏼🇮🇳 అవినీతి అంతం వైపు అడుగులు వేయండి తెలంగాణ వినియోగదారుల ఫోరం. 🙏🙏🙏
Mostrar todo...