7 712
订阅者
+424 小时
+227 天
+9830 天
帖子存档
7 710
📢 TGPSC Assistant Scientist అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్
✅ Final Key విడుదలైంది.
✅ Response Sheets అందుబాటులో ఉన్నాయి.
✅ Certificate Verification List విడుదలైంది.
📅 CV తేదీ: 12-11-2026 (Reserve Day: 13-11-2026)
7 710
"సమయం నీ శత్రువు కాదు... దాన్ని వృథా చేసే అలవాటే నీ శత్రువు."
– Master TV Education ✍️
7 710
💥💥 *మిగతా జిల్లాల్లో అన్ని కలిపి మరో 1500 పోస్టులకు అతి త్వరలో విద్యా వాలంటరీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ దిశగా విద్యా శాఖ చర్యలు*
7 710
"ప్రతి 'ఇంకో గంట చదువుదాం' అనే నిర్ణయం... నీ భవిష్యత్తుకు వేసిన బంగారు ఇటుక."
– Master TV Education ✍️
7 710
DyEO Hall Tickets Released 👍. https://hallticket.tgpsc.gov.in/hG032026lbw2gje6-l2m5-ikd5l2mj6-cl9n6u-y3h0gta5lmdk
7 710
*🔊'టీజీ సేఫ్'లో 177 పోస్టులకు పచ్చజెండా*
*🍥రాష్ట్రంలో 'టీజీ సేఫ్'ను మరింత బలోపేతం*
*చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విభాగంలో 177 పోస్టులను పెంచేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ దస్త్రాన్ని గురువారం మంత్రిమండలి ఆమోదించింది. గతంలో ఆహారభద్రత, ఔషధ నియంత్రణ విభాగాలు వేర్వేరుగా ఉండేవి. ఆగస్టులో ఈ రెండు విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి 'తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసె న్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)'గా నామకరణం చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కల్తీ ఆహార నియంత్రణకు, నకిలీ ఔషధాల కట్టడికి పోలీసుల సహకారంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు రెస్టారెంట్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు వంటివాటిలో కల్తీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే నోటీసులు ఇచ్చి మూసేయిస్తున్నారు. అలాగే ఔషధ దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ విభాగంలో సిబ్బంది కొరత వల్ల వివిధ హోదాల్లోని పోస్టులను పెద్దసంఖ్యలో పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో 'టీజీ సేఫ్' 257 పోస్టులకు ప్రతిపాదించింది. ఇందులో 177 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ల్యాబొరేటరీలో.. 4 ఫుడ్ ఎనలిస్ట్, 35 జూనియర్ ఎనలిస్ట్, 24 ల్యాబ్ టెక్నీ షియన్, 17 ల్యాబ్ అటెండెంట్, 4 శాంపిల్ కస్టోడియన్, 4 స్టోర్ కీపర్ పోస్టులు (మొత్తం 88) రానున్నాయి. పరిపాలన, టెక్నికల్ సపోర్ట్ విభాగంలో.. 30 మంది డేటా ఆపరేటర్లతో పాటు ప్రజా సంబంధాల అధికారి, లీగల్ ఎడ్వైజర్, ఫొటోగ్రాఫర్ వివిధ హోదాలు కలిపి 35 పోస్టులు భర్తీ కానున్నాయి. సెక్యూరిటీ, జనరల్ సపోర్ట్ విభాగంలో.. 6 సెక్యూరిటీ గార్డు, 40 డ్రైవర్ పోస్టులు సహా మొత్తం 54 పోస్టులు రానున్నాయి.*
