cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

🕉వేదాంత సంగ్రహం🕉

ఆధ్యాత్మిక నిలయం

Більше
Рекламні дописи
1 509
Підписники
Немає даних24 години
+47 днів
+1730 днів
Час активного постингу

Триває завантаження даних...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Аналітика публікацій
ДописиПерегляди
Поширення
Динаміка переглядів
01
Vasavi Kanyaka Parameshvari Jayanthi
880Loading...
02
Media files
870Loading...
03
Media files
850Loading...
04
Media files
820Loading...
05
🪷 *వరాహమిహిరాచార్యం నమస్తుభ్యం*🪷 🌹 *సర్వధర్మాన్ పరిత్యజ్య*🌹 🌷 ఆగస్టు 3వ తేది రాత్రికి పరిస్థితి మరీ విషమించింది. పురుగు కుట్టిన విషం బాగా తలకు ఎక్కింది. ఇక నా జీవితానికి ఆఖరు క్షణాలు అని నాకనిపించి మానసికంగా "అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణంమమ" అనుకుంటూ గజేంద్ర మోక్షంలోని ఆ "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె" అనే పద్యాన్ని మననం చేసుకుంటూ  మగతగా పడుకున్నాను. కాసేపటికి నా భార్య నన్ను తట్టిలేపి "బుజ్జిగారు ఫోన్ చేసి మందు చెప్పారు. మందు వేస్తున్నాను నోరు తెరవండి" అన్నది. "ఏమిటి ఇంత రాత్రివేళ బుజ్జి ఫోన్ చేశాడా? ఎంత దయ ఆయనకి నామీద" అనుకున్నాను. మాత్రలు నోట్లో కరుగుతూ ఉన్నాయి. తలంతా బాగా మిగల పండిన దోసకాయలాగా నీటితో తడిపిపెట్టిన మైదా ముద్దలాగా ఉన్నది. "నారాయణా, వాసుదేవా, గోవిందా, రామచంద్రా” అనుకుంటూ "ఎందుకు నాకీ పరీక్ష పెట్టారు? నేనెవరికీ ఎప్పుడూ ఏవిధమైన అపకారం చేసినవాడను గాదే... మాస్టరు ఇ.కె.గారి విశ్వప్రణాళికలో భాగమయిన "వైద్యసేవ" చేస్తూనే ఉన్నాను గదా! మాస్టరుగారు నాకిచ్చిన వాగ్దానం "నా పని నీవు చేస్తే, నీపని నేను చేస్తానన్నారు. మరి ఏమిటీ పరీక్ష!" అనుకుంటూ ఆవేదన చెందుతుండగా. తల దురద అనిపించి నెమ్మదిగా తల మీద వ్రేలితో గోకాను, అంతే వేలు తలలోకి వెళ్ళిపోయింది. వేలు బయటకు లాక్కునేటప్పటికి బాగా మిగులపండి కుళ్ళిపోయిన పుచ్చకాయలో నుంచి బయటకు వచ్చిన గుజ్జు ఎలా ఉంటుందో అలా రక్తం కుదపలతో, నీటితో కలిసి విపరీతమయిన వాసనతో ఒక బకెటు నీళ్ళు బయటకు వచ్చాయి. తలక్రింద ఉన్నదిండు, బెడ్టు తడిసిపోయాయి. ఆ వచ్చిన స్రావము ఒకటే దుర్వాసన, భరింపశక్యం గాకుండా ఉన్నది. నెమ్మదిగా లేచి తడిసిపోయిన దిండు, బెడ్టు తీసి ఎలా పక్కన పడేశానో నాకే తెలియదు. గత 5-6 రోజులుగా తలపోటు, జ్వరంతో ఉన్నానేమో కంటికి నిద్రలేదు. కడుపుకి ఆహారంలేదు. అందువలన నీరసంతోకూడిన మగత, తలనొప్పి కొంచెం తగ్గింది. అందువలన నిద్రపట్టింది. అంతవరకూ మా ఇంట్లో ఉన్నది నేనూ, నా భార్య, అర్చా రూపంలో ఉన్న పరమగురువులు. ఆగస్టు 4వ తేదీ తెల్లవారింది. ఇంట్లో ఏవో కొత్త గొంతుకలు వినిపిస్తున్నాయి. ఎవరువచ్చారు అని నా భార్యని అడిగాను. అప్పుడు మా పెద్దబ్బాయి చి॥ ప్రసాద్, మా మూడవ అబ్బాయి చి॥ వేణుమాధవ్ లు నావద్దకు వచ్చారు. నన్ను నా పరిస్థితిని చూసిన వాళ్ళిద్దరికి నోటమాటరాలేదు. ఎందుకంటే నా ముఖముంతా నల్లకప్పేసుకుపోయింది. ముఖం మీద, తలమీద పెద్ద పెద్ద గడ్డలు వచ్చి తల, ముఖం, ఒక ప్రక్కకి వంకరతిరిగి పోయినదట. మా పిల్లలు ఇద్దరూ పైకి ఏమాత్రం ఆందోళన కనపరచకుండా నిందు గంభీరంగా ఉండిపోయారు. తరువాత ఉదయం 8 గంటలకు శ్రీ బుజ్జిగారు ఫోన్ చేశారు. మా పిల్లలు భార్య మాట్లాడారు. తరువాత ఫోన్ నాకిచ్చారు. ఆ "ఏం స్వామీ ఎలా ఉన్నావు?" అన్నారు. రాత్రి "ఏమందు చెప్పావు స్వామీ" అని అడిగాను "లెడంపాల్-200" అని చెప్పారు. మందు వేసిన తరువాత జరిగినదంతా చెప్పాను. "తలపోటు చాలా వరకు తగ్గింది మరునాడు శ్రీ బుజ్జిగారు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలిసికొని లెడంపాల్ 1ఎం డోస్ వేసుకోమన్నారు. వేసుకున్నా దాదాపు 20 రోజులు హైద్రాబాద్లోనే ఉన్నాను. పూర్తి స్వస్థత వచ్చాక గన్నవరం వచ్చాము. అసలు విషయమేమిటంటే కడదాకా వెళ్ళిన నన్ను ఆపి భగవంతునికి సర్దిచెప్పి నన్ను పునర్జీవితుణ్ణి చేసిన శ్రీ బుజ్జి గార్ని ఆపద్భాంధవుడు అనుకోవాలా, ప్రాణదాత అనుకోవాలా, ప్రాణ రక్షకుడు అనుకోవాలా? అపర ధన్వంతరి అనుకోవాలా?..........✍🏻 *నండూరి శ్రీనివాస రామానుజం*, గన్నవరం 🌷
1340Loading...
06
Media files
1250Loading...
07
Vasishta Maharshi Jayanthi
1470Loading...
08
Media files
1470Loading...
09
*భగవంతుని 'పుణ్యశ్రవణకీర్తను' డంటారు. అంటే పుణ్యాత్ములయిన వాళ్ళ కథలు వినడం, కీర్తించడం ఎక్కడ ఉంటుందో- ఆ చెపుతున్నచోట,వింటున్నచోట ఉంటాడు. చెప్పటం, వినడం అనే రూపంలో ఉంటాడు గాని, ఎక్కడయినా చిత్రపటాల రూపంలో మాత్రమే ఉండడు. భాగవతోత్తములు, మహానుభావుల యొక్క జీవిత సన్నివేశముల కథాశ్రవణం జరుగుతూ ఉంటే అందువలన మనకు వచ్చిన విధంగా మార్పులు వేదాంతం చెప్పుకుంటే రావు. 'పంచీకరణం' చెప్పుకుంటే రావు. పంచభూతాలెట్లా ఉన్నాయ్ శరీరంలో? షట్చక్రాలెలా ఉన్నాయ్ ? ఏ చక్రం ఎక్కడ ఉన్నది ఒంట్లో ? ఏ చక్రానికి ఎన్ని రేకలు ఉన్నాయ్ ? ఏ చక్రంలో ఉన్న అక్షరాలు, 'క' గుణింతం ఎక్కడ? అని చెప్పుకున్నా ఏం లాభం లేదు. వ్యర్థం, వ్యర్థం. ఇవన్నీ చెప్పి భోజనానికి టిక్కెట్టు-డబ్బులు ఇస్తావా అని అడుక్కుంటానికి పనికి వస్తాయి. యూనివర్శిటీలో చదువుకుంటే వచ్చే డిగ్రీ ఉద్యోగం అడుక్కునేందుకు ఎలా అయితే పనికివస్తుందో, ఇదీ అంతే.భాగవతోత్తముల కథలు చెప్పుకోడం,వినడం,అందులో భక్తి స్థితి ,దివ్యపారవశ్యానుభూతి రాకపోయినట్లైతే, ఎం. ఏ. చదువుకున్నా, పి.హెచ్.డి. చదువుకొన్నా, 'ఉద్యోగం దేహీ' అని బొచ్చె పట్టుకొని అడుక్కునేందుకు తప్ప మనకు పనికిరావు. అలాగే భక్తుల కథలు వినడం, కీర్తించడం చేతగానట్లైతే, వేదాంతం, షట్చక్రాలు మున్నగునవి చెప్పటం చేతనయినా అంతే. శాస్త్ర విషయాలు తెలుసుకోడం విద్య కాదు (Information is not education). ఉన్న స్థితి నుంచి, భ క్తియొక్క దివ్యస్థితికి చేరడమే నిజమైన విద్య. (Elevation is education). కథాకథనం వల్ల,కథాశ్రవణం వల్ల వచ్చిన స్థితి విజ్ఞానం కోసమై చదువుకొన్నారాదు, శాస్త్ర విష యాలు చర్చించినా రాదు.ఏ మహానుభావుడేలా ప్రవర్తించాడు అని వాళ్ళ సత్ప్రవర్తనగూర్చి చెప్పుకుంటే తరణోపాయం ఉంది గాని, పరబ్రహ్మమనగా ఎట్టివాడు? అని చర్చిస్తే ఏమీ లాభం లేదు. నీలోనూ, నాలోనూ, అందరిలోనూ ఉన్నాడు గదా!అది చూస్తూనే ఇలా కొందఱు అడుగుతుంటారు. "జీవాత్మకు, పరమాత్మ ఏమవుతాడు?" ఏమైనా లాభం లేదు. జీవాత్మ పరమాత్మ ఒకటేనా? ఒకటే అంటే అద్వైతం; రెండు అంటే ద్వైతం: ఒకటేగాని రెండు అంటే విశిష్టాద్వైతం- ఏం లాభం లేదు. ఈ మూడు ఏమిటిరా అనిపిస్తుంది, మతిపోతుంది.  మహానుభావుల జీవిత సన్నివేశముల కథాకథనం చెప్పుకొని,వాళ్ళలో ఉన్న అంతర్యామిత్వాన్ని ఆనందించి, అనుభవించడం ఎఱుగని వాడికిన్నీ, ఎదుటివాళ్ళకు మనం చేస్తున్న సేవలో పూజ్యభావం ఎఱుగని వాళ్ళకిన్నీ భక్తి యొక్క దివ్యానుభూతి స్థితి, భక్తి సాధన ఇవేమీ రావండోయ్.                   🪶 మాస్టర్ ఇ.కె.*
1900Loading...
10
Media files
1930Loading...
11
🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼 🥀  *భక్తి - సాధన*🥀 🌻 మనకు పుట్టినది భక్తి కనుక అయితే, అది పుట్టిన తర్వాత ఏం జరుగుతుంటే, "నకించిత్ వాంఛతి" ఏం కోరము. వివేకానందుని జీవితంలో విపరీతమైన దారిద్ర్యస్థితి ప్రాప్తించింది.‌ ఇంట్లో అన్నం తినటానికి కూడా లేదు. కాని అద్భుతమైన గురువుగారు దొరికారు. దైవానుగ్రహం కాళీ పరదేవతా ప్రసన్నం దొరికింది. ఇంట్లోవాళ్ళకు తిండి కూడా లేక పస్తులుంటున్నారు. చాలా బాధలతో కటకటలాడుతున్నారు. భరించలేక, చూసి, చూసి, చూసి కొన్నివారాలు చూసి అప్పుడు ఇక వివేకానందుడు ఒక రోజున గురువుగారిని అడిగాడు. "ఇంట్లో ఇట్లా ఉన్నది పరిస్థితి. దారి చూపండి" అని. గురువుగారు నవ్వి, "వెళ్ళి అమ్మను అడుగు" అని ఆదేశించారు. కాళికా అమ్మవారిని అడుగుదామని వెళ్ళాడు వివేకానందుడు. అక్కడకు వెళ్ళి, కూర్చొని, జపం చెయ్యటం మొదలుపెట్టిన తర్వాత, అడగలేదు. తిరిగి వచ్చాడు. "అమ్మను అడిగావా?" అని గురువు గారు ప్రశ్నించారు. అడగలేదు అని వివేకానందుడు సమాధానం చెప్పాడు. మూడు రోజులు వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వచ్చాడు. అడగలేదు అమ్మను. ఏం, ఎందుకు అడగలేదంటే, "అంతగా దారిద్ర్యస్థితి పూర్వ కర్మవశం చేతే వస్తే, చనిపోతాం.అంతేగాని అమ్మను దాన్ని పోగొట్టమని అడగటమేమిటి" అని అన్నాడు వివేకానందుడు. భక్తి పుట్టటమంటే అది. వివేకానందస్వామికి పుట్టింది. అప్పుడు గరువుగారు అయిన శ్రీరామకృష్ణపరమహంస ఇలా అన్నారు అతనితో, "నాయనా! నాకు తెలుసు, అమ్మను నీవు అడగవని". ఎందుకంటే, భక్తి పుట్టటమనే మార్పు వచ్చాక, ఎవరయినా దేవుని అడగడు. నాలుక కోసినా అడగడు. ఇనుము అయస్కాంతమయిన తర్వాత, ఇంక మళ్ళీ ఇనుముగా ఉండదు అది. దాని ఇష్టం కాదిక............✍ *మాస్టర్ ఇ.కె.* 🌻
2150Loading...
12
Shankar Maharaj Punyatithi
2110Loading...
13
Media files
2190Loading...
14
Bagalamukhi Jayanthi
2000Loading...
15
Media files
2050Loading...
16
Media files
1590Loading...
17
*ఏ పనిచేస్తే ఆత్మరతి లభిస్తుందో, మనస్సు ఆత్మయందు లీనమౌతుందో ఆ పని చెయ్యండని శాండిల్య మహర్షి ఉపదేశిస్తున్నాడు. పూజ కావచ్చు, అర్చన కావచ్చు, ఏదైనాసరే కావచ్చు. ఇతరులలోను, నీలోనుగూడ ఉన్న, అంతర్యామి ఏం చేస్తూ ఉంటే,కనపడుతూ, వినపడుతూ ఉంటాడో అదే భక్తి సాధన. ఏ పనిని చేస్తూ ఉంటే మనలోను, ఎదుటివాడులోను ఉన్న అంతర్యామి గుర్తు వస్తాడో ఆ పనిని చెయ్యడం భక్తియోగ సాధన. అది కాకుండా ఏ పనులు జరుగుతూ ఉంటే ఎదుటివాడు, మనము వేఱువేఱుగా గుర్తువస్తామో అవి చేయరాదు. ఉదాహరణకు తనలోను, ఎదుటివాడిలోను, ఇందరిలోను ఒకే పరమాత్మను చూడాలండీ అని ఒకడన్నాడనుకోండి. ఇది విని ఇంకొకడెవడన్నా, "నీవు చెప్పింది ఏడిసినట్లుంది" అని ఖండించాడనుకోండి. వెంటనే ఈ మొదటివానికి తన మాటలు ఖండించిన వాడు వేరే గుర్తువస్తాడు, తాను వేరే గుర్తువస్తాడు. ఎవడన్నా అలా అన్నప్పుడు అతడు వేరే,మనం వేరే గుర్తువచ్చే పనిలేకుండా ఉండే సాధన చేస్తూ ఉండండి అని శాండిల్యులవారి బోధ. మనం ఏదైనా చెప్పినప్పుడు "ఎంత బాగా చెప్పారండి" అని మనలను పొగడినవారిలో పరమాత్మ కనిపించవచ్చును గాని, పాపం పొరపాటున 'నీవు చెప్పినది ఏడిసినట్లుంది' అన్న వాడిలో  వేంకటేశ్వరరావో, సుబ్బారావో కనిపిస్తాడుకాని, పరమాత్మ ఎందుకు కనిపిస్తాడు ? వెంటనే ముందుగా ఆ అన్నవాడే కన్పిస్తాడు గాని పరమాత్మ కనిపించడు. అలాగే మనకిష్టంలేనివాడు, మనకు ఇష్టంలేని పనులు చేసినవాడు కనపడతారు. అలాగే ఒకే ఇంట్లో ఒకరికొకరు బంధువులైనవాళ్ళు నివసిస్తుంటారు. అత్తకు కోడలు, కోడలుకు అత్త, భార్యకు భర్త, భర్తకు భార్య కనపడుతుంటారు. అత్త కోడలును "ఈ ఇంట్లో నీ మొహం చూస్తే సకల పాపాలు వస్తాయి" అంటూ ఉంటుంది. ఒక భర్త తన భార్యతో ముప్ఫై ఏళ్ళు కాపురం చేసికూడ, ముప్ఫైఏళ్ళు పీటమీద కూర్చుండి, ఇక తగలెయ్ అనేవాడు. అంటే వడ్డించమని అర్థం.ఆవిడ తగలేసేది. ఇతడు భోజనం చేసి వెళ్ళిపోయేవాడు. ముప్పై ఏళ్ళు వాళ్ళ కాపురం అలాగే గడిచింది. వాళ్ళకి అలాగే పిల్లలుకూడా పుట్టారు. శాండిల్యుడు మరీ గడుసువాడు. ఏపని చేసినా, మనలోను, ఎదుటివారులోను అంతర్యామిని చూడటం జరుగుతున్నదా, లేదా అనే సంగతి జాగ్రత్తగా చూసుకోండి అని ఈయన హెచ్చరిస్తున్నారు. కొందరికి పెళ్ళి చేసుకోబోయేముందు భార్యలో దేవుడు కనపడతాడు. పెళ్ళి అయిన తరువాత కొన్నాళ్ళకు ఒకరినొకరు చూసే వైఖరి మారుతుంది. ముసలివాళ్ళు అయినప్పుడు-భర్త కోతివలె, భార్య కొండముచ్చువలె అయినప్పుడు గూడ ఇద్దరిలో ఒకరికొకరు అంతర్యామి కనపడాలి. ఇద్దరిలో నున్న ఒకడే కనిపిస్తూ ఉండటానికి విరోధంలేకుండా ప్రవర్తించాలి. "ఏ పనైనా చెయ్యండి నాయనా, నేను వద్దనను. ఏది చేస్తే తనలోను, ఎదుటివాడిలోను ఉన్న ఆత్మ అనే వెలుగు స్థాపించబడుతూ ఉంటుందో,మళ్ళీ మళ్ళీ గూడ అదే చెయ్యండి"అని శాండిల్య మహర్షి ఉద్బోధిస్తున్నాడు.                      🪶 మాస్టర్ ఇ.కె.*
1891Loading...
18
నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా విష్ణుపాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ | భాగీరథి భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ ద్వాదశైతాని నామాని యత్రయత్ర జలాశయే | స్నానకాల పఠేన్నిత్యం మహాపాతక నాశనం ||
2452Loading...
19
Media files
1920Loading...
20
Media files
2130Loading...
21
🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼 🥀  *భక్తి - సాధన*🥀 🌻 భక్తి‌గలవాడు "నద్వేష్టి". ద్వేషించడం అంటూ లేదు. ప్రహ్లాదుడు తండ్రిని ద్వేషించెనా? లేదు. తండ్రిని నరసింహస్వామి చీరేసాట్ట. అబ్బ! స్వామిరాక ఆలస్యమయిందనుకున్నాడా ప్రహ్లాదుడు! లేదు. స్వామి హిరణ్యకశిపుని చీల్చి చంపి, ఆ వేషంతోనే అలాగే నించుని, ఆ కోపం తగ్గి, అందరితోనూ గాండ్రుమని అరుస్తూ, ప్రహ్లాదుని వైపు తిరిగి, చిరునవ్వు నవ్వి, "నాయానా! నీకేం వరం కావాలి?" అని మృదువుగా అడిగాడు. ఆ! విష్ణుమూర్తి ఒట్టి పరమలౌక్యుడని చెప్పాను కదా! ఏదీ! ఆ సింహం తల పీకేయకుండానే, ఆ సింహం తలకాయ తీసివేయకుండానే, అవతల మిగతావాళ్ళతోనేమో గాండ్రుమని అరుస్తున్నాడు, ప్రహ్లాదుడితోనేమో, "నీకేం కావాలి నాయనా" అని అడుగుతున్నాడు, హిరణ్యకశిపుణ్ణి చంపాక. ప్రహ్లాదుడు "ఓ స్వామీ నా తండ్రిని చీల్చు" అని అడిగాడా! లేదా "నా తండ్రికి కూడా నీ యందు పూర్తిగా ఉన్నట్టి భక్తిని దయచేయుము" అని అడిగాడా! లేదు. ఏదీ లేదు. ప్రహ్లాదుడు చేసే ప్రార్థన ఏమిటి? "నీ సంకల్పమే నెరవేర్చబడును" అని. ఎవరెట్లా ఉండాలో నిర్ణయించేది దేవుడు గాని, మనం కాదనే సంగతి ప్రహ్లాదుడు లాంటి వాళ్ళకు ఎప్పుడూ తెలుసు. భక్తి గల వాడు ద్వేషించడు. ద్వేషించడం తన  దృక్పథమయినవాడికి భక్తి నిలిచే స్థితికాదు. ఫలానావాడు మన కంటే ఎక్కువ భక్తుడట అంటే, అతణ్ణి ద్వేషించడం జరిగిందంటే, ఇక మన యందు భక్తి లేనట్లే. కొంతమందికి ఫలానావాడు పరమభక్తుడట అని తెలిస్తే, "ఏడిశాడులే" అనిపిస్తుంది. అతడు పరమభక్తుడయితే, మనకెందుకు బాధ? మనం కూడా పరమభక్తులం అవ్వవచ్చు గదా!...........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻
2351Loading...
22
నృసింహ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం श्रीनृसिंह नवरात्रारंभ
2190Loading...
23
Media files
2200Loading...
24
Media files
2300Loading...
25
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 *శ్రీ శంకరాచార్య స్తవః* *1) శ్రీ శంకరాచార్య వర్యం సర్వలోకైక వంద్యం భజే దేశికేంద్రమ్ |* *ధర్మప్రచారేఽతిదక్షం యోగిగోవిందపాదాప్తసన్యాసదీక్షమ్ |* *దుర్వాదిగర్వాపనోదం పద్మపాదాది శిష్యాలిసంసేవ్యపాదమ్ ||* *2)శంకాద్రిదంభోలి లీలం కింకరాశేష శిష్యాలి సంత్రాణశీలమ్ |* *బాలార్కనీకాశ చేలం బోధితాశేష వేదాంత గూఢార్థజాలమ్ ||* *రుద్రాక్షమాలా విభూషం చంద్రమౌలీశ్వరారాధనావాప్తతోషమ్ |* *విద్రావితాశేషదోషం భద్రపూగప్రదం భక్తలోకస్య నిత్యమ్ ||* *4) పాపాట వీచిత్రభానుం జ్ఞానదీపేన హార్దం తమో వారయంతమ్ |* *ద్వైపాయన ప్రీతిభాజం సర్వతా పాపహామోఘబోధప్రదం తమ్ ||* *5) రాజాధిరాజాభి పూజ్యం రమ్య శృంగాద్రివాసైక లోలం యతీడ్యమ్ |* *రాకేందు సంకాశవక్త్రం రత్నగర్భేభవక్త్రాంఘ్రిపూజానురక్తమ్ ||* *6)శ్రీభారతీతీర్థ గీతం శంకరార్యస్తవం యః పఠేద్భక్తియుక్తః |* *సోఽవాప్నుయాత్సర్వమిష్టం శంకరాచార్యవర్యప్రసాదేన తూర్ణమ్ ||* *ఇతి శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి కృత శ్రీ శంకరాచార్య స్తవః ||* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
2123Loading...
26
Media files
2290Loading...
27
Media files
10Loading...
28
Media files
2551Loading...
29
శంకర జయంతి शंकराचार्य जयंती రామానుజాచార్య జయంతి रामानुजाचार्य जयंती
2411Loading...
30
Media files
2431Loading...
31
Media files
2301Loading...
32
🌼 *మాస్టర్ ఇ.కె. గారి సందేశము*🌼 🥀  *సిద్ధుడు-సాధన*🥀 🌻 సిద్ధుడన్న మాటకు జీవితం ఇంకొకదాని కోసం అంకితం అయినవాడు అని అర్థం. ఇట్టివానికి, ఇంట్లో ఉన్న నలుగురూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవించడం అనేది అప్రయత్నంగా సిద్ధిస్తుంది. అది లేకుండా ఉన్నవారికి ఎంత "విద్య" ఉన్నాసరే, అది 'అక్షరాస్యత' క్రిందికి వస్తుంది కాని, విద్య కాదు. ఒకళ్ళను గురించి, ఇంకొకళ్ళు మాట్లాడుకోవడం, ఆలోచిస్తుంటం తప్ప ఇంకేం మిగలదు. చూశారా! ఎంత విద్యావంతుడైనా సరే, ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళను గురించి ఇద్దరు మాట్లాడుకుంటం అనే వ్యాధి నశించదో, యోగాభ్యాసముగాని, యోగసాధన గాని, పరబ్రహ్మను గూర్చిన సాధన గాని వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మీకేదన్నా చెప్పదలిస్తే, మీతోనే చెప్పడం, మిగతా వాళ్ళతో చెప్పకుండా ఉండటం చేతకావాలి. నాతో ఏదన్నా మీరు చెప్పదలుచుకొన్నప్పుడు, నాతో చెప్పడం, ఇంకెవళ్ళతోనో చెప్పకుండా ఉండటం శ్రేయస్కరం. మిగతావాళ్ళు వినకుండా తాను ఎవరితో చెప్పదలుచుకున్నాడో అతని గూర్చే అతనితో చెప్పగలగడం, చేతనవాలి. అలాకాకుండా అసలు వానితో ఎత్తకుండా, మర్యాదగా ఉండి, రోడ్డుమీద నించొని, "ఏమిటండీ అతను ఇట్లా చేస్తాడు అతని ప్రవర్తన బాగోలేదు" అని అంటుంటారు. ఈ జన్మకు అలాంటివి మాట్లాడేవాళ్ళు గాని, అవి విన కుతూహలపడిన వాళ్ళుగాని, అవి విన్నవాళ్ళు గాని సాధనకు పనికిరారు అన్నమాట. అవి చెపుతున్నప్పుడు, అవి చెప్పవద్దు అని చెప్పాలి.........✍ *మాస్టర్ ఇ.కె.* 🌻
2450Loading...
33
Media files
2680Loading...
34
श्री काशी विश्वनाथो विजयतेतराम् 🙏
2422Loading...
35
*జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :* *ప్ర : కాళీ, చండీ, చాముండా - వంటి ఉగ్రదేవతలను ఉపాసించవచ్చా ?* *చండీసప్తశతి పారాయణ, చండీహోమం వంటివి ఉగ్రదేవతోపాసన అని కొందరి మాట. ఎంతవరకు సమంజసం ?* *జ :* చండీ, కాళీ - ఉగ్రదేవతలు.... అనడం సరికాదు. ప్రతి దేవతోపాసనలోనూ ఉగ్రమూర్తులుంటారు. విష్ణూపాసనలో ఉగ్రనరసింహం, శివోపాసనలో వీరభద్ర - భైరవమూర్తులు వలెనే శక్తి ఆరాధనలో కాళీ, దుర్గా వంటి రూపాలు. అసలు విశ్వవ్యాపక ఈశ్వరశక్తిలోనే ఉగ్ర, సౌమ్య - అనే రెండు భావాలూ ఉంటాయి. వీటినే వైదికభాషలో ఘోర, అఘోర - అని అంటారు. ఈ రెండూ ప్రకృతిలోనే గోచరిస్తాయి. ప్రాణాన్నిచ్చే జలమే ఉప్పొంగే ఉప్పెన అవుతోంది. జీవనదాత సూర్యుడే ప్రచండంగా గ్రీష్మంలో ప్రకాశిస్తాడు. ఈ రెండు విధాల వ్యక్తీకరణలు లోకక్షేమానికే. *అనంత కాలశక్తి కాళి. అధర్మాన్ని, దుష్టత్వాన్ని శిక్షించి, లోకరక్షణ చేసే పరమేశ్వర శక్తి చండి.రక్షణ స్వరూపిణి కనుకనే 'దుర్గ' అన్నారు.* ఇక 'చండీసప్తశతి' గ్రంథం అసలు పేరు 'దేవీమహాత్మ్యం'. ఇది 'మార్కండేయ పురాణం'లోనిది. ఈ స్వరూపాలను 'ఉగ్ర' అనడానికి లేదు. ఈ గ్రంథంలో చెప్పబడిన 'దేవి' - వేదాలలో లక్ష్మి, సరస్వతి, గౌరి,కాళీ, శ్రద్ధా, మేధా, గాయత్రి, స్వాహా, స్వధా - మొదలైన రూపాలలో ఉన్న పరాశక్తి జగన్మాత. లోకరక్షణ కోసం దుష్టులను సంహరించి, ధర్మరక్షణార్థం - పలుమార్లు ఆవిర్భవించిన శక్తి. అసుర సంహారానికి కోపశక్తిగా 'చండి', లోకరక్షణకు మంగళస్వరూపిణి - ఈ రెండూ కారుణ్యరూపాలే. *సౌమ్యాని యాని రూపాణి* *త్రైలోక్యే విచరంతి తే l* *యాని చాత్యంత ఘోరాణి* *తైరక్షాస్మాం స్తథా భువమ్ ॥* - అనే శ్లోకం దేవీమహాత్మ్యం లోనిదే. 'అమ్మా ! ముల్లోకాలలో చరించే నీ సౌమ్యరూపాలు, ఘోరరూపాలు మమ్ములను, ప్రపంచాన్ని రక్షించుగాక! " అని చక్కని భావమిది. *'సౌమ్యా సౌమ్యతరాఽశేష* *సౌమ్యౌభ్యస్త్వతిసుందరీ'* అనే వాక్యం కూడా ఈ గ్రంథంలోనిదే. సమగ్రంగా దేవీతత్త్వం ఉన్న గ్రంథమిది. *చండీ, చాముండా*- అనే మాటలకు తత్త్వపరంగా *'బ్రహ్మ విద్యాస్వరూపిణి'* అనే అర్థం. రక్షణనిచ్చే జగన్మాతను ఆరాధించడం వల్ల - మనలోని దష్టప్రవృత్తులు తొలగి సత్ప్రవర్తనలనే దైవీశక్తులు రక్షింపబడతాయి. సకామంగా పారాయణ, హోమం చేస్తే అభీష్టసిద్ధి లభిస్తుంది (అయితే ఆ కోరిక ధర్మబద్ధమైనది కావాలి). క్రమంగా జ్ఞానం, కైవల్యం లభిస్తాయి. నిష్కామంగా ఆచరిస్తే మోక్షానికి కావాల్సిన జ్ఞానాన్నీ ప్రసాదిస్తుంది. ఆశించకుండానే ఐహిక జీవితంలోనూ అవసరమైన రక్షణ, సంపదలను అనుగ్రహిస్తుంది. *మేధాసి దేవి విధితాఽఖిల శాస్త్రసారా* *దుర్గాసి దుర్గ భవసాగరనౌరసంగా ।* *శ్రీః కైటభారి హృదయైక కృతాధివాసా* *గౌరీ ! త్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠా ॥* - అని దేవీమహాత్మ్యం లోని శ్లోకం. " సకల శాస్త్రసారమైన మేధస్సు నీవే. దాటలేని సంసారసముద్రాన్ని నావ వలె దాటించే దుర్గవు నీవు. శ్రీమహావిష్ణువు హృదయాన అధివసించు లక్ష్మీవి నీవు. చంద్రశేఖరుడైన శివునియందున్న గౌరివి నీవు" అని భావం. ఏ విధంగా చూసినా - అనంతశక్తి, అపార కరుణ కలిగిన జగన్మాత ఆరాధనలే చండీ , కాళీ వంటి పూజలు. దేవీమహాత్మ్యం - పారాయణ, హోమాలు ఆ తల్లి దయను ప్రసాదించే సాధనలు. *('ఋషిపీఠం' సంచిక నుండి సేకరణ)*
2452Loading...
36
Media files
2530Loading...
Vasavi Kanyaka Parameshvari Jayanthi
Показати все...
Фото недоступнеДивитись в Telegram