cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Arugu

అవీ😀...ఇవీ😂🤣...అన్నీ😉😋🤩...

نمایش بیشتر
پست‌های تبلیغاتی
395
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-17 روز
+130 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

sticker.webp0.04 KB
Photo unavailableShow in Telegram
వాటికి ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి: కేంద్రం
نمایش همه...
sticker.webp0.04 KB
మద్రాస్ లో చదువుకోవడం వల్ల....వంట బట్టిన తమిళం....ఉభయభాషా ప్రవీణుడ్ని చేసి....తమిళం లో కూడా ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించగలిగాను....తమిళుడే....ఇతను అనిపించేలా! నాకొచ్చిన అవార్డులు కూడా తమిళంలోనే ఎక్కువ! బళ్ళారి రాఘవ గారి నటన....వేమూరి గగ్గయ్య గారి నటన నచ్చేది నా చిన్నప్పుడు. ఈ రంగారావ్ స్టార్ కావడానికి వెనుక ఎంత మథన, కృషి ఉన్నాయో....అందరికీ ఎలా తెలుస్తుంది!? స్టార్ అయ్యాక...ఎన్నెన్నో పాత్రలు వచ్చాయి. వచ్చినవన్నీ రంగారావు ఒప్పుకోలేదు. ఒప్పుకుని...తప్పుకున్నవీ ఉన్నాయి! *రంగారావుని భరించలేం* అన్నవాళ్ళు...ఆ పాత్రకు రంగారావే తగినవాడని అనిపించినా, వేరే నటుల్ని పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి! ట్రబుల్ సం ఆర్టిస్ట్ అన్న ముద్ర కూడా పడింది! మూడ్ బాగుండాలి అంతే. మూడ్ బాగుండక పోతే...చిన్నపిల్లాడు స్కూల్ ఎగ్గొట్టినట్టు....షూటింగ్ ఎగ్గొట్టేవాడ్ని!ఒక్కోసారి షూటింగ్ మధ్యలో మూడ్ బాలేక పోతే....విగ్గు...మీసం...విసిరేసి....వెళ్ళిపోయేవాడ్ని కూడా! ఏం చేసినా...నా నటనతో కొట్టుకొచ్చేశాను. కళ్ళతోనే నటించడం...కంఠంలోని మాడ్యులేషన్స్....చూసుకోవడం....అంతే! నటన...అతి సహజమే నాకు! ఎందుకు త్రాగుతున్నానంటే....ఎన్నో కారణాలు...ఏవో అందరికీ ఉన్నట్లే...ఏవో సాకులు....భార్య లీలావతి తో విబేధాలు...కోపాలు, తాపాలు...కుటుంబమన్నాక...ఎన్నో ఉంటాయిగా. ముగ్గురు పిల్లలతో మురిపాలూ ఉంటాయి. పండగ పబ్బాలతో బాటు....ఫ్రెండ్స్ తో పార్టీలు ఉంటాయి.....మనస్సులో ఎక్కడో వెలితీ ఉంటుంది! నా మధుసేవ కూడా చిత్రంగా ఉండేది! పడితే విరామం లేకుండా...ఒకటే పట్టు. ఆగిపోతే అంతే! మళ్ళీ ఎప్పుడో! ఆ *పట్టు*లో ఉన్నప్పుడే కాల్షీట్లు గల్లంతయ్యేవి. నన్న భరించడం కష్టం....అన్నది అలాంటప్పుడే వస్తుంది. అయినా సెట్టు మీద కొచ్చాక....నన్ననే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఓపులి లా...సింహం లా ....కనిపించేవాడ్నేమో...మరి! అయినా నా శరీరం ఉక్కు....నాకేం కాదు*.... *బాపు అందరి ఆర్టిస్టులతో బాటు...నా కేరికేచర్ వేస్తే...రమణ ...కేప్షన్ వ్రాశాడు. నాకే నవ్వొచ్చింది.* *క్లిష్టపాత్రల్లో...చతురంగారావు, దుష్ట పాత్రల్లో...క్రూరంగా రావు, హడలగొట్టే...భయంకరంగారావు, హాయిగొలిపే...టింగురంగారావు, అలరించే....విలాసంగారావు, రొమాన్సు లో(చేయిస్తే)..పూలరంగారావు, మనిషి...మధు మధురంగారావు, మాటల్లో...మహ చమత్కారంగారావు, కథ నిర్బలమైతే...హావభావాలు పాత్రపరంగారావు, కళ్ళక్కట్టినట్టు కనపడేది...ఉత్తి యశ్వీరంగారావు, ఆయన శైలీ ఠీవీ....అన్యులకు సులభంగారావు, ఒకొక్కసారి డైలాగుల్లో మాత్రం...యమ కంగారంగారావు!* ******* *ఇలా సాగుతూనే నిర్మాతగా కూడా మారి 4 మూవీస్ తీశాను. నాదీ ఆడజన్మే, సుఖదు:ఖాలు, చదరంగం & బాంధవ్యాలు. ఆ చివరి రెండు మూవీస్ నేనే డైరెక్ట్ చేశాను. రెండూ నంది అవార్డుల్ని కూడా సంపాదించాయి.... ఇక ఇంతకంటే కావలసిందేముంది!*....... ******* విశ్వనట చక్రవర్తి గా బిరుదు పొందిన కీ.శే. సామర్ల వెంకట రంగారావు (ఎస్.వి.రంగారావు)......మళ్ళీ మరో రంగారావు లాంటి నటుడు ఇక పుట్టడు! ఒకవేళ అంతకు మించిన నటుడు ఎవరు పుట్టినా...ఎంతటి వాడు పుట్టినా...రంగారావు....రంగారావే! ఆయన స్థానం ఆయనదే! ప్రపంచం గుర్తించిన తెలుగు నటుల్లో రంగారావు ఒకరు. 1963 లో జకార్తా లో నర్తనశాల లోని కీచక పాత్రతో... ఆఫ్రో- ఏషియన్...బెస్ట్ యాక్టర్ అవార్డ్ కైవశం చేసుకుని....విదేశీయుల మన్నన లను పొందినా... 4- రాష్ట్రపతి అవార్డులు కూడా....తమిళ మూవీలే అందించాయి! 2- నందులు- చదరంగం(1967)& బాందవ్యాలు(1968).. విశ్వనట చక్రవర్తి....నటసార్వభౌమ....నటశేఖర....నట సింహ.....ఇలా ఎన్నో బిరుదులున్నా..... ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులేమీ రాలేదు అనితరసాధ్యమైన నటనాగ్రేసరుడికి! ఆయన పేరుతో ఓ స్టాంప్ రిలీజ్ చేసింది. అంతే. *గుండెపోటు....56 ఏళ్ళకే....తన జీవన నాటకానికి....తెర దించేస్తుందని...రంగారావు గారు అసలు ఊహించిఉండరు.* *వారసులు..నటులయ్యారా....అంటే....ఎస్.వి.ఆర్. మనవడు...అంజలీదేవి మనవరాలితో ఓ మూవీ అనుకున్నారప్పట్లో. ఎందుకనో మరి అది ఆగిపోయింది!* *జీవించింది 56 ఏళ్ళే అయినా(3-7- 1918 ------18-7-1974) నటించింది అన్నిభాషల్లో కలిపి.... 260 చిత్రాలే అయినా....ప్రజల గుండెల్లో....నటుడిగా సుస్థిర స్థానం కీ.శే. సామర్ల వెంకట రంగారావు గారిది.* *ఈ సంవత్సరం జూలై 3వ తేదీ... నూటొక్క వసంతాలు నిండాయి. *కీ.శే. ఎస్.వి.రంగారావు గారికి....స్మృత్యంజలి ఘనంగా సమర్పిస్తూ...వారి నటనా వైభవాన్ని కాస్త రుచిచూద్దాం.* 🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿 విశ్వనట చక్రవర్తి ...ఎస్.వి.ఆర్.... నూరు వసంతాల సందర్భంగా వీడియో....... https://youtu.be/5lkVwk-_E24 భలేదొరలకు దొరకని సొగసు......షావుకారు. https://youtu.be/bPtMozoqP3s https://youtu.be/ISy4bCgxkTc పాతాళభైరవి.......తాళలేనే...నే తాళలేనే...భామలారా..ఓయమ్మలారా. https://youtu.be/SHMa0CyqJjY
نمایش همه...
S. V Ranga Rao 100 years celebration

Samarla Venkata Ranga Rao (SVR) was one of the greatest actors in Telugu Cinema. This video is a tribute to the acting legend on the eve of his centenary celebrations. #svr #SamarlaVenkataRangaRao #badetibujji #eluru #telugucinema #Viswa Nata Chakravarthi

*డాడీ.....డాడీ.....మీరింక తాగనని ఒట్టేయండి డాడీ*.....అని కన్నీళ్ళతో అడుగుతున్న....జమున కేసి....చూస్తూ.... *షాట్ అయిపోయిందిరా....ఇంకా యాక్ట్ చేస్తున్నావా...బాగా చేశావురా...బంగారు*.....అంటూ చేతులు విడిపించుకుని...ప్రక్కనే కుర్చీలో కూలబడ్డాడాయన. *మీకు తెలుసు....నాకూ తెలుసు...ఇది యాక్షన్ కాదని....దయచేసి మీరు త్రాగడం మానేయండి డాడీ*.....జమున ఏడుస్తూ అడుగుతుంటే...... *నాకేం కాదురా...నా బాడీ ఉక్కు...చూస్తున్నావు గా ఎంత హెల్దీగా ఉన్నానో.....పద బంగారూ....వెళ్ళు....కాసేపు...ఇలా నిద్ర పోవాలి*....అంటూ జమునను షూటింగ్ స్పాట్ నుండి పంపేశారాయన! చదరంగం.....మూవీ...ఆయనే నిర్మాత - దర్శకుడూనూ! ******* *ఒరేయ్ బాబూ...ఏమిరా ఇలా చేశావ్...నీ చిన్ని చేతుల్తో నానోట్లో ఇంత అన్నం పెట్టే వాడివి కదరా. తిరిగి నాచేత్తో...నీనోట్లో ఇంత మట్టేస్తున్నారా...బాబూ*......ఈ డైలాగ్....ఆయన యాక్షన్ చూస్తూ...అంతవరకూ....ఆయన మీద కారాలు...మిరియాలు నూరిన వారంతా....మ్రాన్పడిపోయారు!* అసలా షాట్ కోసం అంతా సిధ్ధం చేసుకున్నాక....అసలు ఉండవలసిన పాత్రధారి ఆయన ఎంతకీ రాలేదు. కృష్ణ, గుమ్మడి, నిర్మాత ప్రభాకర్ రెడ్డి....అందరూ అసహనంగా వెయిట్ చేసి చేసి....ఎవరో లీడ్ ఇస్తే...చివరకు...పాండీ బజార్లో హమీబియా హోటల్ లో ఓ చిన్న రూం లో మందు కొట్తూంటే....ఒప్పించి....తీసుకొచ్చారు! అందరికీ...కోపంగానే ఉంది. కానీ షాట్లో ఆయన నటనకు ముగ్ధులైపోయి....మాటలు మరచిపోయారు! ***** 50 ఏళ్ళ జీవితంలో....నూజివీడు లో స్కూలింగ్....మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందూ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ చదవడం....షేక్స్ పియర్ డ్రామాలో షైలాక్ రోల్ కాలేజ్ లో వేసి మెప్పించడం....నటన....డ్రామాలు ఓ పాషన్ గా మారడం....డిగ్రీ అయ్యాక ....ఫైర్ స్టేషన్ లో ఉద్యోగం....అది చేస్తూనే...నాటకాలు ఆడుతూ ఉండడం.... అది తెలిసే....బంధువైన బి.వి.రామానందం గారు....1946లో సేలం పిలిపించిడం....ఉద్యోగానికి బై చెప్పి....వరూధిని...మూవీలో నటించడం.....మొదట కెమెరా ఫేస్ చేసినప్పుడు....బాగా భయపడ్డా....అది కనిపించకుండా...ఏదో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవడం.....ఆ సినిమా ఫ్లాప్ కావడం....ముఖం చూపించలేక....మళ్ళీ జెమ్షెడ్ పూర్ లో టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరడం....1947..డిసెంబర్ 27న....లీలావతితో పెళ్ళి...... *ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి....ఆయనకు....వాలుకుర్చీలో కూర్చుని సింహావలోకనం చేసుకుంటుంటే. అసలు తనేం....తాగుడుకు అంత బానిసేం కాదు! ఏదో అప్పుడప్పుడు. అసలు బాటిల్ ముట్టకుండా కొన్ని నెలలున్న సందర్భాలూ ఉన్నాయి! కాకపోతే....పులివేట, పేకాట....ఇవి నా హాబీలు. అంతే...అయినా మనిషన్నాక ఏబలహీనతలూ లేకుండా ఎలా ఉంటారు! నేనేం బుధ్ధుడ్ని కాదే!* ఆ తరువాత...మళ్ళీ మద్రాస్ లో కాలుపెట్టా 1948లో....సినిమా పాత్రల మీద మోజు పోలేదు మరి. ఫ్రెండ్స్ అంతా ప్రౌత్సహించారు.నిర్మాతలు కాదు! *వరూధిని హీరోవా బాబూ....నువ్వేనా నాయినా?...అబ్బే!....అని చప్పరించేవారు. ఎక్కే గుమ్మం...దిగే గుమ్మం.ఎవ్వరూ చాన్స్ ఇవ్వలేదు. చివరికి మనదేశం(1949)లో ఓ చిన్న వేషం, పల్లెటూరిపిల్ల(1950)లో మరో వేషం....దొరికాయి. ఆ తరువాత షావుకారు(1950)లో సున్నం రంగడి పాత్ర తో బ్రతుకు మలుపు తిరిగింది. *నేను నిన్న ఓ రిక్షా వాడిని చూశాను. వాడి మాట, నడిచే తీరు, బీడీ త్రాగే స్టైలు....అవీ చూసి నేనో స్టైల్ అనుకున్నా. మామూలు రౌఢీలా అరుపులు, కేకలూ కాకుండా...అని ఎల్.వి.ప్రసాద్....చక్రపాణులకు చెప్పి....చేసి చూపించా. * బాగుంది రంగారావ్....ఇలాగే చెయ్...వెరైటీగా ఉంది*...అని ప్రోత్సహించారు. ఆ మూవీతో రామారావు తో బాటు సున్నం రంగడిగా నాకూ పేరొచ్చింది. ఇక పాతాళభైరవి లో నేపాళ మాంత్రికుడి రోల్. చాలా టఫ్ కాంపిటీషన్ తో నాకొచ్చింది. షైలాక్ లా చేసి చూపించా ఓ పిల్లి గడ్డం తో...ఆ నడక....పింగళి గారి స్పెషల్ డైలాగ్స్....నా ఆహార్యం....ఆ పాత్ర తో ఇక వెనుకకు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఓవర్ నైట్ రామారావు తో బాటు నాకూ స్టార్ హోదా వచ్చేసింది. ఇక పెళ్ళి చేసిచూడులో ధూపాటి వియ్యన్న...ఎటో చూస్తూ మాట్లాడటం......చీటికి మాటికీ కళ్ళు చికిలిస్తూ..మధ్య మధ్య లో ముక్కడం...నెత్తిన చేతులు పెట్టుకోవడం....ఇలాంటి మేనరిజం లతో మహా బాగా పండిందాపాత్ర. ఇలా కూడా చెయ్యొచ్చన్న మాట నటన....అని అందరూ ఆశ్చర్యపోయారు! ఇక వరుసగా....ఎన్ని పాత్రలు... బంగారు పాపలో కోటయ్య పాత్ర, అక్బర్ పాదుషా, దక్షుడు,భోజుడు, ఘటోత్కచుడు,బాణాసురుడు, మహోదరుడు, భస్మాసురుడు, హరిశ్చంద్రుడు,మయాసురుడు,కీచకుడు,రావణుడు, నరకాసురుడు, రావణుడు,యముడు, దుర్యోధనుడు,ఉగ్రసేనుడు, కంసుడు,తాండ్ర పాపారాయుడు, హిరణ్య కశిపుడు....ఇలా ముఖ్యంగా రాక్షస రాజుల పాత్రలకు వేమూరి గగ్గయ్య తరువాత....అంతటి పేరు నాకే వచ్చింది! ఇక తండ్రి, మామ, పెద్దనాన్న, అన్న పాత్రలూ సరేసరి.
نمایش همه...
S. V Ranga Rao 100 years celebration

Samarla Venkata Ranga Rao (SVR) was one of the greatest actors in Telugu Cinema. This video is a tribute to the acting legend on the eve of his centenary celebrations. #svr #SamarlaVenkataRangaRao #badetibujji #eluru #telugucinema #Viswa Nata Chakravarthi

వగలోయ్ వగలు...తళుకు బెళుకు వగలు..... https://youtu.be/r6Vfdb9HKls పెళ్ళిచేసి చూడు.......ధూపాటి వియ్యన్న పాత్ర. https://youtu.be/3-nBdSjfrZk తాధిమి తకధిమి తోలుబొమ్మ......బంగారు పాప. https://youtu.be/lABmUat-cjM సంఘం.............ఎస్.వి.ఆర్. అద్భుత నటనం. https://youtu.be/v1g7CljS2ao వివాహభోజనంబు.....మాయాబజార్. https://youtu.be/0TSOVO2YkYM చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ....మాయాబజార్. https://youtu.be/xCQMtWQVdwo తాతలనాటి క్షేత్రమ్ములెల్ల తెగనమ్మి........చింతామణి. https://youtu.be/0VNvFs-36JY అనార్కలి. రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా https://youtu.be/ZxYNRZukU4k సిపాయి బిరాన రావోయి.... https://youtu.be/6yzbtxP6ewo మంచిమనసులు..........ఎస్.వి.ఆర్. నట విశ్వరూపం. https://youtu.be/hi2eLypHoAc https://youtu.be/v_H0Ze3w6mY ఎవరో ఏఊరో ఎవరు కన్నారో........ఆత్మబంధువు. https://youtu.be/hs5KBNZHVu0 కాలమంతా మనది కాదు...ఎదురు తిరుగునురా.......గాలిమేడలు. https://youtu.be/cekWpLqrDBw భక్త ప్రహ్లాద......హిరణ్యకశిపుడి గా అనితర సాధ్యమైన నటన. https://youtu.be/PDnkXsusEwE నర్తనశాల. సఖియా వివరించవే...... https://youtu.be/-1RCKe0Ef1g దరికి రాబోకు రాబోకు రాజా..... https://youtu.be/0YdEfsIhxkY సలలిత రాగ సుధారస సారం..... https://youtu.be/ehSC4t9_pgc ఎవ్వడు నిను మించువాడు.......సంపూర్ణ రామాయణం. https://youtu.be/NnmiWiEK-94 మంచితనానికి ఫలితం వంచన..........బాంధవ్యాలు. https://youtu.be/XnIIWmDxgAw ధనమేరా అన్నిటికీ మూలం.......లక్ష్మీ నివాసం. https://youtu.be/ilyE8jAgjSc అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం......తాత- మనవడు. https://youtu.be/8bQvPwO8HKo ఇదుగో దేవుడు చేసిన బొమ్మ....పండంటి కాపురం. https://youtu.be/HHj7zkFEcSg బాబూ వినరా....అన్నాదమ్ముల కథ ఒకటి...పండంటి కాపురం. https://youtu.be/5dEBxVnMcqo వచ్చామే నీకోసం.......మొనగాళ్ళకు మొనగాడు. https://youtu.be/_OpBoV2gEGU చంటిబాబు...ఓ బుజ్జిబాబు......అందరూ దొంగలే. https://youtu.be/9kcc315W2lA ఎత్తుకుంటావా........కత్తులరత్తయ్య. https://youtu.be/TZWXVSBD07A వీణలోనా తీగలోనా......చక్రవాకం. https://youtu.be/rXpVieEYE1M మానవుడే మహనీయుడు......బాల భారతం. https://youtu.be/OSRs4wKws 🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 - కె.వి.ఎస్. ప్రసాద్. Rajendra Prasad Chunduri గారి వాల్ నుండి కాపీ పోస్టు
نمایش همه...
Patala Bhairavi Movie Songs - Vagalo Vagalu Song - NTR - SVR - Savitri

Patala Bhairavi Movie Songs, Patala Bhairavi Songs, Patala Bhairavi Film Songs, Vagalo Vagalu Song, Vagalo Vagalu Video Song From Patala Bhairavi Movie, Patala Bhairavi Movie Vagalo Vagalu Song, NTR, SVR, Savitri, Ghantasala Songs, Ghantasala Hit Songs, Ghantasala Melody Songs For More Latest Videos, please check out Full Movies: http://goo.gl/mDS9IQ Film Trailers & Events: http://goo.gl/vQ6oKl Breaking News: http://goo.gl/rXYPWO Film Songs: http://goo.gl/XogNaH Ilayaraja Music: http://goo.gl/95L4gM Movies in HD: http://goo.gl/xE2LWO Health Videos: http://goo.gl/69rff6 TV Shows: http://goo.gl/BQT0x5 Comedy Scenes: http://goo.gl/bpCWe2 Action Scenes: http://goo.gl/Dk3JPF

Photo unavailableShow in Telegram
sticker.webp0.04 KB
Photo unavailableShow in Telegram
sticker.webp0.04 KB
یک طرح متفاوت انتخاب کنید

طرح فعلی شما تنها برای 5 کانال تجزیه و تحلیل را مجاز می کند. برای بیشتر، لطفا یک طرح دیگر انتخاب کنید.