cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

HD Videos Youth తెలుగు సాహిత్యం

తెలుగు సాహిత్యం Telugu old new video songs Youth Funny Videos HD https://t.me/joinchat/AAAAAEMoOC0kgIcMFzoEHg

Show more
India113 793The language is not specifiedThe category is not specified
Advertising posts
406
Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

https://t.me/joinchat/EAtRp0i1IVUhwvJPzqvHoQ I'm looking for the Gaya ticket, do you have it with you? https://gpay.app.goo.gl/bvPNJi I'm looking for the Puri ticket, do you have it with you? https://gpay.app.goo.gl/Nmf2jX I've visited 15 cities in the game on Google Pay. Join me? https://gpay.app.goo.gl/ds2185
Show all...
Go India tickets సమాచారం ప్రకటనలు Jio Ads 19

ప్రకటనలు సమాచారం

https://t.me/joinchat/AAAAAEtu_bLu-3e127xYoQ

సమాచారం ప్రకటనలు

https://t.me/joinchat/EAtRp0i1IVUhwvJPzqvHoQ

I'm looking for the Bengaluru ticket, do you have it with you? https://gpay.app.goo.gl/MXzfqHh I'm looking for the Kochi ticket, do you have it with you? https://gpay.app.goo.gl/ZmXh1m I've visited 12 cities in the game on Google Pay. Join me? https://gpay.app.goo.gl/TVB98v https://t.me/joinchat/EAtRp0i1IVUhwvJPzqvHoQ
Show all...
Go India tickets సమాచారం ప్రకటనలు Jio Ads 19

ప్రకటనలు సమాచారం

https://t.me/joinchat/AAAAAEtu_bLu-3e127xYoQ

సమాచారం ప్రకటనలు

https://t.me/joinchat/EAtRp0i1IVUhwvJPzqvHoQ

నాలంతా తలా ఒక కట్టె తీసుకోని వురుక్కుంటా వచ్చినారు. అప్పటికే ఆ దొంగ ఆ పాపను ఎత్తుకోని పోయి గుర్రం బండిలో పెట్టినాడు. అది చూసి జనాలు కోపం పట్టలేక ఇద్దరినీ పట్టుకోని కిందామీదా యేసి చావగొట్టినారు. నున్నగా గుండు గీసి గాడిదల మీద ఎక్కించి వూరు వూరంతా తిప్పి రాజభటులకు అప్పగించినారు. అందరూ ఆ పాపను పట్టుకోని ''మాయలు లేవు, గీయలు లేవు. అన్నీ వుత్తుత్తివే. నీలాంటి అమాయకులు వున్నంత కాలం ఇలాంటోళ్ళ ఆటలు సాగుతానే వుంటాయి. ఇలా తిక్క తిక్క ఆలోచనలతో కలలు కనడం మాని ఈ లోకంలోనికిరా. నిన్ను గనుక ఆ దొంగసచ్చినోడు ఎత్తుకోని పోయింటే ఇప్పటికల్లా నీ బతుకు నాశనమయ్యేది. నువ్వు కాదన్నోడే మనసులో పెట్టుకోకుండా నిన్ను కాపాడినాడు'' అంటా బాగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినారు. దానితో ఆ పాప సిగ్గుపడి ''ఇంగో సారి ఇలాంటి పొరపాటు చేయను. వుత్తుత్త కలలు కంటా బతుకు నాశనం చేసుకోను. ఐనా కళ్ళల్లో పెట్టుకోని కాపాడే నా బావ నాకు తోడున్నంతకాలం ఇంక నన్నెవరూ ఏమీ చేయలేరు'' అంటా వాళ్ళ బావనే పెళ్ళి చేసుకోనింది. ********************** డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212 ********************** కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు తొలగించకండి. మార్చకండి.
Show all...
*కుక్కే మా పెద్ద బిడ్డ (సంయుక్త అక్షరాలు లేని నీతి కథ)* డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 9441032212 ********************* ఒక ఊరిలో ఒక పెద్ద జమీందారు వుండేటోడు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. చూడ్డానికి చక్కని చుక్కల్లాగుంటారు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. వాళ్ళలో చిన్నబిడ్డ చేతి మీద ఒక పెద్ద పుట్టుమచ్చ పచ్చగా తళతళలాడుతా వుండేది. ఒకసారి ఆ జమీందారు పెళ్ళాంబిడ్డలతో కలసి దూరంగా వున్న ఒక పెద్ద గుడి చూడ్డానికని బైలుదేరినాడు. దారిలో ఒక పెద్ద అడవి వుంది.  అది అలాంటిలాంటి మామూలు అడవి కాదు. పులులూ, సింహాలు, నక్కలూ, తోడేళ్ళతో నిండి వుంది. ఆ అడవి దాటితే గుడి. జమీందారు పోతా పోతా బాగా అలసిపోయి కాసేపు ఆగి అలసట పోగొట్టుకుందామని ఒక చెట్టు కింద కూచున్నాడు. కాసేపటికి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమోగానీ ఒక పెద్దపులి భయంకరంగా అరుచుకుంటా వాళ్ళ మీదకు దుంకింది. దాని దెబ్బకు  భయపడి జమీందారు, ఆయన పెళ్ళాం తలోదిక్కు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినారు. పులి చానా దూరం వాళ్ళ వెంటపడింది గానీ దానికి ఎవరూ చిక్కలేదు. సరే.... పెద్దోళ్ళు ఎలాగూ దొరకలేదు. పిల్లలనన్నా తిందామని పులి తిరిగి ఆ చెట్టుకాడికి వచ్చింది. కానీ పులిని చూసిన పిల్లలు భయపడి అప్పటికే ఆ చెట్టు మీదికెక్కి దాచిపెట్టుకున్నారు. పులి చానాసేపు అటూ ఇటూ వెదుకుతా తిరిగింది. కానీ వాళ్ళు ఎక్కడా కనబడలేదు. ''ఛ... ఛ... చిక్కినట్టే చిక్కి అందరూ జారిపోయినారు. ఈ రోజు కడుపు నిండేలా లేదు'' అనుకుంటా అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళ అమ్మా నాయన పిల్లలను పులి చంపేసి వుంటాదని అక్కడికి పోతే తమను గూడా చంపుతాదేమోనని భయపడి కళ్ళనీళ్ళతో తిరిగి వూరికి వెళ్ళిపోయినారు. చెట్టు మీద కూచున్న చిన్న పిల్లలు అలాగే చానాసేపు అక్కడే కూచోని ఇక పులి ఎక్కడా కనబడక పోవడంతో నెమ్మదిగా కిందికి దిగినారు. ఆ అడవిలో వాళ్ళకు ఎక్కడికి పోవాలో తెలీలేదు. ఆకలితో ''అమ్మా... అమ్మా...'' అని పిలుచుకుంటా తిరుగుతా వుంటే దారిలో ఒక తోడేలు ఎదురయింది. అది చానా భయంకరంగా, పెద్దగా వుంది. అది పిల్లలను చూసి ''ఆహా... ఈ రోజు నాకు విందు భోజనం దొరికింది'' అని లొట్టలేసుకుంటా ఎగిరి వాళ్ళ మీదకి దుంకింది. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ ఒక కుక్క అక్కడికి వచ్చింది. అది తోడేలు పిల్లల మీదకు ఎగరడం చూసింది. ''అయ్యో.... పాపం చిన్నపిల్లలు... అడవిలో తప్పిపోయినట్టున్నారు. వీళ్ళని ఎలాగైనా కాపాడాలి'' అనుకోని అది ఎగిరి తోడేలు మీదకు దుంకింది. రెండూ కిందామీదా పడి ఒకదానినొకటి కరుచుకున్నాయి. కుక్కకు బాగా దెబ్బలు తగిలినాయి. అయినా అది వెనుకడుగు వేయలేదు. పట్టు వదల్లేదు. తోడేలును అందిన చోటల్లా పట్టి పీకసాగింది. దాంతో తోడేలుకు కూడా బాగా దెబ్బలు తగిలినాయి. ఈ కుక్క వున్నంతసేపు ఆ పిల్లలను ఏమీ చేయలేమనుకోని అది తిరిగి వెళ్ళిపోయింది. ఆ కుక్క పిల్లలను ఇద్దరినీ దగ్గరలోనే వున్న ఒక గుడికి తీసుకోని పోయింది. అక్కడ పూజారి ఈ పిల్లలను చూసి దగ్గరికి తీసుకున్నాడు. ''మీ అమ్మా నాన్నలను కలిసే వరకు ఇక్కడే వుండండి'' అన్నాడు. కుక్కగూడా వాళ్ళతో బాటే వుంటా, వాళ్ళకి తిండి పెడతా, తల దువ్వుతా, కావలసిన పళ్ళు, దుంపలు అడవిలోంచి తెచ్చిపెడతా, వాళ్ళు నవ్వితే నవ్వుతా, బాధపడితే బాధపడతా బాగా కలసిపోయింది. నెమ్మదిగా కొంతకాలానికి ఆ పిల్లలు బాగా పెరిగి పెద్దగయినారు. కుక్క కూడా ముసలిది అయిపోయింది. ఒకరోజు పక్కనే వున్న వూరిలో పెద్ద తిరునాల జరుగుతా వుంటే పిల్లలిద్దరూ కుక్కను తీసుకోని చూడ్డానికి పోయినారు. అక్కడికి జమీందారు కూడా తన పెళ్ళాంతో వచ్చినాడు. వాళ్ళు తిరునాల జరిగినప్పుడల్లా అక్కడికి వచ్చి చచ్చిపోయినారనుకున్న తమ బిడ్డల పేరు మీద అందరికీ అన్నదానం చేసేటోళ్ళు. ఆ రోజు కూడా అలాగే అన్నదానం చేయసాగినారు. ఈ ఇద్దరు పిల్లలు సంబరంగా తిరునాలంతా తిరిగీ తిరిగీ అలసిపోయి అన్నం తిందామని అక్కడికి వచ్చినారు. జమీందారు పెళ్ళాం అందరికీ వడ్డించసాగింది. అలా చిన్న పాప దగ్గరికి వచ్చి అన్నం పెడతా వుంటే ఆ పాప ''చాలు... చాలు'' అంటా చేయి అడ్డం పెట్టింది. ఇంకేముంది ఆ పాప చేయి మీద పావలా కాసంత పుట్టుమచ్చ పచ్చగా తళతళలాడతా ఆమెకు కనబడింది. అది చూడగానే ఆమె ''కొంపదీసి ఈ పిల్ల నా బిడ ్డ కాదు గదా... దీనికి గూడా చనిపోయిందనుకుంటా వున్న నా బిడ్డ వయస్సే వుంటాది'' అనుకోని ఎక్కడి అన్నంగిన్నె అక్కన్నే వదిలేసి వురుక్కుంటా పోయి మొగునికి చూసిందంతా చెప్పింది. దాంతో ఆయనగూడా వురుక్కుంటా ఆ పిల్లల దగ్గరకు వచ్చి 'మీ వూరేదమ్మా... అమ్మా నాయనా ఎక్కడుంటారు'' అని అడుగుతా అన్ని వివరాలు సేకరించుకొన్నాడు. వాళ్ళు విడిపోతా వున్నప్పుడు చిన్నపిల్ల చానా చిన్నదిగానీ పెద్దపిల్లకు కొంచం తెలివి వుంది. దాంతో ఆ పాపగూడా బాగా పట్టిపట్టి చూసి వాళ్ళ అమ్మానాయనలను కనుక్కోనింది. ఇంకేముంది అందరూ ఒకరినొకరు పట్టుకోని సంబరంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు,. జమీందారు ఆ పిల్లలొంక చూసి ఆనందంగా ''ఇంక... మీ బాధలన్నీ ఈ రోజుతో తీరి పోయినట్టే. మాతో పాటు వచ్చేయండి. ఇప్పటికే ఎన్ని బాధలు పన్నారో ఏమో.... ఇక గుండెల్లో పెట్టుక
Show all...
*కలలు కనకు వలలో పడకు(అందరూ చదవాల్సిన మంచి కథ)* డా.ఎం.హరి కిషన్-కర్నూలు-9441032212 ********************** ఒక ఊరిలో ఒక పాప వుండేది. ఆ పాప చూడ్డానికి చక్కని చుక్కలెక్క ముచ్చటగా వుండేది. కానీ ఆ పాప తనను చూసి ఏ రాకుమారుడో సంబరపడి పెళ్ళి చేసుకుంటాడని, తాను ఆ దేశానికి రాణిని అవుతానని ఎప్పుడూ కలలు కంటా వుండేది. కానీ రాణి కావాలంటే ఈ అందం సరిపోదు. ఏడేడు పదునాలుగు లోకాల్లోనూ తనంత అందగత్తె ఎవరూ వుండగూడదు అనుకునేది. దాంతో ఒకటే దిగులు. ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో మూలికలు, మందులూ తీసుకోనొచ్చి వంటికి పూసుకునేది. అందంగా మెరిసిపోతావంటే ఎవరు ఏమి చెయ్యమన్నా చేసేది. అది చూసి వాళ్ళ అమ్మానాన్నా ''పాపా... మనమెక్కడ, రాజకుటుంబం ఎక్కడ. కనీసం కన్నెత్తి చూడటానికి గూడా వీలు కాదు. అనవసరంగా కలలు కనడం మానేసి వచ్చిన సంబంధాల్లో మంచిది చూసి పెళ్ళి చేసుకో'' అని నెత్తీనోరు కొట్టుకోని చెప్పినారు. కానీ ఆ పాప వాళ్ళ మాటలు కొంచంగూడా చెవికి ఎక్కించుకునేది కాదు. అమ్మా నాన్నలకు గూడా తెలీకుండా మంది మాటలు వినిఏవేవో తెచ్చుకోని పూసుకునేది. ఒకరోజు ఆ వూరికి ఒక మోసగత్తె వచ్చింది. ఆమె ఎవరికి ఏ బాధ వున్నా తన దగ్గరున్న మాయలతో పోగొడతానని కనిపించిన వారందరికీ పదే పదే చెప్పసాగింది. ఎప్పుడూ ఒక గదిలో కూచోని, పెద్ద కుంకుమబొట్టు పెట్టుకోని, మొగమంతా పసుపు పూసుకోని ఏవేవో పూజలు, యాగాలు చేసి అందరినీ పిలిచి మీకు ఎటువంటి బాధలు వున్నా తొలగిపోతాయి, తీసుకోండి అంటా చేతిలో విబూది పెడతా వుండేది. ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం ఆ పాపకు తెలిసింది. దాంతో కిందామీదా పడతా వురుక్కుంటా ఆ మోసగత్తె దగ్గరకు వచ్చింది. ఆమె కాళ్ళమీద పడి ''నేను పాలరాయిలెక్క నిగనిగా మెరిసిపోవాల, చందమామలెక్క ధగధగా వెలిగిపోవాల. ఈ భూమ్మీద నా అంత అందగత్తె ఎక్కడ వెదికినా కనబడగూడదు. అలా చేయగలవా'' అని అడిగింది. దానికి ఆమె కాసేపు ఆలోచించినట్టు నటించి ''ఆ... చేయగలను, కానీ ఈ విషయం చానా గుట్టుగా వుంచాలి. ఎంతగా అంటే నువ్వు ఈ పది రోజులు ఎక్కడికిపోతావున్నావో నీ కాలికి వేసుకున్న చెప్పుకూ తెలియగూడదు. నువ్వు ఏం పూజలు చేశావో నుదుటన వున్న బొట్టుకూ తెలియగూడదు. అలాగే దీనికి బాగా డబ్బు కావాలి. ఏం సరేనా'' అనింది. దానికా పాప ''ఓ.... దానికేం.... ఎంత కావాలంటే అంత తీసుకో... ఎన్ని పూజలైనా చేసుకో. కానీ నిలువెత్తు బంగారాన్ని నన్నూ పక్కనపక్కన నిలబెట్టి నీకేది కావాలో కోరుకో అంటే... ఈ భూమ్మీద పుట్టిన ఎవరైనా సరే నేనే కావాలి అంటా నా చేయి అందుకోవాలి. అలా తయారు చేయాలి సరేనా'' అనింది. సరే అని ఆరోజునుంచీ రోజూ ఆ పూజలని, ఈ పూజలనీ రోజుకో పదివేల వరహాలు గుంజసాగింది. ఆ పాప వాళ్ళ అమ్మానాన్నకి తెలీకుండా తనకు చిన్నప్పటి నుంచీ అమ్మా నాన్నలు కొనిపెట్టిన ఒకొక్క నగా అమ్మేసి ఆమె చేతిలో డబ్బు పెట్టసాగింది. ఆ పాపకు వరుసకు బావ అయ్యే ఒక పొట్టెగాడు వాళ్ళింటికి దగ్గరలోనే అదే సందులో వుంటాడు. వానికి ఆ పాపను చేసుకోవాలని ఒకటే కోరిక. పెద్దవాళ్ళతో గూడా అడిగించినాడు. కానీ ఆ పాప 'చేసుకుంటే ఈ దేశంలో వున్న ఏదో ఒక యువరాజునో, పెద్ద జమీందారునో చేసుకుంటా గానీ అందరిలాగా అల్లాటప్పా సంబంధాలు చేసుకోనని' మొగం మీదే కొట్టినట్టు చెప్పేసింది. కానీ ఆ పొట్టెగాడు ఏమీ బాధపడలేదు. 'కలలకేం కలకాలం వుంటాయా... ఏదో ఒక రోజు నేల మీదకి దిగవలసిందే గదా' అనుకుంటా ఎదురు చూడసాగినాడు. ఆ పొట్టెగాడు ఒకరోజు ఈ పాప దొంగచాటుగా పోతా వుంటే చూసినాడు. 'ఇదేందబ్బా.... ఒక్కతే ఇన్ని నగలు వేసుకోని పోతా వుంది అనుకోని చప్పుడు కాకుండా ఆ పాప వెనుకెనుకే దాక్కుంటా దాక్కుంటా పోయినాడు. అది ఆఖరి రోజు. ఆ మోసగత్తె ఆ పాపతో ''చూడు పాపా... నీ ఒళ్ళు బంగారంలా మెరవాలంటే నువ్వు చివరిరోజు వంటి మీదంతా బంగారం వేసుకోని రావాల. పూలదండ కట్టినప్పుడు పూలవాసన దారానికి గూడా సోకినట్టు ఆ బంగారం రంగు కొంచం కొంచం ఈ పూజలో నీలోకి చేరడం మొదలు పెడుతుంది. పూజంతా అయిపోయేసరికి నిన్ను చూసి నువ్వే నమ్మలేవు. మెరుపుతీగలెక్క మారిపోతావు'' అంటా వూరించి... వూరించి చెప్పింది. దాంతో ఆ పాప ఆమె నగలే గాక, వాళ్ళ అమ్మ నగలు గూడా వేసుకోని బైలుదేరింది. ఆ మోసగత్తె పక్క వూరిలో నున్న ఒక పెద్ద దొంగతో ''నా దగ్గర ఒక పాప వుంది. చూడ్డానికి చక్కని చుక్కలాగుంటాది. నువ్వు గనుక ఒక లక్ష వరహాలు నా చేతిలో పెడితే ఆ పిల్లను నీ చేతిలో పెడతా... ఏం సరేనా'' అనింది. వాడు సరేనని ఆ పిల్లను ఎత్తుకుపోడానికి గుర్రంబండి తీసుకోని అక్కడికి వచ్చేసినాడు. పాపం... ఆపిల్లకు అదంతా తెలీదు గదా... దాంతో అమాయకంగా ఇంటిలోనికి అడుగుపెట్టింది. ఆ మోసగత్తె ఆపాప నగలన్నీ తీపిచ్చి దేవుని పటం ముందు పెట్టి పూజ మొదలుపెట్టింది. అంతలో వెనుకనుంచి దొంగ వచ్చి ఆ పాప మీద మత్తుమందు చల్లినాడు. అంతే... ఆ పాప ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ పాప వెనకాలే వాళ్ళ బావ వచ్చినాడు గదా... ఇదంతా కిటికీలోంచి చూసి అదిరిపన్నాడు. ''అమ్మో... ఇంకాసేపు ఆగితే ఈ పిల్ల ఎవరికీ దక్కదు'' అనుకోని వురుక్కుంటా వూరిలోనికి పోయి కనబన్నవాళ్ళకంతా జరిగింది చెప్పినాడు. అంతే... జ
Show all...
ోని చూసుకుంటా'' అన్నాడు. వాళ్ళు సరేనని తమతో పాటు ఆ కుక్కను గూడా తీసుకోని బైలుదేరినారు. అది చానా ముసలిదయి పోయింది గదా... దాంతో నడవలే నడవలేక నడవసాగింది. దాంతో పాటు వళ్ళంతా గాయాలతో చానా గలీజుగా వుంది. అది చూసి జమీందారు ''ఎందుకమ్మా ఆ పాడుకుక్క. దాన్ని ఇక ఇక్కన్నే వదిలేయండి. చూడు ఎంత గలీజుగా వుందో... ఛీ... ఛీ...'' అన్నాడు కంపరంగా ముఖం పెట్టి. అప్పుడా పిల్లలు ''చూడు నాన్నా... ఆ రోజు మన మీదకు పులి దుంకితే కన్నబిడ్డలని గూడా చూడకుండా మా ఇద్దరినీ అడవిలోనే వదిలేసి మీరు తలోదిక్కు పారిపోయినారు. కానీ ఈ కుక్క... దానికి మేమేమీ కాకపోయినా పాపం చిన్నపిల్లలు అని జాలిపడి తను చచ్చినా పరవాలేదనుకోని తోడేలు మీదకు పోయి మా ఇద్దరినీ కాపాడింది. అప్పుడు తగిలినవే ఈ దెబ్బలన్నీ. ఈ రోజు మేము బతికున్నామంటే అంతా దాని చలవే... మేము మీ ఇద్దరినన్నా వదిలిపెడతాం గానీ, ఈ కుక్కను ఎప్పటికీ వదలం'' అన్నారు. ఆ మాటలకు వాళ్ళ అమ్మానాన్న కళ్ళనీళ్ళు పెట్టుకోని ''పాపా... మాకు విషయం తెలీక ఏదో తొందరపాటుతో అలా నోరు జారినాం. ఈ రోజు నుంచీ మాకు మీరెంతో ఆ కుక్కా అంతే... దాన్ని మా పెద్దబిడ్డ లెక్క కాలుకింద పెట్టనీయకుండా పువ్వుల్లో పెట్టుకోని చూసుకుంటాం'' అన్నారు. అప్పుడా పిల్లలు కుక్కతో కలసి సంబరంగా అమ్మానాన్నా వెంట పోయినారు. ********************** డా.ఎం.హరికిషన్ - కర్నూలు -9441032212 ********************** *వందరోజులు వందకథలు* *వాట్సప్ గ్రూప్* ఇది రెండవ తరగతి చిన్నారుల కోసం *only admin* గ్రూపు. రోజు ఒక కథ , గేయం , పొడుపుకథ లేదా బొమ్మలతో సామెత సులభమైన పదజాలంతో , చిన్నారులు సొంతంగా చదువుకునేలా వస్తాయి. గ్రూపులో చేరాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
Show all...
@india_moviez NTR #ntr
Show all...
👌 121
👍 35
👎 40