cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

Show more
Advertising posts
17 659Subscribers
-124 hours
-277 days
-8230 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

అపూర్వ సన్యాసి ఏదో ఒక సమయంలో, ఏదో దేశంలో ఒక మహాత్ములు పుడతారు. అటువంటి మాహాత్ములే మన గురువు పరమాచార్య, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. మహాస్వామి వారి శాతాబ్ది ఉత్సవాల సందర్భంగా వారికీ నా హృదయపూర్వక నమస్సులు. మహాస్వామి వారి ప్రధాన స్థానమైన కాంచీపురంలో స్వామివారిని ఎన్నోసార్లు దర్శించుకున్నాము. కాని ఎంతో కృతజ్ఞతతో ఈనాటికి మా ఈ స్థాయికి కారణమైన మహాస్వామివారి మహారాష్ట్రలోని సతారా మకాం మాకు అత్యంత చిరస్మరణీయం. ఆరోజు పరమపవిత్రమైన ప్రదోషం. పరమాచార్య స్వామివారు అత్యంత భక్తి, శ్రద్ధలతో చేసే ప్రదోష పూజను చూడడానికి దాదాపు రెండు వందల మంది వచ్చారు. స్వామివారు మెడలో రుద్రాక్షమాల, తలపై బిల్వమాలలతో అత్యంత సుమనోహరంగా, ఆచార్య స్వామిని చూసిన మొదటిసారి పాల్ బ్రంటన్ చెప్పినట్టుగా, “అటువంటి తేజోవంతమైన ముఖం మధ్యయుగంలో క్రైస్తవ చర్చిని అనుగ్రహించిన ఏ మహానియునిదో అయ్యుంటుంది. కాని ఇక్కడ అది అత్యంత మేధోసంపత్తితో కూడుకున్నది కూడా” ఉన్నారు స్వామివారు. పూజ పూర్తయ్యి, స్వామివారు భక్తులకు తీర్థం ఇస్తున్నారు. మా నాన్నగారి వంతు రాగానే, తన గురించి, తను చేస్తున్న పని, కుటుంబం, మేము వచ్చిన బాంబే గురించి చెప్పగానే, స్వామివారు ఆసక్తితో ఎన్నో ప్రశ్నలను అడిగారు. భారత ఓడ నిర్మాణ రంగం, వాటిపై ప్రభుత్వ నియంత్రణ, సంస్థల కార్యాచరణ వాటి అధిపతులు ఇలా. అతి సూక్ష్మ విషయాలను కూడా స్వామివారు అడగడం మమ్మల్ని విస్మయపరచింది. అది మామిడి పళ్ళ కాలం కావడంతో సామి సమర్పణకు మేము తెచ్చిన పళ్ళను అక్కడున్న భక్తులకు ఇమ్మని సేవకులకు ఇచ్చాము. ఇద్దరు విదేశీయులు, ఎంతో వినమ్రతతో, భక్తితో పంచె, అంగవస్త్రం వేసుకుని హిందూ బ్రాహ్మణ వేషధారణలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చారు. కాని మనవాళ్ళే వాటిని వదలివేసి అదేమీ నియమం కాదు అన్నట్టుగా ఉనడ్డం మాకు చాలా సిగ్గుగా అనిపించింది. మరోసారి కాంచీపురంలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, అక్కడున్న భక్తులందరికీ కాగితం, కలం ఇవ్వమని శిష్యులను సైగలతో ఆదేశించారు స్వామివారు. శిష్యులను ఓకే శ్లోకాన్ని చెప్పమని, దాన్ని భక్తులతో వ్రాయించి, వారితో గూడ చెప్పించి, ఇతరులకు ఇవ్వమని ఆజ్ఞాపించారు. మంచి వర్షాల కోసం భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఈ శ్లోకం. ఆ భక్తుల గుంపులో బాంబే నుండి వచ్చిన వారు కూడా ఉండడంతో, బాంబే వారు పఠించనవసరం లేదని ఎందుకంటే, ఈ సంవత్సరం అక్కడ ఎక్కువగానే వర్షాలు పడ్డాయని పరిహాసమాడారు స్వామివారు. --- ప్రభా దేవి. “kamakoti.org” నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Show all...
పరమాచార్య స్మృతులలో 1964లో వేసవి కాలంలో ఒక రోజు. కుటుంబంతో మద్రాసు నుండి విహార యాత్రకు వెళ్ళి మహాబలిపురం, తిరుకాళికుండ్రం నుండి తిరిగోస్తున్నాము. చంగల్పేట్ వద్ద ‘కాంజీవరం వైపుకు’ అన్న సైన్ బోర్డు చూసి, కారు డ్రైవరుకు కారును ఎడమవైపు పోనిచ్చి ‘దేవాలయాల నగరానికి’ వెళ్ళమని చెప్పాను. మేము కంచి చేరుకునేటప్పటికి సాయింత్రం ఐదు గంటలు అయ్యింది. వరదరాజస్వామి, ఏకాంబరేశ్వరుడు, కామాక్షి దేవాలయలాను చూసుకుని పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం శ్రీ శంకర మఠానికి వెళ్ళాము. అప్పుడు స్వామివారు కంచికి దగ్గరలోని కిళాంబి అనే కుగ్రామంలో మకాం చేస్తున్నారని తెలుసుకుని అక్కడకు బయలుదేరాము. అక్కడి గ్రామస్తుడు ఒకరు మమ్మల్ని పలకరించి మహాస్వామివారు ఇప్పుడే కామాక్షి పూజకు ముందు చేసే గజపూజ మొదలుపెట్టారని, త్వరగా వెళ్ళమని చెప్పాడు. గజపూజ, కామాక్షి పూజ అయినతరువాత అక్కడున్న మేనేజరును స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవచ్చు అని అడుగగా, మమ్మల్ని కొద్దిసేపు వేచియుండి తరువాత దగ్గర్లోని చిన్న నది ఒడ్డున దర్శించుకోవచ్చు అని తెలిపారు. అక్కడ స్వామివారు దర్భాసనంపై కూర్చుని సంధ్యవార్చుకుంటున్నారు. మేము స్వామి వారి ముందు నేలపై పడి నమస్కరించాము. స్వామివారు నా భార్య సుబ్బలక్ష్మి వైపు చూసి, “నీవు నా సహాధ్యాయి తిరువిసైనల్లూర్ స్వామినాథన్ సోదరుని మనవరాలివి కదూ? వారి అబ్బాయి సుందరామన్ 1935లో S.S.L.C. పాసయ్యాడా?” అని అడిగారు. అతను ఆ సంవత్సరం కాక మరుసటి సంవత్సరం పాసయ్యాడని చెప్పింది. మాది మాన్ కొంబు అని నేను తెలుపగా, వెంటనే స్వామివారు “నువ్వు నా కుంబకోణం ఎక్స్ రే డాక్టర్ యం.కె. సాంబశివన్ సోదరుని కొడుకువి” అని చెప్పారు. స్వామివారు మా రెండో అబ్బాయి నటరాజన్ వైపు చూసి, తనని డాక్టర్ చెయ్యాలని అనుకుంటున్నావా అని అడుగగా, స్వామివారి ఆశీస్సులతో ప్రయత్నిస్తాను అని తెలిపాను. స్వామివారి ఆశీస్సుల ప్రకారం 1966లో మద్రాసు వివేకానంద కాలేజిలో ప్రి యూనివర్సిటీలో చేరేటప్పుడు బైయాలజి గ్రూపు తీసుకొమ్మని చెప్పాను. అతను ఉత్తీర్ణుడైన తరువాత యం.బి.బి.యస్ కు ఎంపికయ్యాడు. కాని రుసుం కట్టడానికని వెళ్ళినప్పుడు తన పేరు అందులో లేదు. తనని ప్రెసిడెన్సి కళాశాలలో బి.యస్సి., రసాయన శాస్త్రం చదవమని చెప్పాను. 1969లో అత్యంత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యి, వంద మందికి అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ కోటాలో యం.బి.బి.యస్ కు దరఖాస్తు చేసుకున్నాడు. కాని దేశం మొత్తంలో అత్యంత ఉత్తమ శ్రేణిలో ఉన్న ఐదుగురి అవకాశం ఉన్న యు.డి.సి.టి, బాంబేలో బి.టెక్ కు ఎంపికయ్యాడు. డాక్టర్ అయ్యే అన్ని ఆశలు పోయాయి. ఒకరోజు ఉదయం, వెంటనే స్టాన్లీ వైద్య కళాశాలో చేరాల్సిందని మద్రాసు ఎంపిక సంఘం నుండి టెలిగ్రాం వచ్చింది. ఇది జరిగింది డి.యం.కె ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 1964లో మహాస్వామివారు ఆశీర్వదించి చెప్పిన జోస్యం నిజమయ్యి మా అబ్బాయి ఎంపికయ్యాడు. ఈరోజు మా అబ్బాయి నటరాజ్ రేడియాలజిస్ట్ గా మద్రాసులోని మూలక్కడైలో పేదవారికి వైద్య సహాయం అందిస్తున్నాడు. ఇవి మహాస్వామివారి ఆశీస్సులు. నా అజీవితంలో మరచిపోలేని రెండో సంఘటన 1978లో మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు జరిగింది. పరమాచార్య స్వామివారి భక్తురాలైన శుభశ్రీ, పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న సండూరుకు వెళ్లి ఎందుకు దర్శించుకోరాదు అని నన్ను అడిగింది. నేను వెంటనే బయలుదేరి, మరుసటిరోజు ఉదయానికల్లా చిన్న దేవలాయంలో జపం చేసుకుంటున్న మహాస్వామివారి ముందు నిలబడ్డాను. స్వామివారు సైగలతోనే నన్ను గుర్తుపట్టానని తెలిపి, అంతకు ముందు రోజే ప్రదానమంత్రి ఇందిరా గాంధి రావాల్సిఉన్నిందని తెలిపారు. ఇతురుల వలెకాక కేవలం భక్తితో నేను అక్కడకు వచ్చానని తెలిపారు. స్వామివారు నన్ను ఆశీర్వదించాక ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1982లో మూడోసారి స్వామివాతో అతి ముఖ్యమైన సమావేశం గుల్బర్గ దగ్గర్లోని మహాగావ్ లో మకాం చేస్తున్నప్పుడు. నేను, నా భార్య ఉదయం ఐదుగంటలప్పుడు కారులో బయలుదేరి ఊరి శివార్లలో ఉన్న ఒక చిన్న సత్రం వద్ద కారు ఆపుతుండగా, ఒకావిడ పరిగెత్తుకుంటూ వచ్చి, త్వరగా అలోపలకు రమ్మని నా భార్యకు చెప్పింది. పరమాచార్య స్వామివారు మాకోసం వేచియున్నారని, వెంటనే లోపలకు తీసుకునిరమ్మన్నారని తెలిపింది. అసలు మేము వస్తున్నట్టు స్వామివారికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాము. మేము లోపలకు వెళ్ళగానే, స్వామివారు తమ శిష్యునితో ఈమె తన సహాధ్యాయి సోదరుని కూతురని, నేను మాన్ కొంబు డా. యం.కె. సాంబశివన్, కుంబకోణం అని సైగలతోనే తెలిపారు. వారు మమ్మల్ని ఆశీర్వాదించి, అక్కడున్న అందరి భక్తులని సత్రంలో భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. ఈ సందర్శనం తరువాతనే మాకు రెండేళ్ళ పాటు ప్రపంచాన్ని ముఖ్యంగా యు.కె, ఐరోపు, యు.యస్.ఏ. చూసే అవకాశం లభించింది. 1987 మే 24న న్యూయార్క్ లో ఉన్నప్పుడు అక్కడున్న వినాయక ఆలయానికి వెళ్ళాము. మేము లోపలకు వెళ్ళగానే, ఆకడున్న అర్చకులు నన్ను పేరుపెట్టి పిలిచారు. మద్రాసులో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి నాచేత పాదపూజ చేయించింది ఆయనే అనే తెలిపారు.
Show all...
పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం రెండేళ్ళ పాటు తను ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఇది నా అరవయ్యో జన్మదినమా అని ఆయన అడుగగా, నేను డెబ్బైయవది అని తెలిపాను. అయితే అది సంపత్ పూర్తీ అని, మహాస్వామివారి అనుగ్రహం వల్ల ఆరోజు ఆ దేవాలయంలో పూజ చేయించుకుంటున్నానని చెప్పారు. పరమేశ్వరావతరమైన పరమాచార్య స్వామివారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాకు గుర్తుకువచ్చిన కొన్ని సంఘటనలు ఇవి. నేను, నా కుటుంబ సభ్యులు అందరమూ పరమాచార్య స్వామివారు చిరకాలం జీవించాలని, వారి ఆశీస్సులతో విశ్వశాంతి, సర్వ మానవ సౌభ్రాతత్వము వెల్లివిరియాలని కోరుకుంటున్నాము. --- ‘కైంకర్య శిరోమణి’ కె. పద్మనాభన్. “kamakoti.org” నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Show all...
తలపై భారం - కంట్లో నీరు పండానైనల్లూర్లోని శ్రీ పందాడు నాయకి పశుపతినాథ స్వామి దేవాలయంలోని శ్రీ విష్ణు దుర్గా అమ్మవారి కంటికొనలలో నుండి నీరు స్రవించడం భక్తులందరూ ప్రత్యక్షంగా చూశారు. ఇది 1986 ఫెబ్రవరి 19న జరిగింది. వారు పరిగెత్తుకొచ్చి నాకు ఆ విషయం చెప్పగా నేను కూడా వెళ్ళి చూశాను. అమ్మవారి కళ్ళల్లో నుండి నీరు కారుతోంది. అమ్మవారిని అలా చూస్తున్న మా బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక కన్నెపిల్లను దుర్గా స్వరూపంగా భావించి ఆమెకు పూజ చేయడానికి సిద్ధం చేశాను. ఆ కన్నిక దుర్గకు మంగళద్రవ్యాలు సమర్పించి, నవాక్షరి మంత్రజపం చేశాను. “తల్లీ ఏమిటి మా దోషం?” అని అమ్మవారిని అడిగాను. దుర్గా స్వరూపంగా ఉన్న ఆ కన్నెపిల్ల మాతో, “నాకు పచ్చని పట్టు లంగా కట్టుకున్న ఒక అమ్మవారి స్వరూపం కనపడి ‘నా భారం తొలగించండి’ అని అన్నదని” మాతో చెప్పింది. తరువాత మేము ప్రత్యేక అభిషేకము ఆరాధనలు చెయ్యడంతో విష్ణు దుర్గా అమ్మవారి కళ్ళ వెంట నీరు కారడం ఆగిపోయింది. ఈ విషయాన్ని పరమాచార్య స్వామివారికి తెలిపి వారినుండి వివరణ ఏమిటో తెలుసుకోవాలని మేము కంచి బయలుదేరాము. మహాస్వామివారు మాకు ఇరవైఅయిదు లీటర్ల గంగాజలం ఇచ్చి, లక్ష ఆవృత్తుల నవాక్షరి మంత్రజపంతో ఆ నీటిని బలోపేతం చేసి విష్ణు దుర్గకు అభిషేకం చేసి నా వద్దకు రండి అని చెప్పారు. నాలుగునెలల తరువాత స్వామివారు చెప్పినట్టుగా చేసి కాంచీపురం దగ్గర్లోని ఒరిరుక్కైలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాము. అమ్మవారి కళ్ళల్ళో నుండి వస్తున్న నీరు ఆగిపోయిందని స్వామివారికి నివేదించాను. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, “అమ్మవారికి పైకప్పు తగులుతోందా?” అని నన్ను అడిగారు. ప్రతిరోజూ పూజ చేస్తున్నా నేను ఆ విషయం అంతగా ఎప్పుడూ గమనించలేదు. అందుకే నేను స్వామివారితో, “నేను అంతగా గమనించలేదు. వెళ్ళి చూసివచ్చి చెబుతాను” అని చెప్పాను. నేను తిరిగివెళ్ళి ఒక తాడుని అమ్మవారి తలకు పైకప్పుకు మధ్య ఉంచి చూడగా, స్వామివారు అనుమానపడ్డట్టు ఆ పైకప్పు అమ్మవారి తలను తాకుతోంది. కాస్త పరిశీలించగా గోడలో పడిన ఒక చీలిక వల్ల పైకప్పు కొద్దిగా వాలి అది అమ్మవారి తలను తాకుతోంది. మేము మరలా స్వామివారిని కలిసి ఈ విషయం చెప్పాము. దుర్గా అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి, పైకప్పును కాస్త లోతుగా చేసి, అమ్మవారిని పీఠంపై పునః ప్రతిష్టించి కుంబాభిషేకం నిర్వహించండని స్వామివారు ఆదేశించారు. స్వామివారి అదేశం ప్రకారం మార్పులుచేసి 1987లో తై మాసంలో కుంబాభిషేకం నిర్వహించాము. ప్రసాదం తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చాము. మహాస్వామివారు విశేషాలన్నిటిని తెలుసుకొని ప్రసాదాన్ని స్వీకరించారు. “మీ ఊరి ప్రజలు చాలా అదృష్టవంతులు. అమ్మవారు అలా కన్నీరు కార్చడం మీకందరకూ అనుగ్రహాన్ని ప్రసాదించడానికే” అని స్వామివారు మాతో అన్నారు. మేము అలా స్వామివారితో మాట్లాడుతూ ఉండగా ఒక గుజరాతీ భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారు తనితో కాసేపు మాట్లాడారు. తరువాత మావైపు చూసి, “మీరు ఇక్కడికి రావడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది?” అని అడిగారు. “దాదాపు మూడువందల రూపాయలు అవుతుంది” స్వామివారు ఆ గుజరాతీ భక్తుణ్ణి మాకు మూడువందల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అతను స్వామివారి ఆదేశాన్ని శిరసా వహించి పరమసంతోషంతో మాకు ఇచ్చాడు. భవంతుణ్ణి తాకి పూజించే శివాచార్యులంటే పరమాచార్య స్వామివారికి అపారమైన కరుణ. మా బాగోగుల కోసం వారు నిత్యమూ శ్రమించేవారు. పరమాచార్య స్వామివారు కేవలం విష్ణు దుర్గ అమ్మవారి తలపైన ఉన్న భారాన్నే కాదు మా గుండెల్లో ఉన్న భారాన్ని కూడా తొలగించారు. కేవలం ఆ చంద్రశేఖరుడు తప్ప ఎంకెవ్వరు ఇలాంటి ఆదేశం ఇవ్వగలరు? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। --- శివశ్రీ జగదీశ శివాచార్య, పండానైనల్లూర్. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2 #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Show all...
ఆసనం - శాసనం 1966 జనవరిలో మహాస్వామివారు ఎలవూర్ లో మకాం చేస్తున్నారు. అక్కడినుండి ఆహ్వానం అందటంతో నేను ఎలవూర్ వెళ్ళి మహాస్వామివారి దర్శనం చేసుకున్నాను. వారు నాతో చెన్నైలో అనుకోకుండా ఒక అపూర్వ సదస్సు ‘మహానాడు’ జరగబోతోందని, అందులో తమిళనాడుకు చెందిన అందరు మఠాధిపతులు హాజరుకానున్నారు. వారు నన్ను “నువ్వు కూడా మాతోపాటు ఆ మహానాడుకు వచ్చి అక్కడ మాట్లాడే ప్రతి విషయము సంగ్రహంగా వ్యావలసినదని” ఆజ్ఞాపించారు. నేను వారి ఆజ్ఞను పాటించాను. ఫెబ్రవరి 6 & 7 తేదీలలో ఆ మహానాడు సదస్సు చెన్నైలోని కమీషనర్ ఆఫ్ హిందూ చారిటబల్ అండ్ ఎండౌమెంట్స్ బోర్డ్(HR & CE) కార్యాలయ భవనంలో జరిగింది. ఆ రెండు రోజులపాటు ప్రణాలికా బద్ధంగా ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా అన్ని కార్యక్రమాలు జరిగాయి. మహానాడు మొదటి రోజున ఉదయం సభ మొదలవ్వడానికి ముందు పరమాచార్య స్వామివారు చేసిన ఒక పని వల్ల ఆహ్వానితులైన పీఠాధిపతులకు ఎటువంటి మానసిక క్షోభ, వేదన, అధికులమన్న గర్వం, చేదు జ్ఞాపకలాను మిగలకుండా చేశాయి. అందరి మనస్సులు తేలికపడి సర్వులకూ ఆనందం కలిగేలా చేసింది. మొత్తం మహానాడు ఫలించడానికి ఇది పునాదిగా పనిచేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది శ్రీమఠం మూలసిద్ధాంతాన్ని ఆచరించి చూపినట్టయ్యింది. ఈ మహానాడుని HR & CE కమీషనర్ నిర్వహించారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఈ ఉత్సవంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కూర్చోవడానికి వీలు లేదు. మహానాడు ఆహ్వానితులైన మఠాధిపతుల్లో ఎవరు మధ్యలో కూర్చోవాలి, వారికి కుడివైపున ఎవరుండాలి, ఎడమవైపు ఎవరుండాలి, ఎవరికి ఎటువంటి ఆసనం వేయ్యాలి వంటివన్నీ ప్రభుత్వం ఆజ్ఞప్రకారం జరగాలి. వారి ప్రొటోకాల్ లోని శ్రేణుల ప్రకారమే ఆసనాలను వేసి వాటిపైన ఆ సంబంధించిన మఠం పేర్లు కూడా రాయబడ్డాయి. మహానాడు ప్రారంభ వేడుకకు తిరువావదుతురై, ధర్మపురం, తొండైమండల ఆధీనకర్తలు, తిరుప్పనండాల్, కాంచీపురం, మదురై, కుండ్రక్కుడి, మయిలం ఇలా ఎంతోమంది మఠాధిపతులు పాల్గొనడానికి వచ్చారు. కమీషనర్ వారిని ఒక్కొక్కరిగా ప్రొటొకాల్ ప్రకారం ఆహ్వానించి సభాస్థలికి తీసుకుని వచ్చారు. కంచి మహాస్వామివారు వేంచేశారు. ఒక్కసారి సభాస్థలినంతా కలయజూసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంతటి గంభీరమైన పరిస్థితులనైనా వారు తమ వాత్సల్యపూరిత నవ్వుతో తేలికపరచగలరు. ఆ నగుమోముతోనే వారికి కేటాయించిన ఆసనం వైపు వెళ్ళారు. అందరు మఠాధిపతులు కూడా వారికి కేటాయించిన ఆసనాలవైపు వెళ్ళారు. చెరువులో స్నానానికి ముందు ఎలాగైతే నీటిపై ఉన్న నాచును తొలగించడానికి రెండు చేతులతో నీటిని వేరుచేస్తామో, కూర్చోవాలంటే ఎలాగైతే పైపంచతో నేలపైన ఉన్న దుమ్ముని దులుపుతామో అలా స్వామివారు అధికారులు కేటాయించిన ఆ ఆసనాన్ని రెండు చేతులతో వెనక్కు తోసి అదే స్థానంలో నేలపైన కూర్చుండిపోయారు. వెంటనే అందరు మఠాధిపతులు వారికి కేటాయించిన ఆసనాలలో కాకుండా చక్కగా నేలపైన కూర్చున్నారు. ఆ సభాస్థలిలోని నేల అందరికి సమస్థానం అయ్యింది. కంచి పరమాచార్య స్వామి వారి అతిశయాన్ని ఏమని చెప్పగలం. ‘వేదములకు ఆవల నిలబడినటువంటి ఆ జ్ఞానమూర్తి’ ముందుచూపుతో సూక్ష్మ దృష్టితో, ‘జీవాత్మ - పరమాత్మ’ ఒక్కటే అనే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించి ఆచరించి చూపారు. ఈ భువిపై నివసించేవారికి డబ్బు కులం వల్ల వచ్చిన గొప్పదనమేంటి? లేనివాడికి వచ్చిన చిన్నతనమేంటి? అందరిది ఒకే కులం, ఒకే జాతి. “అహం బ్రహ్మాస్మి” “ప్రజ్ఞానం బ్రహ్మ” “అయమాత్మా బ్రహ్మ” “తత్వమసి” #KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం
Show all...
జయ జయ శంకర !! హర హర శంకర !! పరమాచార్య స్వామివారి దివ్యానుగ్రహంతో మీ అందరి సహాయ సహకారాలతో సంవత్సరం క్రితం పరమపవిత్రమైన కాశీ క్షేత్రంలో బదరీ నారాయణ్ ఘాట్ లో కొలువున్న కాశీఖండోక్త శ్రీ నరనారాయణేశ్వర్/నాగేశ్వర్ మహాదేవుని ఆలయం పునర్నిర్మాణం పూర్తిచేసి, చైత్ర కృష్ణ ఏకాదశి నాడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురు దంపతుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం, తొలిపూజ చేసుకున్నాము. ప్రథమ వార్షికోత్సవం (మే 4న) సందర్బంగా దేవాలయానికి రంగులు, స్వామివారికి ఇత్తడి కవచం చేయించి నూతన శోభను చేకూర్చే అవకాశం ఈశ్వరుడు మనకు కల్పించాడు. ఈ సందర్బంగా నాగేశ్వర్ మహాదేవునికి వార్షికోత్సవ పూజ మరియు నారాయణ సేవ ఏర్పాటు చేయడమైనది కావున మనందరమూ ఈ సేవలో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులమవుదాం. విరాళాలు పంపదలచినవారు Google Pay / Phone Pay / BHIM / freecharge / Paytm ద్వారా UPI ID : 7259859202@hdfcbank ఉపయగించి చెయ్యవచ్చు. ట్రస్టు బ్యాంకు అకౌంటు వివరాలు A/C Name: Kanchi Paramacharya Dharmika Seva Trust A/C. Num: 50200059599164 IFSC Code: HDFC0001753 A/C Branch: Kanakapura Road, Bengaluru అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Show all...
రెండు గంటల నిరీక్షణ నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని. అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు. నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు. నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు; అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు. వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు. మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు. ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము. “అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు. “మీరు ఇచ్చినదే తీసుకున్నాను” “లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు” అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ, “అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు. ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!! మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము. --- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Show all...
అధర్మం – అనారోగ్యం రెండు కిడ్నీలు పనిచెయ్యడం లేదు. బ్రతకడం చాలా కష్టం. చాలా మంది నిపుణుల వద్ద చూపించుకున్నాడు. ఎంతో ధనం ఖర్చు చేశాడు, వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడాడు. కాని ఏమి ఉపయోగం లేదు. అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. మామూలుగా అటువంటి బాధలతో వచ్చే వారిపై స్వామివారు చాలా కరుణ దయ చూపిస్తారు. వారితో ఎంతో అనునయంగా మాట్లాడుతారు. కాని ఆరోజు స్వామివారు తమ పలుకుల్లో కొంచం కాఠిన్యం వహించారు. ”మనుషులు లెక్కలేనన్ని తప్పులు, అధార్మికమైన పనులు చేసి వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక్కడకు వస్తారు. వారు చేసిన తప్పులను మాత్రం తెలుసుకోరు. అందుకు నేనేమి చెయ్యగలను?” అని అన్నారు. హఠాత్తుగా ఎందుకు మహాస్వామివారు ఇలా అంటున్నారో ఎవరికి అర్థం కావడంలేదు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడుతూ, “ఇతని పూర్వీకులు ధర్మాచరణకోసం, మంచిపనులు చెయ్యడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అందుకోసం మంచి ఆదాయం వచ్చే భూమిని వదిలివెళ్ళారు. మంచినీటి బావులు తవ్వించడం కోసం, ధార్మికమైన పనులకోసం ఈ పని చేశారు. కాని ఇతను ఆ భూమిని అమ్మి వచ్చిన ధనాన్నంతా దాచుకున్నాడు” అని అన్నారు. కిడ్నీ సమస్యతో వచ్చిన ఆ వ్యక్తి ఇదంతా విని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. “ఇప్పటినుండి నేను కూడా మంచినీటి బావులు తవ్వించి ధార్మికమైన పనులు చేస్తాను. నన్ను మన్నించి అనుగ్రహించండి పెరియవ” అని వేడుకున్నాడు. మహాస్వామివారు వెంటనే కరుణాసముద్రులై “వసంబు(వస) తెలుసా నీకు? మూలికలు అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని బాగా నూరి రోజూ కడుపుకింది భాగంలో పూయి” అని సెలవిచ్చారు. పది పన్నెండు రోజుల తరువాత అతను మరలా వచ్చాడు. మహాస్వామివారు అడగక ముందే అతను స్వామివారితో, ”ఇప్పుడు ఏ బాధా లేదు” అని చెప్పాడు. ధన్వంతరీ స్వరూపమైన ఆ సర్వేశ్వరుడే మందిచ్చిన తరువాత ఇంకా ఆ జబ్బు ఉంటుందా? --- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. t.me/KPDSTrust #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Show all...
మాయమయ్యే మహాస్వామి కుంభకోణం సమీపంలోని కుగ్రామంలో ఒక మండువా ఇంటిలో శ్రీవారు బసచేసి ఉన్నారు. స్వామివారిని దర్శించడానికి మన దీక్షితులుగారు పరిచారకులను అడిగి తెలుసుకును స్వామివారున్నారన్న గదిలోనికి ఓరవాకిలిగా మూసిఉన్న తలుపు తీసుకుని ప్రవేశించారు. అక్కడ స్వామివారు కూర్చునే ఆసనం ఉన్నది. కమండలం ఉన్నది. కాషాయ ఖద్దరు శాఠీలున్నాయి. స్వామివారు కన్పించలేదు. బయటకు వెళ్లి ఉండవచ్చని గుమ్మం దగ్గరే కూర్చున్నారీయన. ఎంతసేపయినా అలికిడి లేదు. పరిచారకులు మాత్రం స్వామివారు గదిలో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు. గంట గడిచాక ఉండబట్టలేక దిక్షితులుగారు పరిచారకుణ్ణి “స్వామివారు ఎక్కడ?” అని అడిగారు. “లోపల జపం చేసుకుంటున్నారు కదా! మీరు వెళ్లి చూసివచ్చి మళ్ళి అడుగుతారేమ” న్నాడు పరిచారకుడు. లోపల లేరని తెగేసి చెప్పారు దీక్షితులు గారు. ఇద్దరూ కలిసి లోపలికి ప్రవేశించారు. ఆచమనం చేస్తూ స్వామి అగుపించారు. “ఇందాక నేను చూసినప్పుడు మీరు అదృశ్యమైనారు” అన్నారు దీక్షితులు గారు. స్వామీ సమాధానంగా చిరునవ్వు నవ్వారు. ఈయనకోక్కరికే కాదు ఇటువంటి అనుభూతి. తెనాలి సీతమ్మగారు ఇటువంటి అనుభూతి పదే పదే చెప్పేవారు. దక్షిణాదిన ఒక గ్రామంలో దర్భపొదల మధ్య మేనా దింపి బోయీలు విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిచారకులందరికి కునుకు పట్టింది. సీతమ్మ గారి భర్తకి స్వామివారిని తక్షణమే చూడాలన్న ఆవేశం పుట్టుకొచ్చింది. మేనా తలుపు తీసి చూశారు. లోపల స్వామీ కన్పించలేదు. అనుమానం వచ్చి హారతి వెలిగించి చూశారు. అబ్బే! స్వామి లేరు, పారిశాడులను బోయీలను లేపారు. మేనా తలుపు తీసి చూశామంటే వారేమంటారో అని “లోపల స్వామివారున్న అలికిడి లేదు చూడ”మన్నారు. వారు “తలుపులు మూసుకునే లోపల ఉంటారు. మీరు విశ్రాంతి తీసుకోండి” అని గట్టిగానే చెప్పారు. సితమ్మగారికి, భర్తకి, పిల్లవానికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. భార్యాభర్తలు పిల్లవాడు మీనాకు చేరోకప్రక్కన కూర్చుని ధ్యానం చేస్తూ గడిపారు. మూడు గంటలకు పహారా వాళ్ళు, బోయీలు, పరిచారకులు నిద్రలేచి క్రొత్త కాగడాలు వెలిగించి “రామో రామయ్యా” అంటూ మేనా ఎత్తగానే తలుపు తీసి చిరునవ్వు నవ్వుతూ చేయెత్తి ఆశీర్వదిస్తున్నారు స్వామివారు. మహాభక్తురాలు సీతమ్మ. స్వామివారియెడ పుత్రప్రేమ. “రాత్రంతా మమ్మల్ని భయభ్రాంతుల్ని చేశారు. ఎక్కడికి అదృశ్యమైనారు” అని గట్టిగా అడిగింది. అంత తేలికగా పట్టుబడతారా స్వామివారు. వెన్నెల విరిసినట్లు చిరునవ్వులొలకబోశారు. మా స్వామివారి చిరునవ్వు సొగసులో ఎవరైనా సరే కొట్టుకొనిపోవలసినదే! ప్రశ్నించేందుకు ఆ క్షణంలో మనస్సు ఉండదు. --- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Show all...