cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Vedam Pdf Files 📁అందరికి అందుబాటులో📚

📁అందరికి అందుబాటులో📚

Show more
Advertising posts
2 188
Subscribers
-124 hours
-47 days
-1530 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Repost from N/a
Photo from 🙏UD🙏🏿
Show all...
👍 1
నర్మదా నదీ పుష్కర స్నానసంకల్పం
Show all...
👍 2💯 1
uttaradi math Telugu-Panchangam-2024-2025
Show all...
పుష్కర సమయంలో పిండ ప్రదానం : సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి. శ్రాద్ధకర్మలు ఉపనయనం, వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి. పుష్కరకాల స్నానం : నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది. దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం, మార్జనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది. మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే మార్జన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానం ద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం , దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. *ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.* *త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండుసంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని,అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు.* *మోక్షప్రాప్తి కలుగుతుందని *బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది.* నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. ఇసుకతో కాని, మట్టితో కాని , పార్థీవ శివలింగాన్ని చేసి పూజించాలంటారు. నదీ తీరంలోని ఇసుకను నదిలోకి వేయాలంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్ల నీళ్లతో ఆశీస్సులు అందజేస్తారు. *నర్మదానదికి వాయినాలు :* సుమంగళిగా జీవితాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగ నదీమతల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలకు, ముత్తెదువలకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరిస్తారు. *సర్వ పాపాలనూ, సకల దోషములనూ, దీర్ఘకాలిక వ్యాధులను పోగొట్టే నర్మదా నదీ పుష్కరాల్లో పాల్గొని పునీతులం అవుదాం.*
Show all...
🙏 1
*నర్మదా నదిలో పుష్కరాలు* *పుష్కరం తర్వాత వృషభ రాశిలోకి పుష్కరుడు రాక 01.05.2024 నుండి 12.05.2024* *ప్రాణికోటి సమస్తం మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది.జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.అలాంటి జలాన్ని దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాఘ స్నానాలు , మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడిపడి ఉంది. అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది.* *శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే.నదీతీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు చెప్తారు.టీవీబీసీఛానెల్.పితరులను ఉద్దరించడానికి భాగీరధుడు గంగానదిని భూమికి తీసుకువచ్చాడని పురాణాలు చెప్తున్నాయి.* *తిలోదకాలు ఇచ్చామంటే స్వస్తి వాచకం చెప్పడమని లోకోక్తి. నదీ స్నానాలలో పూష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం. తైత్తరీయ ఉపనిషత్తు.* బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది . *ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.టీవీబీసీఛానెల్* పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరం అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు. బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండంలంలోకి ప్రవేశించాడు. *బ్రహ్మ కార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలం కావాలని బ్రహ్మదేవుని ప్రార్థించాడు.* *ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి. పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు : మొదటి రోజు : సువర్ణ దానం, రజితం దానం, ధాన్య దానం, భూదానం చేయాలి. రెండవరోజు : వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి. మూడవ రోజు : గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి. నాల్గవ రోజు : ఘృతం (నెయ్యి) దానం, తైలం (నూనె) దానం, క్షీరం (పాలు, మధువు , తేనె) దానం చేయాలి. ఐదవ రోజు : ధాన్యదానం, శకట దానం, వృషభదానం, హలం దానం చేయాలి. ఆరవవ రోజు : ఔషధదానం, కర్పూరదానం, చందనదానం, కస్తూరి దానం చేయాలి. ఏడవ రోజు : గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి. ఎనిమిద రోజు : చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి. తొమ్మిదవ రోజు : పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి. పదవ రోజు : శాకం (కూరగాయలు) దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి. పదకొడవ రోజు : గజ దానం చేయాలి. పన్నెండవ రోజు : తిల (నువ్వులు) దానం చేయాలి.
Show all...
👍 2🙏 1
వేములవాడ_మహాలింగార్చన
Show all...
💎🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔 Archakagrandhanidhi *తత్త్వం కిమపి కావ్యానాం* *జానాతి విరలో భువి* *మార్మికాః కో మరన్దానా* *మన్తరేణ మధువ్రతమ్*|| Archakagrandhanidhi *భావం: కవులు మంచి మంచి కవితలు రాస్తారు. కానీ, కవితలోని సారం గ్రహించిన వారు, కావ్యతత్వం తెలిసిన వారు ఈ లోకంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాగే, పూలలో తేనె ఉంటుంది. కానీ, ఆ మకరందం ఎలా ఉంటుందో దాన్ని గ్రహించగల తుమ్మెదకు మాత్రమే తెలుస్తుంది. మరేదీ ఆ మాధుర్యం సంగతి చెప్పలేదు*. Archakagrandhanidhi *🪷✍️🙏*
Show all...
1
Photo from 🙏UD🙏🏿
Show all...
👏 1