cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

GK and Current Affairs Telugu

🚩 Channel was restricted by Telegram

Show more
Advertising posts
9 999Subscribers
No data24 hours
-487 days
-27030 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

*🌏చరిత్రలో ఈరోజు ( జులై- 21 )🌏* *🔎సంఘటనలు🔍* 🌾1949: అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని 82-13 ఓట్లతో రద్దు చేసింది. 🌾1954: జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు. 🌾1954: ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది. 🌾1959: ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది. 🌾1960: సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా, మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (1960 జూలై 20 అని కూడా అంటారు) 🌾1960: అఫ్రికాలో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది. 🌾1961: మెర్క్యురీ 4 (మెర్క్యురీ - రెడ్‌స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం) 🌾1965: పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్రాంతీయ సహకార సంధిని చేసుకున్నాయి. 🌾1978: ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, 'సెయింట్ బెర్నార్డ్' జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి. 🌾1980: జీన్ క్లాడ్ డ్రోయెర్, పారిస్ లోని ఈపిల్ టవర్ని 2గంటల 18 నిమిషాలలో ఎక్కాడు. 🌾1983: పోలిష్ ప్రభుత్వం 19 నెలల మార్షల్ లాని ఎత్తివేసింది. 🌾1983: ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషను, అంటార్క్‌టికా ఖండంలో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది. 🌾1984: తూర్పు జర్మనీకి చెందిన 'మారిటా కోచ్' 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 🌾1988: ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది. 🌾1990: తూర్పు బెర్లిన్లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు. 🌾2005: లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి. 🌾2007: జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది. *🌺జననాలు🌺* ❤️1899: ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత ❤️1923: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2005) ❤️1940: శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. ❤️1947: చేతన్ చౌహాన్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ❤️1961: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.(మ.1988) ❤️1966: అనురాధ (నటి), తెలుగు నృత్యతార, సుమారు 35 చిత్రాలలో నటించింది. ❤️1969: పసునూరు శ్రీధర్ బాబు, పాత్రికేయుడు, కవి. *🥀మరణాలు🥀* 💐1796: రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి 💐1948: అర్షిలె గోర్కీ, అబ్‌స్ట్రాక్ట్ ఎక్ష్‌ప్రెషనిస్ట్, 43వ ఏట. 💐1957: బెర్నార్డ్ స్పూనర్, అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను వ్యక్తి. 💐1998: అలాన్ షెపార్డ్, అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు. అపొలో-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి. 💐2009: గంగూబాయ్ హంగళ్, హిందుస్తాని గాయని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత. 💐2013: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932) *🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳* *🍂1831 : బెల్జియం జాతీయ దినోత్సవము.*
Show all...
💐మరణాలు💐 🍁1937: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874) 🍁1951: జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు. 🍁1972: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930) 🍁1973: బ్రూస్ లీ, ప్రపంచ యుద్ధ వీరుడు. (జ.1940) 🍁1980: పర్వతనేని బ్రహ్మయ్య, పేరొందిన అకౌంటెంట్. (జ.1908) 🍁2019: షీలా దీక్షిత్, దేశ రాజధాని ఢిల్లీకి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.(జ. 1938) 🇮🇳జాతీయ / దినాలు🇮🇳 👉 1810 : కొలంబియా దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది. 👉 అంతర్జాతీయ చెస్ రోజు Share & Join
Show all...
🌎చరిత్రలో ఈ రోజు {జూలై - 20}🌎 🔎సంఘటనలు🔍 🌸1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు. 🌸1868: సిగరెట్లమీద మొదటిసారిగా 'టాక్స్ స్టాంపుల' ను వాడారు అమెరికాలో. 🌸1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది. 🌸1872: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీమొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది. 🌸1878: హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు. 🌸1903: ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది. 🌸1921: న్యూయార్క్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎయిర్ మెయిల్ సర్వీస్ మొదలైంది. 🌸1930: వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్). 🌸1934: అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న 'కియోకుక్' లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్). 🌸1935: లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు. 🌸1944: రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు. 🌸1947: ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని 'యు. సా' ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 🌸1947: 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు. 🌸1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి). 🌸1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే. 🌸1962: కొలంబియాలో జరిగిన భూకంపంలో 40మంది మరణించారు. 🌸1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ. 🌸1969: భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లా పదవిని స్వీకరించాడు. 🌸1974: టర్కీ సైన్యం సైప్రస్ మీద దాడి చేసింది. 🌸1975: 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం) 🌸1976: 'వైకింగ్ 1' అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ 'వైకింగ్ 1' ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద 'క్రిస్ ప్లానిటియా' అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది. 🌸1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది) 🌸1989: బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు 'దా అంగ్ సాన్ సూ క్యి' ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు. 🌸1990: లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ బాంబు పేల్చింది. 🌼జననాలు🌼 💜1785: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు. 💜1822: గ్రెగర్ జాన్ మెండెల్, ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలుకనుగొన్నాడు. 💜1864: ఎరిక్ కార్ల్‌ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు). 💜1892: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (మ.1969) 💜1919: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008) 💜1920: లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950) 💜1933: రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత. 💜1941: వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9) 💜1947: గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ మైక్రోస్కోప్ - నోబెల్ బహుమతి గ్రహీత 1986) 💜1969: గిరిజా షెత్తర్, తెలుగు సినిమా నటి. 💜1980: గ్రేసీ సింగ్, భారతీయ సినీనటి 💜1983: వేణు ఊడుగుల, తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, ఉప్పరపల్లి గ్రామం, చెన్నారావుపేట మండలం, వరంగల్ రూరల్ జిల్లా, తెలంగాణ.
Show all...
*చరిత్రలో ఈరోజు జులై 19న* 🌺 *💫 సంఘటనలు 💫* *1763:* మీర్ కాసిమ్ బ్రిటిష్ వారిచే 'కత్వా' యుద్ధంలో ఓడిపోయాడు. *1848:* యునైటెడ్ స్టేట్స్‌లో మహిళల ఓటుహక్కు ఉద్యమం సెనెకా ఫాల్స్ కన్వెన్షన్ ప్రారంభంతో ప్రారంభించబడింది , ఇది మహిళలకు కొన్ని హక్కులు మరియు అధికారాలను, ముఖ్యంగా ఓటు హక్కును పొందేందుకు ప్రయత్నించింది. *1903:* ఫ్రెంచ్ సైక్లిస్ట్ మారిస్ గారిన్ 2,428 కిమీ (1,508 మైళ్ళు) ప్రయాణించిన మొదటి టూర్ డి ఫ్రాన్స్‌ను గెలుచుకున్నాడు. *1949:* తెహ్రీ గర్వాల్ రాజు ఇండియన్ యూనియన్‌లో విలీనాన్ని ప్రకటించారు. *1956:* తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు. *1969:* భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి. *1979:* సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసిన కారణంగా దాదాపు 60 దేశాలు హాజరు కావడానికి నిరాకరించినప్పటికీ, వేసవి ఒలింపిక్స్ మాస్కోలో ప్రారంభమయ్యాయి ; ఇది ఒలింపిక్ ఉద్యమ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ. *1996:* 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి. *2000:* ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. *🎂 జననాలు 🎂* *1827:* మంగళ్ పాండే 1857 భారత తిరుగుబాటుకు ముందు జరిగిన సంఘటనలలో కీలక పాత్ర పోషించిన భారతీయ సైనికుడు.(మ.1857) *1899:* బలాయ్ చంద్ ముఖోపాధ్యాయ ఒక భారతీయ బెంగాలీ భాషా నవలా రచయిత, చిన్న కథా రచయిత, నాటక రచయిత, కవి మరియు వైద్యుడు. *1902:* సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా పేరొందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968) *1909:* బాలమణి అమ్మ మలయాళంలో రాసిన భారతీయ కవయిత్రి. *1924:* కె.సి.శివశంకరన్, "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. (మ.2020) *1938:* జయంత్ నార్లికర్, భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రం కోసం ఇంటర్-యూనివర్సిటీ సెంటర్‌లో ఎమెరిటస్ ప్రొఫెసర్. *1943:* ప్రేమ్ ప్రకాష్, మలయాళ టెలివిజన్ సీరియల్స్‌లో పనిచేసే భారతీయ నటుడు. *1948:* అల్తామస్ కబీర్ ఒక భారతీయ న్యాయవాది మరియు న్యాయమూర్తి, అతను భారతదేశానికి 39వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. *1954:* దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి. *1955:* రోజర్ బిన్నీ, ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. *1956:* రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, ఆ నలుగురు మంచిపేరు తెచ్చిపెట్టాయి. *1961:* హర్ష భోగ్లే, భారత క్రికెట్ వ్యాఖ్యాత మరియు పాత్రికేయుడు. *1961:* హర్షవర్ధన్ నియోటియా, అంబుజా నియోటియా గ్రూప్ చైర్మన్, కోల్‌కతాలో ప్రధాన కార్యాలయం కలిగిన సమ్మేళనం. *1971:* గుర్‌ప్రీత్ ఘుగీ, భారతీయ నటుడు, హాస్యనటుడు మరియు రాజకీయ నాయకుడు. *1972:* రతుల్ పూరి, హిందుస్థాన్ పవర్‌ప్రాజెక్ట్స్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్. *1975:* ఆశా శరత్, భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి మరియు మలయాళ చలనచిత్రాలు మరియు టీవీ సీరియల్స్‌లో పనిచేస్తున్న నటి. *1979:* మాళవిక, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు. *1983:* సింధు తులాని, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు. *1984:* విక్రమజీత్ విర్క్, భారతీయ మోడల్ మరియు నటుడు. *1984:* అనిత నాయర్, భారతీయ చలనచిత్ర మరియు థియేటర్ నటి మరియు గాయని. *1987:* మధుర నాయక్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ వంటి టెలివిజన్ షోలలో కనిపించిన భారతీయ మోడల్ మరియు నటి. *1989:* శ్రీజితా దే, కలర్స్ టీవీ ఉత్తరన్‌లో ముక్త పాత్ర పోషించిన భారతీయ టెలివిజన్ మరియు చలనచిత్ర నటి. *1991:* రజత్ టోకాస్, భారతీయ టెలివిజన్ నటుడు ధార్తీ క వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, జోధా అక్బర్ చారిత్రాత్మక కార్యక్రమాలలో తన పాత్రలకు పేరుగాంచాడు. 💥 *మరణాలు* 💥 *1965:* అమెరికన్ అడవి-జంతువులను మచ్చిక చేసుకున్న క్లైడ్ బీటీ — తన “పోరాట చర్య”కు పేరుగాంచిన అతను తన ధైర్యాన్ని మరియు అతని నియంత్రణలో ఉన్న క్రూరమైన జంతువులపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడ్డాడు—62 ఏళ్ళ వయసులో మరణించాడు. *1966:* హన్స్ జీ మహారాజ్ సంత్ మత్ సంప్రదాయంలో భారతదేశంలో గురువు. *1968:* ప్రతాప్ సింగ్ గైక్వాడ్ బరోడా యొక్క చివరి పాలక మహారాజు. *1972:* కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901) *1991:* చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (జ.1912)
Show all...
🌎చరిత్రలో ఈ రోజు ( జులై  - 19 )🌎 🔎సంఘటనలు🔍 🌸1956: తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు. 🌸1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి. 🌸1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి. 🌸2000: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 🌼జననాలు🌼 💝1827: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (మ.1857) 💝1902: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా పేరొందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968) 💝1924: కె.సి.శివశంకరన్, "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. (మ.2020) 💝1954: దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి. 💝1955: రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 💝1956: రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నటుడు. 💝1979: మాళవిక, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు 💝1983: సింధు తులాని, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు 💐మరణాలు💐 🍁1972: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901) 🍁1991: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (జ.1912)
Show all...