cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Telugu inspirational stories quotes & jokes

Telugu moral & inspirational stories, quotes, jokes & facts

Show more
Advertising posts
6 359Subscribers
-124 hours
-17 days
-2730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

శక్తి తో సాధించలేనిది, యుక్తితో చేయగలం..
Show all...
👆సహనం ఓర్పు పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే..
Show all...
జర భద్రం.. జాగ్రత్త.. *కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...* *అందుకు గల కారణాలు:* 1. *అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.* 2. *చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.* 3. *పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .* 4. *ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)* 5. *చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.* 6. *ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.* 7. *ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం* 8. *భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...* 9. *మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.* 10. *మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.* 11. *కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.* 12. *మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.* 13. *social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.* 14. *ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.* *ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.* *ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో...*🍁
Show all...
*మానవుని సంపద.....* *ఒక వ్యాపార వేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని, చాలా కస్టపడి సుమారు వెయ్యి కోట్లు రూపాయిలు సంపాదించాడు.* *ఒకరోజు ఆ వ్యాపార వేత్త తాను ఎంతో కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ధనం, తాను చనిపోయినా సరే ఎవరికీ, ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని, బాగా ఆలోచించి, పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు.* *ఏమని అంటే... ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తానన్నాడు.* *నెల గడిచినా ఎవరు రాలేదు. అప్పుడు మళ్ళీ వంద కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో, చిక్కి సగం అయిపోయి ఉండగా...* *ఒక రోజు ఒక జ్ఞాని వచ్చి... నేను మీ డబ్బు మీకు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెపుతాను అని అన్నాడు...* *అప్పుడు ఆ వ్యాపార వేత్త... ఎలా..? అని ప్రశ్నించాడు...* *దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపార వేత్తతో... మీరు అమెరికా, ఇంగ్లండ్, జపాన్ వెళ్ళారా..? అని అడిగాడు...* *దానికి ఆ వ్యాపార వేత్త... హా... వెళ్లాను అని చెప్పాగా...* *అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు...* *దానికి ఆ వ్యాపార వేత్త... మన భారతదేశ నోట్లు అమెరికాలో చెల్లవు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకొని వెళ్తాను, అదే ఇంగ్లండ్ ఆయితే పౌండ్ గా, జపాన్ ఆయితే యన్స్ గా... ఇలా ఏదేశం వెళ్తే, ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి, తీసుకొని వెళ్తాను అని అన్నాడు...* *అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు...* *ఓ కోటీశ్వరుడా...! అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా, నీడబ్బు నీతో రావాలంటే, నీవు వెళ్లాలని నిర్ణయించుకున్న దేశం లాగా... ఒకవేళ నీవు నరకానికి వెళ్లాలి అని అనుకుంటే నీడబ్బును పాపము లోనికి మార్చు. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనులలోనికి మార్చు.* *లేదా... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే, నీ డబ్బును దాన, ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో... అని చెప్పగానే... ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి, ఆ జ్ఞానిని వంద కోట్లు తీసుకోమంటాడు.* *దానికి జ్ఞాని... నేను కస్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు. అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు, తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహకుడిగా నియమించి, తగినంత జీతం తీసుకోమని చెప్పి, తన సంపద అంతా సన్మార్గంలోనికి, పుణ్యం లోనికి, జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా... పాత పాప కర్మలు పరివర్తనతో నశించి, మంచి కర్మల వలన పుణ్య గతులకు వెళ్తాడు...* *ఇదండీ... మానవుని సంపద మానవునితో వచ్చే విధానం...* *మనం కష్టపడి సంపాదించినది... మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి, పుణ్యం గా మార్చి మనతో తీసుకొని వెల్దామా... లేక... ఇక మీ ఇష్టమే.....*.🍁
Show all...