cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Harish Rao Thanneeru

Minister for Finance, Health and Family Welfare | MLA From Siddipet | Telangana.

إظهار المزيد
مشاركات الإعلانات
1 226
المشتركون
لا توجد بيانات24 ساعات
لا توجد بيانات7 أيام
لا توجد بيانات30 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

إظهار الكل...

జగిత్యాల కలెక్టరెట్ లో జరిగిన సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి గారు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్ గారు పాల్గొనగా, హైదరాబాద్ నుండి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి గారు హాజరయ్యారు.
إظهار الكل...
• 'కంటి వెలుగు' ను విజయవంతం చేయాలి - ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ. - పంచాయతీ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకోవాలి. - స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలి. - కంటి వెలుగు కార్యక్రమ అమలు పై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో జిల్లా వైద్యాధికారులతో సమీక్ష. - జగిత్యాల కలెక్టరేట్ నుండి పాల్గొన్న ఆర్థిక, అరోగ్య మంత్రి హరీష్ రావు గారు. రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిదులందరు ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని చెప్పారు. సీరియస్ గా తీసుకొని పని చేయాలన్నారు. జిల్లాల్లో ప్రభావ వంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందన్నరు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయడం పూర్తి చేయాలన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ కార్యక్రమం అయినా రూపొందిస్తారు అని, ప్రజల కోణం లో ఆలోచిస్తారని చెప్పారు. ప్రభుత్వం పరంగా అన్ని చేస్తామని, అధికారులు పూర్తి బాధ్యతతో పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసింది అన్నారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్ లలో కంటి వెలుగు పై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు జిల్లాలో మైక్రో ప్లానింగ్ పూర్తి అయిన తర్వాత జిల్లా ఇంఛార్జి మంత్రి , స్థానిక ప్రజాప్రతినిధుల తో జిల్లా వారీగా మీటింగ్ ఏర్పాటు చేయాలనీ, ఏ రోజు ఎక్కడా క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్లాన్ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 5 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలన్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు చేసుకోవడం మిస్ అయిన వారీ కోసం కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాల్లోకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీరు ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారన్నారు. 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నామన్నరు. ఎలాంటి వైద్య సిబ్బంది కొరత లేదన్నారు. గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుంది. కానీ ఎఫెక్టివ్ గా జరిగేందుకు అందరం కలిసి కృషి చేయాలన్నారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో సీఎం గారు ఉన్నారు. నెరవేరడం లో మనందరిది ముఖ్య పాత్ర అన్నారు.గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం అన్నారు. ప్రాథమిక వైద్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు గాను, పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి చేస్తున్న సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీల కొత్త నిర్మాణాలు, మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
إظهار الكل...
• ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ. - భీమగల్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆర్మూర్ నియోజక పర్యటనలో భాగంగా.. స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలసి ఆసుపత్రిలో ప్రాంగణంలో తిరుగుతూ.. నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి పనుల గురించి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పేషెంట్లను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు పూటలా భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయాలను వాకబు చేశారు. రోగులకు తగినటువంటి పోషికాహారం అందించాలని డాక్టర్లను సూచించారు. ఆసుపత్రిలో ఫార్మసీ లాబ్ సౌకర్యాలు గురించి తెలుసుకున్న మంత్రి.. హై ఎండ్ అల్ట్రా సౌండ్ మెషిన్ ఉన్నప్పటికీ టిఫా(టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫ్యూటల్‌ ఎనామిలీస్‌) స్కానింగ్ మెషిన్ అందుబాటులో లేదని చెప్పగా వెంటనే టిఫా స్కాన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ సౌకర్యం లేనందువలన నిజామాబాద్‌కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి 10 రోజుల్లో ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీలనే చేయాలని మంత్రి వైద్య సిబ్బందికి సూచించారు. వేల్పూర్: ఈ పర్యటన అనంతరం బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ గ్రామానికి చేరుకున్నారు మంత్రి హరీశ్ రావు. అక్కడ ఆయనకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే మంత్రి వేముల కోరిక మేరకు.. భీమగల్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
إظهار الكل...
00:22
Video unavailableShow in Telegram
ఆర్మూర్ పర్యటనలో భాగంగా అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గారు, ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
إظهار الكل...
إظهار الكل...
Instagram

✷ ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు.. • అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు. • ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతాం. • వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలి. • పనితీరు మెరుగుపడాలి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోము. • ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆహార భద్రత విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి. • ఫుడ్ అడల్ట్రేషన్ గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. • 040- 21111111 టోల్ ఫ్రీ, ట్విట్టర్ హ్యాండిల్ ను ప్రజలకు చేరువ చేయాలి. ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం ల్యాబ్స్ పని తీరు, సాధించిన పురోగతిపై వెంగళ్ రావు నగర్ లోని IIHFW కార్యాలయంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు గారు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి, అగ్రస్థానం చేరాలని కాంక్షించారు. అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఇవ్వాలి, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతామని తెలిపారు. ఉత్తమ విధానాలు అనుసరించి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలు అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. ఒక వైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలిపారు. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి హరీష్ పేర్కొన్నారు. ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించి, ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే.. 040 21111111 నెంబర్ కి కాల్ చేసి లేదా, @AFCGHMC ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులు రాగానే అధికారులు వెళ్లి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఆహార కల్తీని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి, త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలి. ప్రజల ఆరోగ్యానికి ఎక్కువగా నష్టం కల్గించే కల్తీ ల పై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని మొబైల్ వాహనాలు పని చేయాలి. టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, ఐపిఎం, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివ లీల, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.
إظهار الكل...