785
المشتركون
-124 ساعات
لا توجد بيانات7 أيام
-130 أيام
أرشيف المشاركات
రైల్వేలో 5,165 ఉద్యోగాలకు ఆమోదం
యువతకు మరో శుభవార్త చెప్పడానికి RRB సిద్ధమవుతోంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 5,165 పోస్టులను రైల్వే బోర్డు ఆమోదించింది. ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,477, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 1,688 ఖాళీలున్నాయి. ఇంకా ఎక్కడైనా ఖాళీలుంటే ఈ నెల 26లోపు సమర్పించాలని అన్ని జోన్లను ఆదేశించింది. ఆ వివరాలను సేకరించిన తర్వాత RRB నోటిఫికేషన్ జారీ చేయనుంది.
2,482 ఉద్యోగాలకు నోటిఫికేషన్
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. APలో 80, TGలో 50 పోస్టులున్నాయి. ఇవాల్టి నుంచి SEP 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్, లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. CBT, లాంగ్వేజ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
366: https://bankofbaroda.bank.in/
*✍️Aadhar సూపర్వైజర్ ఉద్యోగాలు ఇంటర్ పాస్ అయితే చాలు*
*👉ఎటువంటి పరీక్ష లేదు ఎటువంటి ఫీజు లేదు వెంటనే అప్లై చేసుకోండి*
https://youtu.be/DvVsWDMqscE
*10,743 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్*
*ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS)లో కొత్తగా 10,743 పోస్టుల భర్తీ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఆర్థిక అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల కానుంది. 3,823 ఫైర్ ఆపరేటర్, 3,546 ఎమర్జెన్సీ రెస్క్యూ, 1,153 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) ఈ నియామక ప్రక్రియ చేపట్టనుంది. దేశ పౌరులెవరైనా అప్లై చేసుకోవచ్చు.*
📢 ఏపీ టెట్ (AP TET) – 2026
🗓 AP TET 2026 హాల్ టికెట్లు జూలై 25, 2026 నుండి అందుబాటులోకి రానున్నాయి.
📝 పరీక్షల తేదీలు: ఆగస్టు 5, 2026 నుండి ఆగస్టు 21, 2026 వరకు నిర్వహించబడతాయి.
🎫 హాల్ టికెట్ డౌన్లోడ్ విధానం:
1. AP TET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. Hall Ticket Download లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ Registration Number మరియు Date of Birth నమోదు చేయండి.
4. Submit పై క్లిక్ చేసి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
🌐 అధికారిక వెబ్సైట్:
[AP TET Official Website](https://tet2dsc.apcfss.in?utm_source=chatgpt.com)
డిగ్రీ అర్హతతో 779 ఉద్యోగాలు.. అప్లై చేశారా?
బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 779 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి 60% మార్కులతో డిగ్రీతోపాటు CA/CFA, CMA, ఫైనాన్స్/బ్యాంకింగ్‌లో MBA పాసైన వారు అర్హులు.
25-45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. CBT, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు SC/ST/దివ్యాంగులకు రూ.175, ఇతరులకు రూ.850. వెబ్సైట్:
https://bankofindia.bank.in/
259 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) 259 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ (మైనింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జులై 14 నుంచి AUG 5 వరకు అప్లై చేసుకోవచ్చు. మైనింగ్ సిర్దార్ పోస్టులకు టెన్తో పాటు సిర్దార్‌షిప్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 18-30 ఏళ్లు. జీతం రూ.47-51 వేల వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.1,180. SC, STలకు ఉచితం. CBT, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
https://www.nclcil.in/data-listing/pages/recruitment
రైల్వేలో 6,565 గ్రేడ్-1, గ్రేడ్-2 టెక్నీషియన్ పోస్టులకు RRB జూన్ 29న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇప్పటికే షార్ట్ నోటీస్ రిలీజైంది. దాని ప్రకారం గ్రేడ్-1 323, గ్రేడ్-2 6,242 పోస్టులు ఉన్నాయి. జూన్ 30 నుంచి జులై 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పదో తరగతితో పాటు ITI పాసై ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఆన్సర్ కీ
వచ్చేసింది
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (GD)-2026 పరీక్షల ఆన్సర్ కీ విడుదలైంది. 25,487 ఉద్యోగాలకు ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి. జూన్ 15 నుంచి 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని SSC తెలిపింది. పూర్తి వివరాలకు https://ssc.gov.in/໕໕.
AP: నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే ₹3 వేల భృతి దిశగా వెళ్తున్నామని CM CBN వెల్లడించారు. 'అన్నీ చేసేశామని చెప్పడం లేదు. శుభారంభం చేశాం. అనేక హామీలు అమలు చేశాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తాం. ప్రపంచంలోనే మేటైన యువతగా తీర్చిదిద్దుతాం. YCP, కూటమి మ్యానిఫెస్టోల్లో ఎవరెలా అమలు చేశారో చర్చకు సిద్ధం' అని తిరుపతి సభలో పేర్కొన్నారు. కేంద్రంలో BJP 4వసారి గెలుస్తుందని, ఏపీలో కూటమిదే విజయమన్నారు.
*✍️ఏపీలో మెగాడిఎస్సి నోటిఫికేషన్..*
*👉పరీక్షలు ఎప్పుడో తెలిస్తే షాక్*
https://youtu.be/T4O7dNKz8Ys
AP: రాష్ట్రంలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. మొత్తం 229 పనిదినాలు, ఆదివారాలతో కలిపి 87 సెలవులు ఉండనున్నాయి. దసరాకు అక్టోబర్ 12-21 వరకు, క్రిస్మస్ DEC 20-27, సంక్రాంతికి 2027 JAN 11-17 వరకు హాలిడేస్ ప్రకటించింది. ప్రతి శనివారం నో బ్యాగ్ డే ఉండనుంది. పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ MAR 15-31 వరకు జరగనున్నాయి.
AP: టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ వివరాల్లో పొరపాట్లను హెడ్మాస్టర్ల ద్వారా సవరించుకొనే అవకాశాన్ని ఈ నెల 15 వరకు పొడిగించినట్లు SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా వెరిఫై చేసి హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా పొరపాట్లను సవరించాలని పేర్కొన్నారు. విద్యార్థులు, పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
