cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Spiritual Seekers 🙏

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
3 284Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ ఆది శంకరాచార్యుల వారి ఇంటి వెనుక వున్న పెరియార్ నది... శంకరాచార్యుల వారిని మొసలి పట్టుకోవడం ఆ తర్వాతి కథ మీకు తెలిసిందే.. అది జరిగిన స్థలం ఇదే...
Show all...
..... అర్థం... 1. వి = పక్షి 2. శ్వా = కుక్క 3. అమిత్ర = శత్రువు 4. అహి = పాము 5. పశుషు = పశువులు 6. కర్ద మేన = బురద 7. జలేనచ = నీటి యందు 8. అంధః = గుడ్డి తనమందు 9. తమసి = చీకటిలో 10. వార్థక్యము = ముసలితనము నందు.. దండము = కర్ర ఉపయోగపడును భావము... పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డి తనంలో, ముసలి తనంలో అవలంబనంగానున్ను చేతి కర్ర పనికి వస్తుంది. అందు చేతనే "దండం దశ గుణం భవేత్" అంటారు... ఓం నమః శివాయ Spiritual Seekers 🙏
Show all...
దండం దశ గుణం భవేత్..... | దణ్డాత్ప్రతిభయం భూయః శాన్తిరుత్పద్యతే తదా | నోద్విగ్నశ్చరతే ధర్మం నోద్విగ్నశ్చరతే క్రియామ్ భావము... చేసిన తప్పుకి దండిచబడితే, మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు, అలా తప్పును అరికట్టినట్టౌతుంది. తద్వార ప్రశాంతత నెలకొంటుంది. ప్రశాంతత లేకపోతే, ఉద్వేగములో ధర్మాన్ని ఆచరించలేరు, అలాగే క్రియలు చేయలేరు. కాబట్టి "దండం దశగుణం భవేత్". శాంతి నెలకొనాలంటే దుష్టులు దండించ బడాలి. మహాభారతం, ఆదిపర్వం, అధ్యాయం 41 - శ్లో. 28 - శమీక ఉవాచ.. "దండం దశ గుణం భవేత్" అంటారు కదా.. ఆ దశ గుణాలు ఏవో మీకు తెలుసా.. తెలుసు కోవాల నుందా.. ఐతే చూడండి... శ్లో|| | విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషుచ | అంధే తమసి వార్థక్యే దండం దశగుణం భవేత్ .....
Show all...
ఓం నమః శివాయ
Show all...
..... అప్పుడు.. 'అయ్యలారా.. మీమీ ఇష్ట దైవాలను స్మరించు కోండి. పడవ అదుపుతప్పింది. ముందు సుడిగుండం కూడా ఉంది. బహుశా మునిగిపోవచ్చు అని పడవవాడు హెచ్చరించాడు. ఇంతలోనే పడవలోకి కొంతనీరు వచ్చి చేరింది. అందరూ ఏడవడం ప్రారంభించారు. బాబాజీ మాత్రం 'జయజయరాం జయసీతారాం' అంటూ పాడుతూ తన వద్దనున్న కమండలంతో ఇంకొన్ని నీళ్లు తీసుకొని పడవలోకే వేయడం చేశాడు. అందరికీ ఆశ్చర్యంతో పాటు భయం వేసింది. పడవలోని నీటిని తీసి నదిలోకి వేసే బదులు నదిలోని నీటిని మునిగిపోతున్న పడవలోకి వేసి ఇంకా త్వరగా పడవ మునిగిపోయేట్టు చేస్తున్నాడు ఈ పిచ్చి సాధువు అనుకొన్నారు.. కొంత సేపటికి పడవ ప్రమాదస్థలాన్ని దాటి బయటపడింది. అదుపు లోకి వచ్చింది. పడవ వాడు, ఇతరులు ఊపిరిపీల్చు కొన్నారు. గండం గడిచింది అన్నాడు ఆ పడవవాడు. ఇప్పుడు సాధువు మల్లి 'జయజయరాం, జయసీతారం' అని పాడుతూ తన కమండలంతో పడవలోని నీటిని తోడి నదిలోకి వేశాడు. అక్కడున్నవారు ఆశ్చర్యపడి 'నీకు పిచ్చిపట్టిందా.. నదిలోని నీరు పడవలోకి వేశావు, ఇప్పుడు పడవ ప్రమాదం నుంచి బయటపడితే పడవలోని నీటిని బయటికి వేస్తున్నావు. ఏమిటి ఇదంతా.. అని అడిగారు. అప్పుడు ఆ సాధువు చాలా ప్రశాంతంగా వారితో 'ఇందులో వింత ఏముంది.. పడవ మునిగిపోతున్నప్పుడు పడవను ముంచటం దైవ సంకల్పం అని భావించాను, ఆ సంకల్పంతో నా సంకల్పాన్ని లీనం చేశాను. ఆ సంకల్పం త్వరగా నెరవేరటానికి నా వంతు కృషి నేను చేశాను. మరీ పడవ ప్రమాదం నుంచి బయటపడటంతో పడవను నదిలో ముంచటం కాక, రక్షించటం దైవ సంకల్పం అని తెలుసుకొని పడవలోని నీటిని తోడి బయటపడేశాను, దైవ సంకల్పం నెరవేరటానికి నా వంతు కృషి నేను చేశాను.. అంతే అని. కళ్లు మూసుకొన్నాడు. ఆ సాధువు పడవ మునిగి పోతున్నప్పుడు అందరిలాగా భయాందోళనలకు గురికాక దేవుడిని స్మరించాడు. పడవ ప్రమాదం నుంచి బయట పడినప్పుడు అందరిలాగా సంతోషంతో గంతులు వేయక ప్రశాంతంగా దైవ స్మరణలో నిమగ్నమయ్యాడు. మరణాన్ని, జీవితాన్ని రెంటినీ దైవస్మరణతో స్వీకరించాడు. మనం అంతటి ఉన్నతులం కాకపోవచ్చు. కష్టనష్టాల నుంచి బయట పడటానికి శాయశక్తులా కృషి చేద్దాం. దైవంపై భారం వేసి వాటిని ఎదర్కొందాం. అంతేగాని నిరాశ నిస్పృహలకులోనై ప్రాణాలను తీసుకోరాదు, ఆత్మహత్యలను చేసుకోరాదు. ఈ దేహాలలో ఎంత కాలం ప్రాణాలుండాలన్నది ఆయన సంకల్పమే, దాన్ని నెరవేర్చటానికే కృషి చేద్దాం... ఓం నమః శివాయ
Show all...
దైవ సంకల్పం..... మన జీవితాన్ని, ప్రపంచగమనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం అనుకొన్నట్టు కాక దైవ సంకల్పం ప్రకారమే అంతా జరుగుతున్నట్టు మనకు సులభంగనే అర్థమవుతుంది. దైవ సంకల్పం, విధిరాత, కర్మ, అదృష్టం లాంటి పదాలను వాడి కొందరు మేధావులు ఎన్నో అక్రమాలకు ఒడిగట్టిన విషయాన్ని కాదనలేం. అంతా దైవసంకల్పం ప్రకారమే జరుగుతుంది. కాబట్టి నేను ఏమీ చేయకుండా సోమరిగా కూర్చుంటాను అనటమూ తప్పే. మన ప్రయత్నం మనం చేయవలసిందే. మనం అనుకొన్నట్టు జరక్కపోతే నిరుత్సాహపడటం, నిస్పృహకులోనుకావటం, ఆత్మహత్యలకు పాల్పడటం తగదు. ఇక కొంతమంది సాధు పురుషులు దైవ సంకల్పంలో వారి సంకల్పాన్ని ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎలా విలీనం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. స్వామి రామసుఖదాస్‌ 'ఒకటి సాధిస్తే అన్నీ సాధించినట్లే' అనే తమ గ్రంధంలో ఒక కథ చెబుతారు. ఒక బాబాజీ ఉన్నాడు. ఒక రోజు పడవలో ఎక్కడికో వెళుతున్నాడు. ఆయనతో బాటు ఆ పడవలో చాలామంది జనులున్నారు. పడవ ప్రవాహమధ్యానికి చేరింది. ప్రవాహవేగానికి ఒక దిక్కుగా కొట్టుకుపోవడం మొదలుపెట్టింది. .....
Show all...
ఓం నమః శివాయ
Show all...
..... యమునాచార్యుల ద్వారా వైష్ణవ సంప్రదాయాలు వ్యాప్తిలోకి వచ్చినవి. వైష్ణవ భక్తులని ఆళ్వారులు’ అని పిలుస్తారు, 12 మంది ముఖ్య ఆళ్వారులు.. 1) పొయగై ఆళ్వార్, 2) పూదత్తాళ్వార్, 3) పేయాళ్వార్, 4) తిరుమత్తిశై ఆళ్వార్, 5) కులశేఖరాళ్వార్, 6) నమ్మాళ్వార్, 7) మధురకవి ఆళ్వార్, 8) పెరియాళ్వార్, 9) తొండరిప్పడియాళ్వార్, 10) తిరుప్పాణాళ్వార్, 11) తిరుమంగై ఆళ్వార్, 12) శ్రీ ఆండాళ్ దేవి.. వీరిలో బ్రాహ్మణేతరులు, అలాగే ఒక స్త్రీ ఉండడం గమనార్హం.. గ్రంథాలు... భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించారు. వారి గ్రంథాలలో అతి ప్రాచుర్యమైనవి వేదాంత సంగ్రహం’, వేదాలపై భాష్యం, భగవద్గీతా భాష్యం, బ్రహ్మసూత్రాలపై శ్రీ భాష్యం’, వేదాంత సారం’, వేదాంత దీపిక’, గద్యత్రయం’ అనబడే శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం మరియు శ్రీ వైకుంఠ గద్యం. విశిష్టాద్వైతం... శంకరులు ఆత్మకు పరబ్రహ్మ తత్వానికి భేదంలేదని, ఆ తత్వo జీవకోటిలో భాసించడమే అద్వైతమని తెలిపారు. అయితే శ్రీ రామానుజాచార్యులు, ద్వైతం’ తో జీవాత్మ పరమాత్మ వేరు అని కొంత ఏకీభవిస్తూనే, జీవాత్మలలో ఉన్న విశ్వజనీనత కారణంగా, భక్తితో భగవంతుడిని సేవిస్తే, ప్రతి ఆత్మ పరమాత్మ అవగలదని విశిష్టాద్వైత’ తత్వాన్ని విశదీకరిoచారు. విష్ణుభక్తులందరూ వైష్ణవులేనని శ్రీ రామానుజులవారు ఉద్భోధించారు. ఆసేతు హిమాచలం పర్యటించి, విశిష్టాద్వైత సిద్ధాంతాలతో పాటు కులభేదాలు లేని వైష్ణవ వ్యాప్తికి కృషిచేసారు. శ్రీ రంగనాథుని దేవాలయo పూజా విధానాలు సంస్కరించి కొన్ని ముఖ్య పద్ధతులు ప్రవేశపెట్టి, అన్ని కులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించారు. శ్రీరంగం, తిరుపతి, కాంచీపురం మరియు ఇతర వైష్ణవాలయాలలో వారు ప్రవేశపెట్టిన ఆచారాలు, పూజా విధానాలే నేటికీ కొనసాగుతున్నాయి. వారి శిష్యులైన శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ అనంతాళ్వార్ మొదలగు వారు విశిష్టాద్వైతాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేసారు. నేటి చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీ రామానుజుల వారి జన్మస్థలం శ్రీ పెరుంబుదూర్లో వారి ఆశ్రమం, దేవాలయం ఉన్నాయి... ఓం నమః శివాయ
Show all...
శ్రీ రామానుజాచార్యులు వారు..... ఆధ్యాత్మిక ఆకాశoలో వెలిగే సూర్యులలో ముఖ్యులు... శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు.. ఆదిశంకరులు అద్వైత భాస్కరులైతే, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త, రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్త్వవేత్త. శ్రీ రామానుజాచార్యులు వారు సుమారు వేయి సంవత్సరాల క్రితం శ్రీ పేరుంబుదూర్ లో 11వ శతాబ్దం, 1017సంవత్సరంలో కేశవ సోమయాజి, కాంతిమతుల పుత్రుడిగా జన్మించారు. ఆయన గురువు శ్రీ యాదవ ప్రకాశుల వద్ద శిష్యుడిగా చేరి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు అభ్యసిoచారు. కొన్ని అర్ధ తాత్పర్యాలలో గురు శిష్యులకు భేదాభిప్రాయాలు రావడంతో శ్రీ రామానుజాచార్యులు తనంతట తానే అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆయన `ఆళ్వారుల’ సంప్రదాయం ప్రకారం నాధముని, యమునాచార్యుల బాటను అనుసరించారు. వారు యాదవ ప్రకాశుల వద్ద నుండి వెళ్ళిపోయిన తరువాత గురువు మహాపూర్ణులకు శిష్యులై సన్యాసం స్వీకరించారు. కాంచీపురం వరదరాజస్వామి దేవాలయంలో పూజారిగా ఉంటూ పరబ్రహ్మ తత్వం గురించి బోధిస్తూ ముక్తి మార్గం ప్రవచించేవారు. .....
Show all...
ఓం నమః శివాయ
Show all...