cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

꧁🌺 తెలుగు జాబిలీ 🌺꧂

APPSC, TSPSC , పుస్తకాలు,నవలలు,కథలు,పాటలు, మ్యాగజైన్స్,వార్తా పత్రికలు,విద్యా,ఉద్యోగం,ఆరోగ్యం,ఆయుర్వేదం, ఆంగ్ల అనువాదములు & ప్రేరణాత్మకమైన అప్డేట్స్ ను తెలుగు ప్రజలకు చేర్చడమే ఉద్దేశ్యము https://t.me/TELUGUJABILI

Больше
Рекламные посты
2 290
Подписчики
+524 часа
+447 дней
+29030 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Показать все...
సౌందర్యలహరి 1-10

భావ వివరణ ఈశ్వరి గారు #ఆది శంకరాచార్య విరచిత #సౌందర్య లహరి #1. ప్రతి రంగంలో గెలుపు #2. ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించడం #3. సమస్త జ్ఞానాన్ని పొందడం #4 అన్ని భయాలను తొలగించడం, వ్యాధుల నివారణ #5. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ #6. సంతానంగా పుత్రులను పొందడం #7. అమ్మవారిని ప్రత్యక్షంగా చూడడం, శత్రువులపై విజయం సాధించడం #8. జనన మరణాలను నివారించడం #9. యాత్రకు వెళ్లిన వ్యక్తులు తిరిగి రావడానికి, ఎనిమిది రకాల సంపదలను పొందేందుకు #10. దృఢమైన శరీరం, పురుషత్వము పొందడం

I am sharing 'సంసిద్దత కృత్యాలు' with you
Показать все...
సంసిద్దత కృత్యాలు.pdf3.13 KB
01:17
Видео недоступноПоказать в Telegram
🙏🏻శుభ శనివారం శుభోదయం🙏🏻
Показать все...
53.69 MB
👍 1
🕉️ పంచాంగము 🌓 15.06.2024 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: శుక్ల - శుద్ధ తిథి: నవమి రా.01:13 వరకు తదుపరి దశమి వారం: శనివారం - మందవాసరే నక్షత్రం: ఉత్తరఫల్గుణి ఉ‌.07:55 వరకు తదుపరి హస్త యోగం: వ్యతీపాత రా.08:08 వరకు తదుపరి వరియాన కరణం: బాలవ ప‌.12:11 వరకు తదుపరి కౌలువ రా.01:13 వరకు తదుపరి తైతుల వర్జ్యం: సా.05:13 - 06:59 వరకు దుర్ముహూర్తం: 05:41 - 07:21 రాహు కాలం: ఉ‌.08:59 - 10:38 గుళిక కాలం: ఉ‌.05:41 - 07:20 యమ గండం: ప‌.01:55 - 03:34 అభిజిత్: 11:50 - 12:42 సూర్యోదయం: 05:41 సూర్యాస్తమయం: 06:51 చంద్రోదయం: ప‌.01:08 చంద్రాస్తమయం: రా.12:46 సూర్య సంచార రాశి: మిథునం చంద్ర సంచార రాశి: కన్య దిశ శూల: తూర్పు నక్షత్ర శూల: ఉత్తరం 🔱 మహేశనవమి‌ 🔱 💦 వ్యతీపాత‌ శ్రాద్ధము 💦 🌦️ మిథున సంక్రమణం 🌦️ 🪄 షడశీతి‌ పుణ్యకాలము‌ 🪄 🚩 శ్రీ విద్యాశాంతతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩 💫 ఉత్పాత - దగ్ధ యోగము 💫 🚩 కంచి జగద్గురు శ్రీ పూర్ణానంద సదాశివేన్ద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩 🇮🇳 శ్రీ మహాదేవ గోవింద రనడే పుణ్యతిథి 🇮🇳 🏳️ శ్రీ వాదీంద్రతీర్థ‌ పుణ్యతిథి‌ 🏳️ 🚩 కంచి జగద్గురు శ్రీ సదాశివేన్ద్ర సరస్వతి స్వామి పుణ్యతిథి‌ 🚩 🎊 కోట‌ గిరిదార్జీ‌ - ద్వారకాదీశ్ ఉత్సవం 🎊 🔯
Показать все...
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 548 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 548 - 1 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁* *🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।* *సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀* *🌻 548. 'విమర్శరూపిణీ’ - 1 🌻* *విమర్శరూపిణి శ్రీమాత అని అర్థము. విమర్శ ప్రధాన లక్షణము వికాసము కలిగించుట. శ్రీమాత అగ్రాహ్యమైన తత్త్వమును ప్రకాశింప జేయును గనుక ఆమెను విమర్శ రూపిణి అందురు. విమర్శ అనగా దూషణ భూషణములుగావు. విప్పి జెప్పునది విమర్శ. వికాసము కలిగించునది విమర్శ. గుహ్యమగు విషయమును ప్రకటింపజేయునది విమర్శ. పరతత్వము లేక బ్రహ్మము పెరుగుటకు సాధ్యపడనిది. అట్టి తత్త్వమునకు ప్రతినిధియై, ప్రధానమై శ్రీమాత ప్రకాశించును. ఆమె ప్రకాశమే మనయందు ఎరుకవలె పనిచేయును. ఎరుక వలననే యెరుగుట కలుగుచున్నది. ఇట్లు ఎరుకకు మూలమై శ్రీమాత ప్రకాశించును గనుక ఆమెను ఎరుగుట పరోక్షముగ తత్వము నెరుగుటయే.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 548 - 1 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️ Prasad Bharadwaj* *🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh* *sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻* *🌻 548. 'Vimarsharupini' - 1 🌻* *It means Srimata is Vimarsarupini. The main characteristic of reflection is to develop. Srimata is seen as a form of reflection because she brings to light incomprehensible philosophy. Reflection does not mean insulting. Reflection is unraveling and explaining. Reflection builds knowledge. Reflection is what reveals the hidden. Paratatva or Brahman cannot grow. Shrimata shines as the representative and chief of that philosophy. Her radiance works like awareness in us. It is because of awareness that knowing comes. As the mother shines as the source of awareness, knowing her is indirectly knowing the philosophy.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹
Показать все...
*🌹 సిద్దేశ్వరయానం - 80 🌹* *💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐* *🏵 బృందావన భక్తుడు 🏵* *ఆరువందల సంవత్సరాల క్రింద శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు బృందావనధామం వచ్చి రాధాకృష్ణులు తమ లీలలను ఎక్కడ ప్రదర్శించారో ఆ ప్రదేశాల సన్నింటిని గుర్తించి భక్తులకు తెలియజేశారు. అంతకుముందు కొన్ని స్థలాలు మాత్రమే ప్రజలకు తెలుసు. చైతన్యస్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడు అన్నీ తెలుసుకొనే అవకాశం ప్రజలకు లభించింది. ఆయన తన భక్తులైన గోస్వాములను బృందావనధామంలో నివసించి రాధాకృష్ణులను సేవించవలసినదిగాను వారికి సంబంధించిన సాహిత్యాన్ని సృష్టించ వలసినదిగాను ఆదేశించారు. తత్ఫలితంగా రూపగోస్వామి సనాతనగోస్వామి మొదలైన మహనీయులు బృందావన నివాసులైనారు.* *శ్లో॥ ఆరాధ్యోభగవాన్ ప్రజేశతనయః తద్దామ బృందావనం రమ్యాకాచిదుపాసనా ప్రజవధూవర్గేణయాకల్పితా శ్రీమద్భాగవతం ప్రమాణ మమలం ప్రేమా పుమర్ధోమహాన్ శ్రీ చైతన్యమహాప్రభో ర్మతమిదం తత్రాదరోనః పరః* *ఈ అనంత సృష్టిలో పరమారాధ్యుడు నంద నందనుడైన గోవిందుడొక్కడే. ఆయన నివాసము బృందావనము. గోపికలు మధురభక్తితో చేసిన సాధనయే అన్నింటికంటే శ్రేష్ఠమైన ఉపాసనామార్గము. దీనిని తెలిపే శ్రీమద్ భాగవతమే పరమ ప్రామాణిక గ్రంథము. పురుషార్ధములు సామాన్యంగా నాలుగు చెప్పబడినవి. ధర్మార్థకామమోక్షములు. అయిదవది ప్రేమ. ఇదియే ఉత్తమమైనది గొప్పది. ఇదియే చైతన్యమహాప్రభువు యొక్క మతము. దీనియందే మాకు ఆదరము. దీనిని మించినది లేదు.* *ఈ భావనతో, భజనలతో, తపస్సుతో బృందావన ధామం పులకించుపోతూ ఉంటుంది. గోస్వాములలో రూప గోస్వామి, న నాతనగోస్వామి ప్రముఖులు. పూర్వాశ్రమంలో వారు సోదరులు. సనాతనగోస్వామి ఆశ్రమం దగ్గర ఒక గృహస్థ భక్తుడు నివసిస్తూ ఆశ్రమంలో తన శక్తి కొద్ది ఆర్థికంగా, హార్ధికంగా సేవచేసేవాడు. యమునా తీరంలోని యోగులను భక్తిప్రపత్తులతో పూజిస్తూ ఉండేవాడు. ఒకరో జతడు రూపగోస్వామి ఆశ్రమంలో ఉండగా అక్కడకు ఒక హిమాలయయోగి వచ్చాడు. ఆ యోగి మంత్రసిద్ధుడని గంగాతీరంలో ఆయన చేసిన కాళీసాధన వల్ల జగన్మాత కాళీదేవి సాక్షాత్కరించి దీర్ఘాయువును, దివ్యశక్తులను ప్రసాదించిందని, రూపగోస్వామికి ఆయనకు జన్మాంతర సంబంధమేదో ఉండటం వల్ల ఇక్కడకు అప్పుడప్పుడు వస్తుంటారని విన్నాడు.* *కాళీదేవి విగ్రహమొకటి ఆయన దగ్గర ఉన్నది. అది ప్రాణవంతమైన మూర్తియని, పెరుగుతూ ఉంటుందని విని ఆశ్చర్యపడినాడు. అదీగాక ఇప్పటికే ఆయన వయస్సు దాదాపు మూడు వందల సంవత్సరాలని తెలిసినప్పుడు దిగ్భ్రాంతి కలిగింది. తానుకూడా అలా కావచ్చునా? కాగలడా? రూపగోస్వామి దయవల్ల ఆ సిద్ధునితో పరిచయం బకలిగింది. అది సన్నిహితమైన అనుబంధానికి దారితీసింది. ఒక వైపు సనాతనగోస్వామి వాత్సల్యము, రాధాకృష్ణుల పై భక్తి మరొకవైపు సిద్ధశక్తులను సాధించాలనే తీవ్రమైన కోరిక. ఈ స్థితిలో ఉంటూనే కాళీసిద్దుని ఆశ్రయించాడు.* *( సశేషం )* 🌹🌹🌹🌹🌹
Показать все...
*🌹 కామ్యఫలం - జ్ఞానఫలం / Fruit of Lust - Fruit of Wisdom 🌹* *ప్రసాద్‌ భరధ్వాజ* *కర్మల వల్ల లభించేది కామ్యఫలం. జ్ఞానం వల్ల లభించేది జ్ఞానఫలం. అయితే, కామ్యఫలం త్వరగా లభిస్తుంది, కానీ జ్ఞానఫలం అంత త్వరగా లభించదు. అందుకే, జ్ఞానఫలం కోసం వేచిచూసే ఓర్పు లేక, ఎక్కువ మంది త్వరగా లభించే కామ్యఫలాలకోసం పరుగులు పెడుతుంటారు.* *సంసార కూపం నుంచి బయట పడేందుకు “జ్ఞానమే” ఏకైక మార్గం. “కామ్యకర్మలు - కర్మఫలాలు” అనేవి గానుగెద్దు లాగా, ఏతంబావిలాగా రాకడ -పోకడలు గలిగి, విసుగూ - విరామం లేకుండా పుట్టుకకు - మరణానికీ కారణమౌతూ, సంసారచక్రం నుంచి బయట పడనీయవు.* 🌹🌹🌹🌹🌹 *🌹 Fruit of Lust - Fruit of Wisdom 🌹* *Prasad Bhardwaj* *Fruit of desire is the result of Actions. Fruit of Wisdom is obtained by Knowledge. However, the fruit of Actions is quick, but the fruit of Wisdom is not so quick. That is why, without the patience to wait for the fruits of knowledge, most people run for the fruits of actions motivated by desires that are available quickly.* *Knowledge is the only way to get out of the ocean of bondage. 'Actions and their consequences' are like Bull driven Oil Pit; with constant coming and going, becoming and unbecoming, non-stop, causing perpetual birth and death cycles, and thus don't allow to get out of the cycle of bondage.* 🌹🌹🌹🌹🌹
Показать все...